సాక్షి, హైదరాబాద్: దళితబంధు పెండింగ్ చెల్లింపులపై రాష్ట్ర షెడ్యూల్డ్ కులాల ఆర్థిక సహకార సంస్థ తర్జనభర్జన పడుతోంది. దళితబంధు పథకం రెండో విడతలో భాగంగా ఎంపికైన పలువురు లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో ఆర్థిక సాయం చేయలేదు. లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో తీవ్ర జాప్యం జరగడం... తీరా అరకొర ‡గా అర్హులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే నాటికి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది.
ప్రస్తుతం ఎన్నికల కోడ్ తొలగిపోయినా.. ఆ యా లబ్ధిదారులకు పూర్తి స్థాయి సాయం పంపిణీపై సందిగ్ధం నెలకొంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, గత ప్రభుత్వ ప్రాధాన్యత ల కంటే మెరుగైన విధంగా కొత్త పథకాల రూ పకల్పనకు సన్నద్ధమవుతుండడంతో ఈ పరిస్థి తి ఏర్పడింది. దీంతో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ వద్ద నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ వాటి ని అర్హులకు ఇవ్వాలా? వద్దా? అనే అయో మయం అధికారులను కలవరపెడుతోంది.
అన్నీ పక్కన పెట్టినా గ్రేటర్‌కు మాత్రం మినహాయింపు
తెలంగాణ దళితబంధు పథకం రెండో విడత కింద అప్పటి ప్రభుత్వం ఒక్కో అసెంబ్లీ నియోజకవర్గానికి వెయ్యి చొప్పున యూనిట్లు మంజూరు చేసింది. ఈమేరకు క్షేత్రస్థాయి నుంచి శాసనసభ్యులు రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్‌కు ప్రతి పాదనలను పంపారు. అప్పట్లో ప్రభుత్వం నుంచి స్పష్టమైన ఆదేశాలు రాకపోవడంతో వా టన్నింటినీ పక్కన పెట్టారు.
అయితే గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మురుగు వ్యర్థాల సేకరణ(సిల్ట్ కార్టింగ్ వెహికల్స్) వాహనాలకు డిమాండ్ ఉండడంతో 2023–24 వార్షిక సంవత్సరంలో 162 యూనిట్లను మంజూరు చేసి యుద్ధప్రాతిపదికన లబ్దిదారులకు అందించారు. ఈ వాహనాలను జీహెచ్‌ఎంసీలో వినియోగించుకోనున్నారు. ఇందుకు సంబంధించి జలమండలి(హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ఎస్‌బీ) ఒప్పందం కుదుర్చుకుంది.
ఇంకా ఇవ్వాల్సింది 230 యూనిట్లకు మాత్రమే..: అదేవిధంగా హైదరాబాద్ పరిధిలో ఇతర కేటగిరీలకు సంబంధించి మరో 230 యూనిట్లకు మంజూరు తెలిపిన ప్రభు త్వం అర్హుల ఖాతాల్లో తొలివిడతలో భాగంగా రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు నిధిని జమ చేసింది. మిగతా నిధులను జమచేయాల్సి ఉండగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దీంతో ఆ నిధులు ఎస్సీ కార్పొరేషన్ వద్దే ఉండిపోయాయి.
ప్రస్తుతం కోడ్ పూర్తి కాగా... నిధులను మాత్రం అధికారులు లబ్దిదారుల ఖాతాకు విడుదల చేయడం లేదు. ఈమేరకు అనుమతి కోరుతూ ఎస్సీ కార్పొరేషన్ అధికా రులు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ సమర్పించినట్లు తెలిసింది. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు అందలేదు. మరోవైపు కొంత మేర ఆర్థిక సాయం పొందిన లబి్ధదారులు మిగతా సాయం కోసం ఎదురు చూస్తున్నారు. పూర్తిస్థాయిలో సాయం అందితే నిర్దేశించుకున్న యూనిట్‌లు తెరవాలని ఆశపడుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment