
హుజురాబాద్: దేశవ్యాప్తంగా ఆసక్తిరేపిన హుజూరాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ ఘన విజయం సాధించారు. ఈటల తన సమీప ప్రత్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్‌పై 24వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఈటల ఆధిక్యంలోనే కొనసాగారు.
(చదవండి: 30 వేల మెజారిటీతో గెలుస్తాం: బీజేపీ )
రెండు రౌండ్లు మినహా ప్రతిసారి ఈటలదే పై చేయి అయ్యింది. హుజురాబాద్ నుంచి ఈటల ఏడో సారి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బలమైన సెంటిమెంట్ ముందు టీఆర్‌ఎస్ అభివృద్ధి మంత్రం, ప్రచారం ఏమాత్రం పని చేయలేదు.