
కేసీఆర్ ( ఫైల్ ఫోటో )
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 400 మందికిపైగా మంది దళిత ప్రతినిధులు హాజరయినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment