సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రజాభవన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. తెలంగాణలో దళితబంధుకు ఎంపికై డబ్బులు జమ కాని బాధితులు ప్రజావాణిలో భాగంగా ప్రజాభవన్ వద్ద చేరుకున్నారు. దాదాపు 500 మంది లబ్ధిదారులు తమకు న్యాయం చేయాలని ప్రజాభవన్ వద్ద ధర్నకు దిగారు. దీంతో, అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది.
వివరాల ప్రకారం.. దళితబంధు నిధుల విడుదల జాప్యంపై లబ్ధిదారులు పోరుబాటపట్టారు. రెండో విడుత దళితబంధుకు ఎంపికైనవారి ఖాతాల్లో డబ్బులు వెంటనే జమచేయాలని డిమాండ్ చేశారు. ప్రజావాణిలో భాగంగా హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌కు పెద్ద సంఖ్యలో బాధితులు తరలివచ్చారు. ఈ సందర్బంగా దాదాపు 500 మంది లబ్ధిదారులు పంజాగుట్ట నుంచి ప్రజాభవన్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం, ప్రజాభవన్ వద్ద ధర్నకు దిగారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ సర్కార్‌ను లబ్ధిదారులు హెచ్చరించారు. దళితబంధు నిధులు వెంటనే విడుదల చేయాలని లేదంటే ఉద్యమం మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇదే సమయంలో దళితులపై ముఖ్యమంత్రి రేవంత్ వివక్ష చూపుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. తమను కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉండాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment