కేసీఆర్ హత్యకు కుట్రపై దర్యాప్తు జరపాలి: టీఆర్‌ఎస్ | Investigation should be conducted in the KCR's murder of conspiracy | Sakshi

కేసీఆర్ హత్యకు కుట్రపై దర్యాప్తు జరపాలి: టీఆర్‌ఎస్

Published Thu, Aug 8 2013 2:06 AM | Last Updated on Wed, Aug 15 2018 9:06 PM

Investigation should be conducted in the KCR's murder of conspiracy

సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు హత్యకు జరుగుతున్న కుట్రపై దర్యాప్తు జరిపించాలని టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉప నేత కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని తెలంగాణభవన్‌లో బుధవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పదవులే కాకుండా, ప్రాణాలను కూడా పణంగా పెట్టిన నాయకుడి హత్యకు కుట్రజరుగుతున్న విషయంతో ఇక్కడి ప్రజలు కలత చెందుతున్నారన్నారు. కేసీఆర్‌పై జరుగుతున్న హత్య కుట్రపై ముఖ్యమంత్రి, డీజీపీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ కుట్రపై దర్యాప్తు జరిపించాలని వారు డిమాండ్ చేశారు.
 
 నేడు టీఆర్‌ఎస్‌ఎల్‌పీ భేటీ నేడు: టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం హైదరాబాద్‌లో గురువారం జరుగనుంది. అసెంబ్లీలోని పార్టీ శాసనసభాపక్ష కార్యాలయంలో టీఆర్‌ఎస్ పక్షనేత ఈటెల రాజేందర్ అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. సీమాంధ్రలోని ఉద్యమం, వివిధ పార్టీల తీరు, భవిష్యత్ కార్యాచరణతో పాటు టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలు బయటకు వెళ్తున్నారంటూ జరిగిన ప్రచారంపై సమావేశంలో చర్చించనున్నారు. పార్టీ రాజకీయ భవితవ్యంపైనా పార్టీ అధినేత కేసీఆర్‌కే పూర్తి అధికారాలు ఇచ్చే అవకాశముందని తెలిసింది. టీఆర్‌ఎస్ నుంచి ఎమ్మెల్యేలెవరూ బయటకు వెళ్లబోరని ఈ సమావేశం తర్వాత సమష్టిగా ప్రకటన చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement