హుజూరాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం: ఈటల | Huzurabad Bypoll 2011: Etela Rajender Slams KCR Over Dalit Bandhu | Sakshi
Sakshi News home page

Huzurabad Bypoll 2011: హుజూరాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం: ఈటల

Published Sat, Oct 2 2021 8:43 PM | Last Updated on Sat, Oct 2 2021 8:56 PM

Huzurabad Bypoll 2011: Etela Rajender Slams KCR Over Dalit Bandhu - Sakshi

ఐదు నెలలుగా హుజురాబాద్ లో కేసీఆర్‌ రచించిన రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదు

సిద్ధిపేట: అక్టోబర్ 30న హుజురాబాద్‌లో జరిగేది కురుక్షేత్రం యుద్ధం.. దీనిలో ధర్మం, ప్రజలే గెలుస్తారు అని మాజీ మంత్రి, బీజేపీ నాయకుడు ఈటల రాజేందర్‌ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘హుజురాబాద్ ఎన్నికలో 75 శాతం ఓట్లు బీజేపీకి పడితే, 25 శాతం ఓట్లు మాత్రమే టీఆర్ఎస్‌కు పడతాయి. ఐదు నెలలుగా హుజురాబాద్‌లో కేసీఆర్‌ రచించిన రాజ్యాంగం తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలవడం లేదు’’ అన్నారు.
(చదవండి: టీఆర్‌ఎస్‌ అభ్యర్థి చేతిలో కేవలం 10 వేలే, బంగారం, బండి లేనే లేదు)

‘‘దళిత బంధు పథకం హుజురాబాద్‌తో పాటు 33 జిల్లాల్లో వెంటనే అమలు చేయాలి. దళిత బంధు లాంటి పథకం రాష్ట్రంలో కుల మత భేదాలు లేకుండా పేద ప్రజలందరికీ వర్తింపజేయాలి’’ అని ఈటల డిమాండ్‌ చేశారు. 

చదవండి: నేను గెలిస్తే కేసీఆర్‌ రోడ్డుమీదకు: ఈటల రాజేందర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement