
సాక్షి, హైదరాబాద్: ట్రాన్స్‌జెండర్ల వ్యవహార శైలిలో మార్పు రావాలని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ట్రాన్స్‌జెండర్ల సంక్షేమంపై వివిధ స్వచ్ఛంద సంస్థలతో నిర్వహించిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ తల్లిదండ్రులు, కుటుంబానికి దూరంగా ఉంటూ కష్టాలు పడుతున్న ట్రాన్స్‌జెండర్లపై ముఖ్యమంత్రి సానుకూలంగా ఉన్నారన్నారు.
భిక్షాటన నివారణకు, ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందన్నారు. ప్రత్యేక కార్యక్రమాల ద్వారా స్వయం ఉపాధిని పెంపొందిస్తామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి దివ్య దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment