
బెంగళూరు చేతిలో పరాజయం తర్వాత టాప్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా లేని లోటు గురించి అడిగిన ప్రశ్నపై ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ అసహనం వ్యక్తం చేశాడు. గత ఎనిమిది నెలలుగా నేను బుమ్రా లేకుండానే జట్టును నడిపిస్తున్నాను. కానీ ఎవరో ఒకరు అతని స్థానంలో వచ్చి ఆడాల్సిందే.
సుదీర్ఘ కాలం దాని గురించే మాట్లాడితే ఎలా. మన నియంత్రణలో ఉండే విషయాల గురించే చెప్పగలం. గాయాలను ఎవరూ నియంత్రించలేరు. మిగతా ఆటగాళ్లలోనూ మంచి ప్రతిభ ఉంది. వారిని ప్రోత్సహిస్తూ మద్దతు పలకడం అవసరం’ అని రోహిత్ అన్నాడు.