impatience
-
చంద్రబాబు తీరుపై అధికారుల అసహనం
సాక్షి, అమరావతి: వరద బాధితుల సహాయ కార్యక్రమాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పెద్ద ప్రతిబంధకంగా మారారని అధికారులు వాపోయారు. పనిచేసుకునే సమయం ఇస్తే అప్పగించిన బాధ్యతలను చక్కగా నిర్వర్తించేవారమని వారు చెబుతున్నారు. ఒకపక్క ప్రజలు పీకల్లోతు కష్టాల్లో ఉంటే సీఎం నిరంతరం సమీక్షలు చేయడం, నివేదికల కోసం పట్టుబట్టడం, రోజూ రెండు మూడు విడతలు పర్యటనలు చేస్తుండటంతో ప్రొటోకాల్ ప్రకారం కీలక అధికారులు అంతా ఆయన చుట్టూనే ఉండిపోవాల్సి వస్తోందంటున్నారు. సహాయ కార్యక్రమాలు విఫలం కావడానికి సీఎం తీరే ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఎలా వ్యవహరించాలన్నది డిజాస్టర్ ప్రోటోకాల్ ఉంటుందని, దాని ప్రకారం జిల్లా కలెక్టర్ నడుచుకుంటే పైనుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పర్యవేక్షిస్తే వ్యవహారం సజావుగా సాగిపోతుందని వరద సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్న కీలక అధికారి ఒకరు చెప్పారు. కానీ సీఎం అసందర్భంగా గంటల కొద్దీ సమీక్షలు, ఉపయోగం లేని పర్యటనలు చేస్తుండటంతో సీఎస్, కలెక్టర్, డీజీపీ, ఇతర కీలక శాఖల ఉన్నతాధికారులు, మంత్రులు ఆయనతోనే ఉండిపోతున్నారని, దీంతో కింది స్థాయి అధికారులకు సరైన సమయంలో మార్గనిర్దేశకత్వం కరువయ్యిందని ఆయన పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ఆదివారం అర్ధరాత్రి మూడు గంటల వరకు నాలుగు సార్లు ముంపు ప్రాంతాలను సందర్శించడం, అదే విధంగా కలెక్టర్ కార్యాలయంలో సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహించడంతో అధికారులు తమ విధులను నిర్వర్తించడానికి అవకాశం లేకుండా పోయింది. ప్రచార యావతో మంగళవారం జేసీబీ మీద 22 కి.మీ చంద్రబాబు వరద ప్రాంతాల్లో తిరగడంతో అధికారులు సహాయ కార్యక్రమాలు వదిలేసి ఆయన చుట్టూ పరుగులు పెట్టాల్సి వచ్చింది. ఒకరి వెనుక ఒకరు సమీక్షలుముఖ్యమంత్రి, మంత్రులు గంటల తరబడి సమీక్షలు నిర్వహిస్తుండటంపై అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం కలెక్టర్ కార్యాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహిస్తున్న సమయంలోనే, ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్ పంచాయతీరాజ్ కమిషనరేట్‌లో, సాయంత్రం మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ ఉన్నతాధికారులతో సదీర్ఘంగా సమావేశం నిర్వహించారు. సీఎం, మంత్రుల సమీక్షలు అవ్వగానే, వాటిపై ఉన్నతాధికారులు కింది స్థాయి అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. చంద్రబాబే కాకుండా మంత్రుల కూడా ముంపు ప్రాంతంలో పర్యటనలకు వెళ్లడంతో వారితో కూడా అధికారులు ఉండాల్సి వచ్చింది. ఇలా అధికారులు సమీక్షలకు, సీఎం, మంత్రులతో పర్యటనలకు పరిమితం అవుతుండటంతో క్షేత్రస్థాయిలో పనిచేసే ఉద్యోగులు, అధికారుల మధ్య సమన్వయం కొరవడి మొత్తం వ్యవస్థ కుప్ప కూలింది. కానీ ఆ నెపాన్ని తమపైకి ముఖ్యమంత్రి నెట్టడాన్ని అధికారులు తీవ్రంగా తప్పు పడుతున్నారు. గంటల కొద్దీ టెలీ కాన్ఫరెన్స్లుక్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న ఉద్యోగులను కూడా టెలీకాన్ఫరెన్స్‌లు, నివేదికలు అంటూ వేధిస్తుండటంతో సహాయ పునరావాస కార్యక్రమాలు అటకెక్కాయి. వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న సచివాలయాల సిబ్బందితో ఏకంగా రోజుకు ఐదు విడతలు వివిధ స్థాయి అధికారులు టెలీ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారు. పావు గంట నుంచి గంట వరకు ఈ టెలీకాన్ఫరెన్స్‌లో ఉండాల్సి వస్తోందని సచివాలయ ఉద్యోగులు వాపోతున్నారు. దీనికి తోడు తమకు అప్పగించిన పనికి ప్రతి రెండు మూడు గంటలకొకసారి నివేదికల పేరుతో వివరాల సేకరణ జరుగుతోందని, వీటికే రోజుకు అత్యధిక సమయం సరిపోతోందని పేర్కొన్నారు. ఇలా సమీక్ష సమావేశంలో సిబ్బంది అందరూ ఉంటుండంతో సప్లయ్ చెయిన్ తెగిపోయి ప్రజలకు కనీసం తాగు నీరు కూడా అందించలేకపోయామని ఒక అధికారి వాపోయారు. సరైన కో–ఆర్డినేషన్ లేకపోవడంతో మంచినీళ్లు, పాలు, ఆహార పదార్థాలు పంపిన చోటకే మళ్లీ మళ్లీ పంపించడం జరిగిందని, ఇదే సమయంలో పెద్దఎత్తున ఆహారపదార్థాలు కూడా వృథా అయిపోయాయని అన్నారు. తప్పును మాపై నెడతారా?ఐదు రోజులుగా నిద్రాహారాలు లేకుండా ప్రాణాలకు తెగించి సేవలు అందించడానికి ముందుకు వస్తే.. పని చేయనీయకుండా అడ్డుకొని ప్రజల నుంచి విమర్శలు రావడంతో తప్పును అధికారులపైకి నెట్టడానికి ప్రయత్నించడం దారుణమని ఓ సీనియర్ అధికారి వాపోయారు. సీఎం చుట్టూ సిబ్బంది, ఫోటో, వీడియో గ్రాఫర్లు, రక్షణగా పోలీసులు, వీరికి అదనంగా చంద్రదండు పేరుతో మరో 50 మంది తెలుగుదేశం కార్యకర్తలు వస్తున్నారని, వీరందరినీ సహాయ కార్యక్రమాల్లో వినియోగిస్తే బాగుండేదంటూ ఒక అధికారి ఆగ్రహంగా వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వ హయాంలో ప్రతీ 50 కుటుంబాలకు ఒక వాలంటీర్ ఉండటంతో వారిని సమన్వయం చేసుకుంటూ అధికారులు వేగంగా సహాయాన్ని అందించారని, ఇప్పుడు తెలియని ప్రాంతాలకు అధికారులను పంపడంతో తీవ్రజాప్యం జరుగుతోందని ఆ అధికారి విశ్లేషించారు. -
Delhi High Court : జేమ్స్‌బాండ్ సీక్వెల్సా?
న్యూఢిల్లీ: కేజ్రీవాల్‌ను ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించాలంటూ పదేపదే పిటిషన్లు దాఖలవడంపై ఢిల్లీ హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. ఆప్ మాజీ ఎమ్మెల్యే సందీప్ కుమార్ వేసిన ఈ తరహా పిటిషన్‌పై ఆగ్రహం వెలిబుచ్చింది. ‘‘దీనిపై ఢిల్లీ లెఫ్ట్గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని గతంలోనే స్పష్టం చేసినా పదేపదే అవే పిటిషన్లు వేస్తున్నారు. ఇవేమీ జేమ్స్‌బాండ్ సినిమా సీక్వెల్స్ కావు. వ్యవస్థను వెక్కిరించేలా పిటిషన్లు వేస్తే ఊరుకోం. మీకు రూ.50,000 జరిమానా వేస్తాం’’ అని సందీప్‌ను హెచ్చరించింది. ఆయన తరఫున లాయర్ వాదించబోయినా, ‘‘రాజకీయ ప్రసంగాలు ఇవ్వాలనుకుంటే వీధి చివరికెళ్లి ఇచి్చ రండి. మీ క్లయింట్ నేత కాబట్టి రాజకీయాలు చేస్తారు. మేం రాజకీయాల్లో మునగదల్చుకోలేదు’’ అని స్పష్టం చేసింది. -
వైజాగ్ లో వెలుపెట్టిన పురందేశ్వరి...కూటమిలో కుంపటి
-
25 ఏళ్లయినా..గడువు కోరుతూనే ఉంటారు
సాక్షి, హైదరాబాద్: ఇంకుడు గుంతల ఏర్పాటుకు సంబంధించి పిటిషన్ దాఖలు చేసి 18 ఏళ్లయినా నివేదక అందజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం గడువు కోరడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 25 ఏళ్ల తర్వాత కూడా ఇంకా సమయం కావాలని కోరుతూనే ఉంటారని అసహనం వ్యక్తం చేసింది. మూడు వారాలు సమయం ఇస్తున్నామని, కొత్తగా నిర్మించే భవనాల్లో ఇంకుడుగుంతల ఏర్పాటుపై అమికస్ క్యూరీ చేసిన సూచనలపై ఏ చర్యలు తీసుకున్నారో నివేదిక అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 5వ తేదీకి వాయిదా వేసింది. హైదరాబాద్‌లో నీటికొరతపై సుభాష్‌చంద్రన్ 2005లో హైకోర్టుకు లేఖ రాశారు. దీనిని న్యాయస్థానం విచారణకు స్వీకరించింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్‌అరాధే, శ్రవణ్‌కుమార్ ధర్మాసనం శుక్రవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ పిటిషన్లో అమికస్ క్యూరీ సీనియర్ న్యాయవాది డి.ప్రకాశ్‌రెడ్డి నివేదిక సమర్పించారు. ప్రస్తుతం నీటికొరత అంతగా లేకపోయినా, భవిష్యత్ అవసరాల నిమిత్తం సంరక్షణ చర్యలు చేపట్టాల్సి ఉందని, భవన నిర్మాణాలకు అనుమతులు ఇచ్చేటప్పుడే ఇంకుడుగుంత ఏర్పాటు తప్పనిసరి చేయాలన్నారు. వాల్టా చట్టం కింద బోర్ల తవ్వకంపై నియంత్రణ అవసరమని చెప్పారు. దీనిపై నివేదిక అందజేయడానికి గడువు కావాలని ప్రభుత్వ న్యాయవాది ధర్మాసనాన్ని విజ్ఞప్తి చేశారు. దీంతో ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ.. ఏళ్లు గడిచినా ఇంకా గడువు కోరడం సాధారణంగా మారిందని ప్రభుత్వం తీరును తప్పుబట్టింది. 3 వారాలు గడువిస్తూ, విచారణ వాయిదా వేసింది. -
‘ఏయ్ ఆగవయ్యా.. నువ్వాగు!’.. రైతులపై చంద్రబాబు అసహనం
తణుకు: ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్. ఆగవయ్యా.. నువ్వాగు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ రైతులపై ప్రతిపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గంలో రైతు పోరుబాట పేరుతో పాదయాత్ర నిర్వహించేందుకు గురువారం రాత్రి ఇరగవరం వచ్చిన చంద్రబాబు అక్కడ రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన రైతులు ఆయనను నిలదీస్తుండగా చంద్రబాబు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఓ యువరైతు మాట్లాడుతూ.. ‘మీరు సీఎంగా ఉన్నప్పుడు రైతులు నష్టపోతే వైఎస్ జగన్మోహన్రెడ్డి వారి పరిస్థితుల్ని చూసి చలించిపోయారు. రైతులు నష్టపోయిన విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. మీరు అలా ఎందుకు చేయట్లేదు’ అని ప్రశ్నించగా.. అతడిపై చంద్రబాబు కస్సుమన్నారు. ‘ఏయ్.. ఏం మాట్లాడుతున్నావ్ నువ్వు. ముందు నేను చెప్పేది వినవయ్యా’ అంటూ అసహనం ప్రదర్శించారు. ప్రభుత్వ యంత్రాంగం రైతుల నుంచి «ధాన్యం కొనుగోలు చేస్తున్న పరిస్థితులను వివరించేందుకు ప్రయత్నిస్తున్న రైతులను అడ్డుకున్న చంద్రబాబు తాను చెప్పేది మాత్రమే వినాలంటూ ఎప్పటిలా తన సొంత డబ్బా చెప్పుకొంటూ వెళ్లారు. రైతు బిడ్డల్ని కోటీశ్వరులను చేస్తానని, పేదలను ధనికులు చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నానని చంద్రబాబు చెప్పుకొచ్చారు. తాను అధికారంలోకి వస్తే ధాన్యం కొనుగోలులో పాత విధానం తీసుకొస్తానని చంద్రబాబు చెప్పారు. మూడు రోజులపాటు గోదావరి జిల్లాల్లో పర్యటించి 72 గంటల్లో తడిసిన ధాన్యం, మొలకలు వచ్చిన ధాన్యం కొనుగోలు చేయాలని అల్టిమేటం ఇస్తే.. ఇప్పుడు తాను తిరుగుతున్న ప్రాంతాల్లో హడావుడిగా ధాన్యం కొనుగోలు చేస్తున్నారన్నారు. ‘సాక్షి’పై మరోసారి అక్కసు ఈ పర్యటన సందర్భంలో చంద్రబాబు ‘సాక్షి’పై మరోసారి అక్కసు వెళ్లగక్కారు. రైతులను పరామర్శించడానికి వచ్చి రైతులతో మాట్లాడుతుంటే కొందరు సైకో కార్యకర్తలను పంపి గందరగోళం సృష్టించాలని చూస్తున్నారని అన్నారు. దీనిని వక్రీకరిస్తూ ‘సాక్షి’ పేపర్లో ‘చంద్రబాబును అడ్డుకున్న రైతులు’ అని రాస్తారన్నారు. రైతుల ముసుగులో వైఎస్సార్సీపీ కార్యకర్తలు వస్తున్నారని, అప్రమత్తంగా ఉండాలని కోరారు. -
‘బుమ్రా గురించి చర్చ అనవసరం’
బెంగళూరు చేతిలో పరాజయం తర్వాత టాప్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా లేని లోటు గురించి అడిగిన ప్రశ్నపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. గత ఎనిమిది నెలలుగా నేను బుమ్రా లేకుండానే జట్టును నడిపిస్తున్నాను. కానీ ఎవరో ఒకరు అతని స్థానంలో వచ్చి ఆడాల్సిందే. సుదీర్ఘ కాలం దాని గురించే మాట్లాడితే ఎలా. మన నియంత్రణలో ఉండే విషయాల గురించే చెప్పగలం. గాయాలను ఎవరూ నియంత్రించలేరు. మిగతా ఆటగాళ్లలోనూ మంచి ప్రతిభ ఉంది. వారిని ప్రోత్సహిస్తూ మద్దతు పలకడం అవసరం’ అని రోహిత్ అన్నాడు. -
పట్టాభీ.. ఏంటిది?
సాక్షి, ప్రత్యేక ప్రతినిధి: టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరాంపై ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కోపం వచ్చింది. అన్నీ ఇలాగే చేస్తున్నాడంటూ అసహనం వ్యక్తం చేయడంతో పాటు ముందే దూరం పెట్టి ఉంటే పార్టీ ఇంతగా భ్రష్టుపట్టింది కాదని కూడా అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది. అంతేనా! గన్నవరం విధ్వంసంపై చంద్రబాబు పేరిట ప్రజలకు విడుదలచేసిన నాలుగు పేజీల బహిరంగ లేఖలో మాటవరసకైనా పట్టాభి పేరును ప్రస్తావించకపోవడం పరిశీలనాంశం. గన్నవరం సంఘటన నేపథ్యంలో ఉమ్మడి కృష్ణాలో పార్టీ పరిస్థితి పూర్తిగా అయిపోయిందని జిల్లా నాయకులతో నిర్వహించిన సెల్ కాన్ఫరెన్స్‌లో చంద్రబాబు ఆగ్రహావేశాలు వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. నాయకుల పనితీరునూ తూర్పారపట్టిన ఆయనకు ఆ తరువాత పలు విషయాల గురించి తెలియవచ్చింది. జిల్లాకు చెందిన ముఖ్యనాయకులు కొందరు కొన్ని నెలలుగా చోటుచేసుకుంటున్న అంశాలను, అంతకు ముందు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దారుణ పరిణామాలను ఏకరువు పెట్టడంతో పాటు సీనియర్లుగా తాము కూడా ఏమీ చేయలేకపోతున్నామని వాపోయారనేది అత్యంత విశ్వసనీయ సమాచారం. అధికారంలో ఉన్నప్పుడు మీకిలాంటివి ఏమీ పట్టలేదని, అప్పుడే కొంతయినా సరిచేసి ఉంటే ఇంతలా పరిస్థితులు ఇప్పుడు తలెత్తేవి కావని అనడంతో చంద్రబాబు కూడా మౌనం వహించారని తెలిసింది. ముఖ్యమంత్రిని ఇతర నాయకులను ఇష్టానుసారం పరుషపదజాలంతో మాట్లాడటం సరికాదని, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లాయని చెప్పడంతో తమ నాయకుడు మారుమాట్లాడలేదని సమాచారం. అలా చేయడం ముమ్మాటికీ తప్పే.. బీసీ వర్గానికి చెందిన బచ్చుల అర్జునుడు గన్నవరం నియోజకవర్గ ఇన్చార్జిగా ఉండగా పార్టీ ఆదేశిస్తే తానే పోటీచేస్తానంటూ పట్టాభి ఇష్టానుసారం మాట్లాడటంతో నియోజకవర్గానికి చెందిన వారు కూడా అంటీముట్టనట్లు ఉన్నారని విశ్లేషించారు. తనంతట తాను గొప్ప నాయకునిగా పోల్చుకుంటూ రాష్ట్ర, జిల్లాలోని సీనియర్లకు గౌరవం ఇవ్వకపోవడం, కేశినేని నాని కార్యాలయంలో ఉంటూ పలు ఆరోపణలను ఎదుర్కోవడం, వివాదాలకు కారకుడనే గుర్తింపు తెచ్చుకోవడం తదితరాలతో పాటు పట్టాభి గతంలో అమెరికాకు వెళ్లి ఎన్ఆర్ఐల వద్ద పార్టీపేరు చెప్పి స్వీయ ప్రయోజనాలు పొందారని వివరించడంతో, అవునా అంటూ చంద్రబాబు సీరియస్ అయ్యారని తెలిసింది. ‘పట్టాభి గురించి తెలియాల్సిన అంశాలన్నీ మా సార్‌కు ఇప్పటికి తెలిసొచ్చాయి. అతను అంత యూజ్లెస్ నా అంటూ మండిపడ్డారు. ఇలాంటి వారి విషయంలో ముందే జాగ్రత్తపడి ఉంటే బాగుండేది. అతని మాటలవల్లే కదా మంగళగిరి, గన్నవరంలో పార్టీ ఆఫీసులపై దాడులు జరిగాయి’ అని ప్రస్తావనకు వచ్చిందని ఓ సీనియర్ నాయకుడు ‘సాక్షి’కి తెలిపారు. లోకేష్ పాదయాత్ర జరుగుతున్న సమయంలో ఇలాంటివన్నీ అవసరమా? మొత్తం డైవర్ట్ అయిపోయిందిగా. పార్టీ కూడా బాగా బదనాం అయ్యింది. అన్నింటికన్నా ముఖ్యంగా పట్టాభికి సంబంధించిన ఆ పాత ఫొటోలు ఎవరు పోస్ట్ చేశారో.. అన్నివిధాలా చాలా డ్యామేజ్ అయ్యిందని ముఖ్యనాయకుల వద్ద బాబు ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. పట్టాభి పేరు కూడా లేదాయె... ‘గన్నవరం విధ్వంసం– ప్రజలకు బహిరంగ లేఖ’ అంటూ చంద్రబాబు పేరిట ఇదివరకే పార్టీ విడుదల చేసింది. నాలుగు పేజీల ఆ లేఖలో పట్టాభి పేరును ఎక్కడా ప్రస్తావించలేదు. గన్నవరం టీడీపీ బీసీ నేత, పార్టీ రాష్ట్ర కార్యదర్శి దొంతు చిన్నా పేరు మాత్రం రెండు చోట్ల ప్రముఖంగా ఉంది. దీన్నిబట్టి పట్టాభి విషయంలో పార్టీ ఎలాంటి అభిప్రాయానికి వచ్చి ఉంటుందో స్పష్టమైపోతోందని విజయవాడకు చెందిన మరో నాయకుడు అభిప్రాయపడ్డారు. పట్టాభి వ్యవహార శైలిని జిల్లా నాయకుల ద్వారా స్పష్టంగా తెలుసుకున్న నేపథ్యంలోనే గన్నవరం నియోజకవర్గం కో ఆర్డినేషన్ కమిటీని అధిష్టానం మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణ నేతృత్వంలో తక్షణం నియమించినట్లు స్పష్టమవుతోంది. -
పొలిటికల్ కారిడార్ : టీడీపీ అధినేత చంద్రబాబులో పీక్స్ కు చేరిన అసహనం
-
జైల్లో డిన్నర్ చేయని సిద్ధూ
పటియాలా: కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూని పటియాలా జైల్లో బారక్ నంబర్–10లో ఉంచారు. హత్య కేసుల్లో శిక్ష అనుభవిస్తున్న మరో నలుగురితో కలిసి రాత్రంతా ఆయన గడిపారు. శుక్రవారం రాత్రి జైల్లో సిద్ధూ అసహనంగానే గడిపినట్టు జైలు వర్గాలు వెల్లడించాయి. రాత్రి భోజనం కింద చపాతీ, పప్పు ఇచ్చినా తినలేదు. తినేసి వచ్చానని చెప్పి, కొన్ని మందులు వేసుకున్నారు. జైల్లో ఆయనకు ఖైదీ నంబర్ 137683 ఇచ్చారు. సిద్ధూకి కాలేయానికి సంబంధించిన సమస్యలున్నాయి. గోధుమలతో తయారైన ఆహారం సిద్ధూకి పడదు. ప్రత్యేకంగా భోజనం కోసం సిద్ధూ జైలు అధికారులకు విజ్ఞప్తి చేసినట్టు ఆయన ప్రతినిధి వెల్లడించారు. జైలు వైద్యులు సిద్ధూ అనారోగ్యాన్ని గుర్తించి అంగీకరిస్తే ఆయన భోజనం జైలు క్యాంటిన్ నుంచి తెప్పించుకోవచ్చునని లేదంటే స్వయంగా వంట చేసుకునే అవకాశం కూడా ఉందని జైలు అధికారులు వెల్లడించారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో తూర్పు అమృత్‌సర్‌లో సిద్ధూతో పాటు పోటీపడిన శిరోమణి అకాలీ దళ్ నాయకుడు బిక్రమ్ సింగ్ మజితా డ్రగ్స్ కేసులో ఈ జైల్లోనే ఉండడం విశేషం. సిద్ధూకి రెండు సెట్లు తెల్ల రంగు పైజామాలు, ఒక చైర్, టేబుల్, ఒక కప్బోర్డు, రెండు తలపాగాలు, కప్పుకోవడానికి దుప్పటి, మంచం, బెడ్షీట్లు, లోదుస్తులు, టవళ్లు, దోమలు కుట్టకుండా నెట్ వంటి సదుపాయాలు కల్పించారు. 1988 నాటి రోడ్డు ఘర్షణల కేసులో ఒక వ్యక్తి మృతికి కారకుడైన సిద్ధూకి సుప్రీం కోర్టు ఏడాది జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే. 8 నెలల్లోపే బయటకు వచ్చే చాన్స్ సిద్ధూ ఏడాది శిక్షా కాలం 8 నెలల్లోపే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఖైదీలు సత్ప్రవర్తనతో మెలిగితే జైలు సూపరింటెండెంట్‌కి శిక్షా కాలాన్ని నెల రోజులు తగ్గించేందుకు అధికారం ఉంటుంది. రాష్ట్ర డీజీపీ (జైళ్లు)కి మరో రెండు నెలలు తగ్గించవచ్చు. పంజాబ్ సీఎం భగవంత్ మన్ ప్రతిపక్ష నేతల్లో సిద్ధూతో మాత్రమే ఇటీవల భేటీ అయ్యారు. వారిద్దరి మధ్య మంచి సంబంధాలే ఉన్నాయి. అందుకే ఏడాది శిక్షా కాలం పూర్తవకుండానే సిద్ధూ బయటకు వస్తారని అంచనాలున్నాయి. -
