Gujjula Premender reddy
-
తెలంగాణలో బీజేపీ పొత్తులు.. గుజ్జుల కీలక వ్యాఖ్యలు
సాక్షి,ఢిల్లీ: రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఒంటరిగానే పోటీ చేయాలని అధిష్టానం నిర్ణయించిందని బీజేపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో జనసేనతోనూ ఈసారి పొత్తు ఉండదని తేల్చిచెప్పారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో పొత్తులు వేరు, ఇప్పుడు పరిస్థితి వేరు. ఏ పార్టీతోను పొత్తు పెట్టుకోము. కొంతమంది జోకర్లు మాట్లాడే మాటలు పట్టించుకోవాల్సిన పనిలేదు. నరేంద్ర మోదీ నాయకత్వంలో బీజేపీ ఒంటరిగానే పోటీ చేయాలని ప్రజలు కోరుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఓటింగ్ శాతం రెట్టింపయింది. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలుచుకోబోతున్నాం’ అని ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఇదీ చదవండి.. కాంగ్రెస్‌లో చేరిక.. ఈటల క్లారిటీ -
బీజేపీతోనే అవినీతిరహిత పాలన సాధ్యం
ఆదిలాబాద్: రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తేనే అవినీతి రహిత పాలన సాధ్యమవుతుందని రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో నిర్వహించనున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జనగర్జన సభ ఏర్పాట్లను సోమవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అవినీతి పాలన సాగుతోందని విమర్శించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణలో నాలుగు కోట్ల ప్రజలను సీఎం కేసీఆర్ పూర్తిగా విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం కుటుంబ అభివృద్ధికి మాత్రమే సీఎం కృషి చేశారని, అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. మరోవైపు ప్రధాన మోదీ నాయకత్వంలో కేంద్రంలో నీతిమంతమైన పాలన సాగుతుందన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. రాష్ట్రంలోని గిరిజనులు విద్య, ఉద్యోగ పరంగా మరింత ముందుకు వెళ్లేందుకు స్వయంగా ప్రధాని మోదీ గిరిజన వర్సిటీ ప్రకటించారన్నారు. జిల్లాలో బీజేపీకి ఎంతో ప్రజాదరణ ఉందని, ఇక్కడి నుంచి పార్లమెంట్ స్థానాన్ని గెలవడంతో పాటు గతంలో పలు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వచ్చాయన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో ఎన్నికల శంఖారావాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదిలాబాద్ నుంచి పూరించనున్నట్లు వెల్లడించారు. ఈ బహిరంగ సభకు ప్రజలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. అంతకు ముందు సభ ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఆయన వెంట స్థానిక నాయకులు ఉన్నారు. -
బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు కాంగ్రెస్ అంగీకారం: గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ప్రజలు కేసీఆర్ ప్రభుత్వం పట్ల తీవ్ర విముఖత చూపుతున్నారని బీజేపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ప్రత్యామ్నాయ పార్టీగా ప్రజలంతా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీతో పొత్తుకు అంగీకారం తెలిపిందని వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని మేము ఎప్పుడో చెప్పాం. అధికారం కోసం వాళ్లిద్దరూ ఒక్కటవ్వడం ఖాయమన్నారు. ఎమ్మెల్యేలు పార్టీ మార్పుపై కాంగ్రెస్ పరిస్థితి దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందన్నారు. శనివారం రోజున రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ బూత్ కమిటీ సభ్యుల సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ సమ్మేళనాన్ని ఉద్దేశించి జేపీ నడ్డా, బండి సంజయ్, కిషన్ రెడ్డి, డీకే అరుణ, డాక్టర్ లక్ష్మణ్ ప్రసంగిస్తారని చెప్పారు. చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. హైకోర్టు కీలక వ్యాఖ్యలు) -
30 వేల మెజారిటీతో గెలుస్తాం: బీజేపీ
సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉపఎన్నికలో దాదాపు 30 వేల ఓట్ల మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ గెలవబోతున్నారని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఫలితాన్ని తారుమారు చేసేందుకు ఈవీఎంలను కూడా మా ర్చేందుకు ప్రయత్నించిందన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షతన సోమ వారం జరిగిన పదాధికారుల సమావేశానికి పార్టీ జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) శివప్రకాశ్ ముఖ్య అతిథిగా హాజరు కాగా, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్, తమిళనాడు సహాయ ఇన్చార్జ్ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, బీజేపీఎల్పీ నేత రాజాసింగ్, సీనియర్ నేతలు విజయశాంతి, జితేందర్‌రెడ్డి, గరికపాటి మోహన్‌రావు, ఎన్.ఇంద్రసేనారెడ్డి, ప్రేమేందర్‌రెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్, బంగారు శ్రుతి, మంత్రి శ్రీనివాసులు పాల్గొన్నారు. అనంతరం సమావేశం వివరాలను ఎమ్మెల్యే రాజాసింగ్, పార్టీ నేతలు దుగ్యాల ప్రదీప్‌కుమార్, జి.మనోహర్‌రెడ్డితో ప్రేమేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. రాజాసింగ్ మాట్లాడుతూ పోలింగ్ ముగిశాక బీజేపీ గెలుస్తుందని వార్తలు రావడంతో ఈవీఎంలు మార్చేందుకు కూడా ప్రయత్నించారని మండిపడ్డారు. 12న నిరుద్యోగ మిలియన్ మార్చ్ ఈ నెల 12న హైదరాబాద్ వేదికగా నిరుద్యోగ మిలియన్ మార్చ్ నిర్వహించనున్నట్లు ప్రదీప్‌కుమార్ తెలిపారు. కాగా, ఈనెల 21 నుంచి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సారథ్యంలో రెండో విడత ప్రజాసంగామ యాత్ర చేపట్టనున్నట్లు పాదయాత్ర ప్రముఖ్ డాక్టర్ జి.మనోహర్‌రెడ్డి తెలిపారు. -
'మజ్లిస్ మెప్పు కోసం టీఆర్ఎస్ పాకులాట'
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ విమోచన దినంపై బీజేపీ రాష్ట్ర ఆఫీస్ బేరర్ల సమావేశం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగింది. సమావేశం అనంతరం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మజ్లిస్ మెప్పు కోసం టీఆర్ఎస్ పాకులాడుతోందని, నాటి స్వాతంత్ర్య సమరయోధులను గుర్తించడంలో టీఆర్ఎస్ వెనకడుగు వేస్తోందని విమర్శించారు. ఉద్యమ సమయంలో విమోచన దినోత్సవంగా సెప్టెంబర్ 17న అధికారికంగా నిర్వహించాలని సీఎం కేసీఆర్ స్వయంగా కోరారని గుర్తుచేశారు. విమోచన దినాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించే వరకు బీజేపీ ఉద్యమిస్తుందన్నారు. నాటి ఉద్యమ కేంద్రాల్లో బీజేపీ జెండా కార్యక్రమాలతో పాటు అక్కడి విశిష్టతను ప్రజలకు తెలిసేలా కార్యక్రమాలు చేపడతామన్నారు. అమిత్ షా పర్యటనలోపు అన్ని పోలింగ్ బూత్‌ల్లో పార్టీ పటిష్టమయ్యేలా చర్యలు తీసుకోనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 1 నుంచి 9వ తేదీ వరకు పాత పది జిల్లాల్లోని పోరాట కేంద్రాలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, రాంమాదవ్, నితిన్ గడ్కరీ, హన్సరాజ్, మురళీధర్‌రావు సందర్శిస్తారని ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.