
సాక్షి, హైదరాబాద్: హుజురాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అమలవుతున్న దళిత బంధు పథకం కోసం తెలంగాణ ప్రభుత్వం గురువారం మరో రూ.500 కోట్లు విడుదల చేసింది. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఆదేశాల మేరకు తెలంగాణ దళిత బంధు పథకం పైలట్ ప్రాజెక్టు నిర్వహణకు నేడు మరో 500 కోట్ల రూపాయలను కరీంనగర్ కలెక్టర్ ఖాతాకు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ విడుదల చేసింది.
కాగా ఇటీవల దళితబంధు పథకం అమలుకు రూ. 2 వేల కోట్లు కేటాయించనున్నట్లు సీఎం కేసీఆర్ శాలపల్లిలో దళితబంధు పథకం ప్రారంభోత్సవ సభా వేదికగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నాలుగు విడతలుగా రూ. 1,500 కోట్లు విడుదల చేయగా.. నేడు విడుదల చేసిన రూ. 500 కోట్లతో సంపూర్ణమైంది. మొత్తం రూ. 2 వేల కోట్లతో నియోజకవర్గంలోని దళితులందరికీ ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేయనున్నది. ప్రాజెక్టును చేపట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటికే క్షేత్రస్థాయిలో ఏర్పాట్లను పూర్తిచేసుకుంది.
చదవండి: Telangana: జీవో 111 పై హైకోర్టులో విచారణ