‘కట్ట’లు తెగిన అసహనం.. పరామర్శ పేరుతో చంద్రబాబు రాజకీయం
ఘనత వహించిన చంద్రబాబు మరోమారు బాధ్యతారహిత్యంగా వ్యవహరించారు.. ప్రమాదఘంటికలు మోగిస్తున్న రాయలచెరువు కట్టపై హంగామా చేశారు.. లీకేజీలను అరికట్టేందుకు అహర్నిశలు కృషి చేస్తున్న అధికారుల విధులకు అడ్డంకులు సృష్టించారు.. ముమ్మరంగా సాగుతున్న మరమ్మతు పనులకు ఆటంకం కలిగించారు.. బలహీనమైన కట్టపైనే ప్రచార రథం ఎక్కి సుదీర్ఘంగా ప్రసంగంతో స్థానికుల సహనానికి పరీక్ష పెట్టారు.. రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడేందుకు సైతం తెగించారు. సాక్షి, తిరుపతి/తుడా: జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు బుధవారం పర్యటించారు. ముందుగా రేణిగుంటకు చేరుకున్న బాబుకు టీడీపీ నేతలు స్వాగతం పలికారు. అక్కడ నుంచి పాపానాయుడుపేటకు చేరుకుని బాధితులను పరామర్శించారు. అనంతరం గుడిమల్లం మార్గంలో స్వర్ణముఖి నదిపై కూలిపోయిన వంతెనను పరిశీలించారు. అనంతరం తిరుచానూరు చేరుకుని పాడిపేట వద్ద స్వర్ణముఖి ఉధృతికి కొట్టుకుపోయిన వంతెనను సందర్శించారు. తర్వాత తొండవాడ మీదుగా రాయలచెరువు వద్దకు వెళ్లి కట్టను పరిశీలించారు. లీకేజీలను అరికట్టేందుకు చేపట్టిన చర్యలపై ఇంజినీర్లను ఆరా తీశారు. పరామర్శలు శూన్యం.. విమర్శలకే ప్రాధాన్యం వరద ప్రాంతాల్లో చంద్రబాబు చేపట్టిన పర్యటన తూతూ మంత్రంగా సాగింది. బాధితులను పరామర్శించడం వదిలేసి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టడమే అజెండాగా మారింది. ఎక్కడా పొలాల్లోకి వెళ్లి దెబ్బతిన్న పంటలను చూడలేదు. ధ్వంసమైన ఇళ్లను పరిశీలించలేదు. బాధితులను ఓదార్చి వారిలో మనోధైర్యం నింపే ప్రయత్నమూ చేయలేదు. కేవలం ఆత్మస్తుతి పరనింద అన్నట్లు ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డిని విమర్శించడం, అసెంబ్లీలో తన సతీమణిని అవమానించారంటూ సానుభూతి కోసం పాకులాడడమే లక్ష్యంగా బాబు యాత్ర సాగింది. తమ్ముళ్ల అత్యుత్సాహం అధినేత పర్యటనలో తమ్ముళ్లు అత్యుత్సాహం ప్రదర్శించారు. జనంలో స్పందన లేకపోవడంతో బాబు ముందు పరువు పోతుందని తామే హంగామా సృష్టించారు. అది పరామర్శ యాత్ర అనే విషయం మరిచిపోయి బాణసంచా పేలుస్తూ, జైబాబు అంటూ నినాదాలు చేస్తూ రచ్చరచ్చ చేశారు. ఇది చూసి బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వం కోల్పోయి మేము అవస్థలు పడుతుంటే ఓదార్చడం పోయి సంబరాలు జరుపుకుంటారా అని మండిపడుతున్నారు. మారని ధోరణి తిరుపతిలోని మహిళా వర్సిటీ, వైకుంఠపురం కూడళ్లలో చంద్రబాబు పాత ధోరణిలోనే ప్రసంగాలు సాగించారు. ముంపు ప్రాంతాలకు వెళ్లకుండా తమ పార్టీ నేతల ఇళ్లకు మాత్రమే వెళ్లి పరామర్శించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఐదు నిముషాలు గడిపితే తన ప్రసంగాలకు మాత్రం గంటలకొద్దీ సమయం వెచ్చించారు. రాయలచెరువుపై కట్టపై మీటింగ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉన్న రాయలచెరువును అధికారులు రెడ్‌జోన్‌గా ప్రకటించారు. కట్టను పటిష్టం చేసేందుకు ముమ్మరంగా పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో చెరువు వద్దకు చేరుకున్న బాబు కట్టపైనే మీటింగ్ పెట్టారు. ప్రచార రథమెక్కి ప్రభుత్వంపై మళ్లీ విమర్శలు లంకించుకున్నారు. కట్ట పరిస్థితి బాగాలేదని అధికారులు వారించేందుకు యత్నించినా పెడచెవిన పెట్టారు. లీకేజీలను అరికట్టే పనులకు ఆటకం కలిగించారు. దీంతో కట్ట మరింతగా దెబ్బతింటుందేమో అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. అద్దె జనాలతో ‘షో’ చంద్రబాబు రోడ్‌షోకు జనాలు కరువయ్యారు. దీంతో టీడీపీ నేతలకు ఎటూ పాలుపోని పరిస్థితి ఎదురైంది. ఎక్కడికక్కడ బాబు సభలకు అందుబాటులోని వాహనాలతో అద్దె జనాలను తరలించారు. కొన్నిచోట్ల టీడీపీ కార్యకర్తలనే బాధితులుగా కూర్చోబెట్టి పరామర్శ యాత్రను మమ అనిపించారు. ఈక్రమంలో ప్రతి సభలోనూ చంద్రబాబు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డినే లక్ష్యంగా చేసుకుని తీవ్రమైన విమర్శలు చేశారు. -
భర్తీ చేయకుండా నిర్వీర్యం చేస్తారా?
సాక్షి, న్యూఢిల్లీ: ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయకుండా వాటిని నిర్వీర్యం చేస్తున్నారంటూ కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు అహనం వ్యక్తం చేసింది. వారంలోగా తీరు మార్చుకోవాలని పేర్కొంది. కాంగ్రెస్ నేత జైరాం రమేశ్, ఢిల్లీ బార్ అసోసియేషన్, స్టేట్ బార్ కౌన్సిల్ ఆఫ్ మధ్యప్రదేశ్, అమర్జీత్ సింగ్ బేడిలు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ నాగేశ్వరరావులతో కూడిన ప్రత్యేక ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ సందర్భంగా ధర్మాసనం పలు వాఖ్యలు చేసింది. మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయి: కోర్టు తీర్పుల్ని కేంద్రం గౌరవించడంలేదని స్పష్టంగా అర్థమవుతోందని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. తమ సహనాన్ని పరీక్షిస్తున్నారని కేంద్రంపై అసహనం వ్యక్తం చేశారు. ట్రైబ్యునళ్లలో ఎన్ని ఖాళీలు భర్తీ చేయాలో చెప్పండి, ఆయా అంశాలపై ప్రత్యేక ధర్మాసనాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఏడాదిన్నరగా ఖాళీలు భర్తీ కాక మూసివేత దశలోకి వచ్చేలా ఉన్నా... ట్రైబ్యునళ్లలో ఎందుకు నియామకాలు చేపట్టడం లేదని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు ప్రశ్నించారు. ఈ నేపథ్యంలో తమకు మూడు ప్రత్యామ్నాయాలు కనిపిస్తున్నాయని సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. 1. కొత్త చట్టం అమలుపై స్టే ఇచ్చి ట్రైబ్యునళ్లను మూసివేయడం. 2. సుప్రీంకోర్టే ట్రైబ్యునళ్లలో ఖాళీలు భర్తీ చేయడం. 3. కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టడం. కేంద్రంతో ఘర్షణ పడాలని తాము భావించడం లేదని, ఇటీవల సుప్రీంకోర్టుకు తొమ్మిది మంది న్యాయమూర్తుల నియామకం విషయంలో కొలీజియం సిఫారసులను ఆమోదించినందుకు సంతోషంగా ఉందని జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. అయితే, ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఖాళీలతో చైర్పర్సన్లు, సభ్యులు లేక ట్రైబ్యునళ్లు కూలిపోయేలా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఖాళీలు భర్తీ చేయకుండా వాటి నిర్వీర్యానికి కారణం అవుతున్నారని జస్టిస్ ఎల్.నాగేశ్వరరావు అన్నారు. కేంద్రం తరఫు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ.. ట్రైబ్యునళ్లను మూసివేసే ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం నోటిఫై అయినట్లు ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. కొత్త చట్టం ఖాళీల భర్తీకి మార్గం సుగమం చేస్తుంది. సెర్చ్, సెలక్షన్ కమిటీ సిఫారసులను కేంద్రం తీసుకుంటుంది’ అని తుషార్ మెహతా తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఎంతో కీలకమైన నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్ (ఎన్సీఎల్టీ), నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్ (ఎన్సీఎల్ఏటీ)వంటి వాటిల్లో అనేక ఖాళీలున్నాయని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు. ట్రిబ్యునళ్లలో ఖాళీల వల్ల అనేక కేసులు పరిష్కారం కావడం లేదన్నారు. జాతీయ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ సెలెక్షన్ కమిటీ చైర్మన్‌గా బ్యూరోక్రాట్లతో సమావేశమై పలు పేర్లు సిఫారసు చేశామని, అయినా నియామకాలు చేపట్టలేదని... ఇదంతా వృథా ప్రయాస అయిందని జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. ఖాళీల భర్తీకి సంబంధించి వివరాలను తదుపరి విచారణకు అందజేస్తామని మెహతా చెప్పడంతో ఎలాంటి ఆదేశాలు ఇవ్వడం లేదని ధర్మాసనం పేర్కొంది. ‘‘మీపై మాకు విశ్వాసం ఉంది. ఇలాంటి చట్టాలు చేయమని ప్రభుత్వానికి ఎప్పుడూ సూచించరు . ప్రభుత్వం దగ్గర ఉండే కొందరు బ్యూరోక్రాట్లు సలహాలు ఇస్తారు. ఒకవేళ ఏదైనా తీర్పు వస్తే కొత్త చట్టం రూపొందించమని చెబుతారు. ప్రస్తుతం బ్యూరోక్రసీ పనితీరు ఇలా ఉంది. అది మాకు తెలుసు. కానీ సీరియస్ అంశం కాబట్టి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఏదిఏమైనప్పటికీ మేమెంతో నిరుత్సాహం చెందాం. మేం చెప్పదలచుకున్నది ఇదే’’ అని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను ఉద్దేశించి సీజేఐ వ్యాఖ్యానించారు. మూడు నాలుగు రోజులపాటు సమయం ఇస్తే... ఈలోగా భర్తీ చేస్తామని తుషార్ మెహతా చెప్పడంతో సోమవారానికి విచారణ వాయిదా వేస్తున్నామని కోర్టు పేర్కొంది. సోమవారానికి ఖాళీల భర్తీ కాకుంటే ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం స్పష్టం చేసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీల భర్తీకి పది రోజులు సమయం ఇస్తూ ధర్మాసనం ఆగస్టు 16న ఆదేశాలు జారీ చేసిన విషయం విదితమే. ట్రైబ్యునల్ సభ్యుల పదవీకాలం తగ్గించడం, ఇతర సేవలను తగ్గిస్తూ కేంద్రం తీసుకొచి్చన ట్రైబ్యునల్ సంస్కరణల చట్టం, 2021ను ఇటీవల పార్లమెంటు ఆమోదించిన విషయం తెలిసిందే. ట్రిబ్యునల్ సభ్యుడు లేదా చైర్పర్సన్ నియామకానికి కనీస వయసు 50 ఏళ్లు ఉండాలన్న నిబంధన రాజ్యాంగ విరుద్ధమని, ట్రైబ్యునళ్ల చైర్పర్సన్ల పదవీకాలం ఐదేళ్లు ఉండాలని ఆ మేరకు చట్టంలో పొందుపరచాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే ఇవే అంశాలు మళ్లీ కొత్త చట్టంలో రావడంతో సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆయా అంశాలు కేంద్రం విస్మరించడంతో తమ తీర్పులు పాటించడం లేదని అసహనం వ్యక్తం చేసింది. గతంలో కొట్టివేసిన చట్టానికి కొత్త చట్టం అచ్చు నకలులా ఉందని పేర్కొంది. -
కోపంతో చేతిలోని ఫోన్ విసిరిన మంత్రి కొప్పుల ఈశ్వర్
హుజూరాబాద్: కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని 21వ వార్డులో సోమవారం దళితబంధు సర్వే పర్యవేక్షణకు వచ్చిన మంత్రి కొప్పుల ఈశ్వర్ ఓ అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మంత్రుల కన్నా మీరే బిజీగా ఉంటున్నారా..? మంత్రి రాకపై ముందే సమాచారం ఇచ్చినా.. కనీస ఏర్పాట్లు చేయకుండా నిర్లక్ష్యంగా ఉంటారా’అని అసహనం వ్యక్తం చేశారు. ముందుగానే సమాచారం ఇచ్చి, దళితబంధు గురించి మాట్లాడడానికి వస్తున్నానని తెలిపినా.. పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. అధికారులు ఇచ్చిన వివరణ సరిగా లేకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. కాగా, ఏర్పాట్లు సరిగా చేయలేదని ఒకవైపు కొప్పుల నిలదీస్తుండగానే ఆ అధికారి మంత్రి మాటలను పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడుతుండడంతో కొప్పుల మరింత సీరియస్ అయ్యారు. చేతిలోని సెల్‌ఫోన్‌ను విసిరి సమావేశం నుంచి వెళ్లిపోయారు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే మంత్రి కొప్పుల ఒక్కసారిగా అధికారి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేతిలోని ఫోన్ విసిరివేయడం చర్చనీయాంశంగా మారింది. (చదవండి: ఉద్రిక్తతకు దారితీసిన ‘జెండా గద్దె పంచాయితీ’) (చదవండి: ‘దళితబంధు’ను అడ్డుకుంటే ఆత్మహత్య చేసుకుంటా) -
చూసి చూసి.. రిబ్బన్ తీసిపడేసిన సీఎం కేసీఆర్
సాక్షి, రాజన్న సిరిసిల్ల జిల్లా: సీఎం కేసీఆర్ ఒకింత అసహనానికి గురవడంతో.. అధికారులు ఒక్కసారిగా షాక్ తిన్నారు. సిరిసిల్లలో సీఎం ఆదివారం తన పర్యటనలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మండేపల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ప్రారంభోత్సవంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. అయితే ఒక ఇంటి గృహ ప్రవేశానికి అంతా రెడీ కాగా, వేద మంత్రాల మధ్య లబ్ధిదారులతో సహా కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేందుకు సిద్ధమయ్యారు. రిబ్బన్ కట్ చేద్దామనుకునే సరికి.. కత్తెర అందుబాటులో లేకపోవడంతో కాసేపు కత్తెర కోసం సీఎం వేచి చూశారు. కత్తెర లేకపోవడంతో సీఎం కేసీఆర్ ఆగ్రహానికి గురయ్యారు. వెంటనే తనే చేతితో రిబ్బన్‌ను పీకి పడేశారు. అనంతరం లబ్ధిదారులతో కలిసి నూతన గృహంలోకి అడుగుపెట్టారు. -
అసహనం విశ్వామిత్ర సృష్టి
అక్షర తూణీరం ఉన్నట్టుండి ‘అసహనం’ తెరమీదకు వచ్చి హల్చల్ చేస్తోంది. మూలాల్లోకి వెళితే సహనం బ్రహ్మ సృష్టి, అసహనం విశ్వామిత్ర సృష్టి. అసహనం రోషానికి పమిటలాం టిది. కోపానికి అంచులాంటిది. అసలు ఎప్పుడు పుట్టిందీ సహనం? అమీబాతో పాటే పుట్టిందని ప్రాచీనులు సంస్కృత శ్లోకంలో చెప్పారు. అసహనంలోంచే కల్పాంతం సంభవిస్తుందనీ, దరిమిలా అసహనం పొటమరిస్తుందనీ గ్రీకు వేదాంతంలో చెప్పబడి ఉందని మనవాళ్లంటారు. దుర్వాసుడు మూర్తీభవించిన అసహనంగా పురాణాలకెక్కాడు. ఆయనకు పిచ్చి అసహనం. అందుకే సుదర్శన చక్రం తరిమితరిమి కొట్టి, అంబరీషో పాఖ్యానాన్ని ఆవిష్కరించింది. విశ్వామిత్రుడు అసహనం వల్లనే తపః ఫలాలను గంగపాలు చేసుకుని, పరమ కోపిష్టి సన్నాసిగా మిగిలాడు. దుర్వాసుడు ఎండిన డొక్కలతో బక్కగా ఉండేవాడు. ఆకలి వల్ల, పౌష్టి కాహార లోపం వల్ల అసహన మూర్తిగా మిగిలాడని కొందరు మేధా వుల అంచనా. ఆకలిలోంచి అసహనం, అందులోంచి విప్లవం చీల్చుకు వస్తుందని మన స్థానిక విప్లవ వాదులు అంటూ ఉంటారు. కృతయుగమంతా అసహనాలతోనే గడిచింది. త్రేతాయుగంలో అనేక సహనాలు, కొన్ని అస హనాలు కలసి, రామాయణ మనే గొప్ప ఇతిహాసాన్ని తీర్చి దిద్దాయి. కైక అసహనంతో రామకథ శ్రీకారం చుట్టుకుం ది. రాముడు చాలాసార్లు అస హనాన్ని ఆశ్రయించాడు. చెట్టు చాటు నుంచి వాలిని చంపడం అసహనం కాదా అని ప్రశ్నిస్తు న్నాను. శూర్పనఖ ముక్కు చెవులు కోయించడం మాత్రం కాదా అసహనం? చివరికి సముద్రుడి మీద కోపించి రామబాణం ఎక్కుపెట్టడం అసహనానికి పరాకాష్ట. ఏమాటకామాట చెప్పుకోవాలి. ఒక లింకు తక్కువైనా హను మంతుడికి అసహనం మీద గట్టి పట్టుంది. సముద్రం మీద గానీ, లంకలో గానీ చాలా నీట్‌గా బిహేవ్ చేశాడు. శక్తి సామర్థ్యాలున్నా గౌర వంగా బ్రహ్మాస్త్రానికి లొంగిపోయాడు. సుందరకాండలో ఆనందమే గానీ అసహనం లేదు. ఇక ద్వాపరయుగమే అసహన యుగం. కంసుడి అసహనం అంతా ఇంతా కాదు. ధృతరాష్ట్రుడికి చూపులేనందువల్ల శంకించే నైజం అలవడింది. మనక్కూడా టీవీలో బొమ్మ సరిగ్గా రాకపోయినా, ఫోన్లో సిగ్నల్ కట్ అవుతున్నా అసహనం పూనేస్తుంది. ద్రౌపదికి నిలువెల్లా అసహనమే. ‘నన్నోడి తానోడెనా, తానోడి నన్నోడెనా’ అన్న ఒకే ఒక్క ప్రశ్న భారతానికి కేంద్ర బిందువైంది. స్వర్గారోహణ పర్వం దాకా ధర్మ రాజుని ఈ ప్రశ్న తాలూకు అసహనం వెంటాడింది. కృష్ణుడంతటి పర బ్రహ్మ స్వరూపం ఎన్నోసార్లు సహనం కోల్పోయాడు. కురుక్షేత్రంలో భీష్ముడి మీదికి లంఘించబోలేదా! అక్కడ భీష్ముడు ఆనందంగా శిర సొగ్గడం ఒక గొప్ప టచ్. అదీ అసహనమే. ఎన్నాల్టికీ మరణం రాని జన్మ. పాత కట్టెతో విసిగి వేసారి పోయి ఉన్నాడు. మరణం రాకపోడం కన్నా మరణం లేదన్నారు పెద్దలు. కలియుగం అంతా సహనలోపమే. చరిత్రకెక్కిన మహాయుద్ధాలన్నీ అసహన స్పందనలే. హిరోషిమాపై ఆటంబాంబు, జలియన్ వాలాబాగ్, గాంధీ హత్య, లాహోర్ గొడవలు, చైనా దురాక్రమణ, ఎమర్జెన్సీ- ఇవన్నీ అసహనానికి సంకేతాలే. నాస్తికోద్యమం ఒక అస హన ఉద్యమం. భిన్నత్వంలో ఏకత్వమంటూ ఒక గొడుగులో ఉన్నట్టు అరవడం అసహనమే. అసహనంలోంచే ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారు. తెలంగాణ ఉద్యమానికి బీజం అసహనం. ధర్మాగ్రహం లాగే కొన్ని అసహనాలు జాతికి మంచి చేస్తాయి. సహనం మన సంస్కృతి అన్నారు సర్వేపల్లి రాధాకృష్ణ. అది మాత్రం సత్యం. శ్రీరమణ (వ్యాసకర్త ప్రముఖ కథకుడు)