
సాక్షి, హైదరాబాద్: గత ప్రభుత్వాల్లో ప్రవేశపెట్టిన మాదిరిగా మొక్కుబడి పథకాలు కాకుండా ప్రజల సంక్షేమానికి దోహదపడే పథకాలను అమలు చేయాలని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. శుక్రవారం సచివాలయంలో వివిధ సంక్షేమ శాఖల ఉన్నతాధికారులతో మంత్రి సమావేశమయ్యారు. ఆయా శాఖల పనితీరును తెలుసుకోవడంతో పాటు వివిధ పథకాల పురోగతిని గురించి సమీక్షించిన తర్వాత భవిష్యత్ ప్రణాళికల అమలుపై నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు.