
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ కరోనా బారిన పడ్డారు. ఆదివారం నిర్వహించిన కొవిడ్ పరీక్షల్లో ఆయనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. స్వల్ప లక్షణాలు ఉండడంతో కరోనా పరీక్షలు చేయించుకున్నానని.. పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన తన భార్యతో కలిసి హోం ఐసోలేషన్‌లో ఉన్నట్లు పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా తనను కలిసిన వారంతా కొవిడ్ ప్రోటోకాల్స్ పాటించాలని, పరీక్షలు చేయించుకుని జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు.
తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు
తెలంగాణలో కొత్తగా 4,976 కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ పేర్కొంది. గత 24 గంటల్లో కోవిడ్ నుంచి 7,646 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో 60,757 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇక 24 గంటల్లో కరోనాతో 35 మరణాలు చోటు చేసుకోగా.. మొత్తంగా 2,739 మంది మృతి చెందారు. కొత్తగా నమోదైన కేసుల్లో జీహెచ్‌ఎంసీలో 851, రంగారెడ్డి జిల్లాలో 417 ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment