
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మీరే బిజీగా ఉంటున్నారా..? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళితబంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిపినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు.
అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది.
(చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’)
(చదవండి: ‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా)
Comments
Please login to add a commentAdd a comment