
ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ( ఫైల్ ఫోటో )
సాక్షి, యాదాద్రి జిల్లా: హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు అని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శలు గుప్పించారు. తుర్కపల్లి మండలం రాంపూర్ తండా దళిత - గిరిజన దండోరా దీక్షలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, కేసీఆర్ వాసాలమర్రికి వస్తే అడ్డుకుంటామన్నారు. ఫాం హౌస్ రోడ్డు కోసమే వాసాలమర్రి దళితులకు కేసీఆర్ ఎర వేశారని ధ్వజమెత్తారు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్ మోసం చేసింది నిజం కాదా? అని ప్రశ్నించారు.
దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని మోసం చేశారంటూ కోమటిరెడ్డి మండిపడ్డారు. సీఎం కేసీఆర్ ఆలేరు నియోజకవర్గాన్ని దత్తత తీసుకోవాలన్నారు. కేసీఆర్ కాళ్ల కింద ఉన్న తెలంగాణ ఆత్మగౌరవాన్ని విడిపించాలన్నారు. దళిత బంధుతో పాటు గిరిజన బంధు కూడా ఇవ్వాలని కోమటి రెడ్డి డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి:
గ్రామాభివృద్ధి కమిటీ అరాచకం.. 70 దళిత కుటుంబాల బహిష్కరణ
హుజురాబాద్‌లో బీజేపీకి డిపాజిట్ కూడా రాదు: హరీశ్ రావు
Comments
Please login to add a commentAdd a comment