సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఫలితాన్ని తారుమారు చేసేందుకు ఈవీఎంలను కూడా మా ర్చేందుకు ప్రయత్నించిందన్నారు.
పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సోమ వారం జరిగిన పదాధికారుల సమావేశానికి పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహాయ ఇన్‌చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్, సీనియర్ నేతలు విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు పాల్గొన్నారు.
అనంతరం సమావేశం వివరాలను ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, జి.మనోహర్‌రెడ్డితో ప్రేమేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజాసింగ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిశాక బీజేపీ గెలుస్తుందని వార్తలు రావడంతో ఈవీఎంలు మార్చేందుకు కూడా ప్రయత్నించారని మండిపడ్డారు.
12న నిరుద్యోగ మిలియన్ మార్చ్
ఈ నెల 12న హైదరాబాద్ వేదికగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రదీప్‌కుమార్ తెలిపారు. కాగా, ఈనెల 21 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో రెండో విడత ప్రజాసంగామ యాత్ర చేపట్టనున్నట్లు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment