
సాక్షి, హైదరాబాద్: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం పరిధిలో దళితబంధు పథకం పైలెట్ ప్రాజెక్టు అమలుకు మరో రూ.500 కోట్ల నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. హుజూరాబాద్ సభ అనంతరం పైలెట్ ప్రాజెక్టు అమలుకు రూ.2,000 కోట్ల నిధులు విడుదల చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇందులో భాగంగా మొదటి విడతలో ఇప్పటికే రూ. 500 కోట్లను విడుదల చేయగా, తాజాగా విడుదల చేసిన రూ.500 కోట్లతో కలిపి మొత్తం రూ.1,000 కోట్లను పథకం కోసం అందుబాటులోకి తెచ్చారు. కాగా.. వారం రోజుల్లోపు మరో రూ.1,000 కోట్లను ప్రభుత్వం విడుదల చేయనున్నట్లు ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.