
సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ రాబందు అని, అలాంటి రాబందు నోట్లో నుండి ‘దళితబంధు’మాట వస్తే ఎవరూ నమ్మరని, హుజూరాబాద్ ఎన్నికల తరువాత మళ్లీ దళితబంధు ఊసే ఉండదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ వ్యాఖ్యానించారు. నాగార్జునసాగర్, జీహెచ్‌ఎంసీ, దుబ్బాక ఎన్నికల సందర్భంగా ఎన్ని హామీలు ఇచ్చారో, ఆ తరువాత వాటిని ఎట్లా మర్చిపోయారో ప్రజలందరికీ తెలుసునన్నారు.
ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో సినీనటి కరాటే కళ్యాణి యాదవ్, జల్‌పల్లి కౌన్సిలర్ ఉడుమల్ల యాదయ్య సహా పలువురు సినీ నటులు, జైన్‌సమాజ్‌కు చెందిన 200 మందితో పాటు ఇతర పార్టీల నాయకులు సంజయ్ సమక్షంలో బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో వారికి బండి సంజయ్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment