Pragati Bhawan
-
దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 400 మందికిపైగా మంది దళిత ప్రతినిధులు హాజరయినట్లు తెలిసింది. -
ఆరు రోజులు.. గులాబీ కూలీలు!
-
ప్రగతి భవన్‌కు పరిమితమవడం సరికాదు
కేసీఆర్ భజనను గవర్నర్ మానుకోవాలి: వీహెచ్ సాక్షి, హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లకుండా ప్రగతిభవన్‌కే సీఎం కేసీఆర్ పరిమితమవడం సరికాదని కాంగ్రెస్ నేత వి.హనుమం తరావు అన్నారు. బీసీ నేత అయిన జ్యోతిబా పూలేకి నివాళుల ర్పించడానికి కూడా సీఎంకు సమయం లేకపోవడం దుర్మార్గమ న్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ని కలవడానికి సీఎంకు సమయం దొరుకుతోంది కానీ, పూలేకు నివాళులర్పిం చడానికి సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఈ విధంగా బీసీలను సీఎం కించపరుస్తున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ నేతలా గవర్నర్ నరసింహన్ కేసీఆర్ భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు. -
ఆరు రోజులు.. గులాబీ కూలీలు!
పార్టీ శ్రేణులు 14 నుంచి 20వ తేదీ మధ్య రెండు రోజులు కూలి పని చేయాలి: కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ 16వ ఆవిర్భావ దినం సందర్భంగా ఈ నెల 27న వరంగల్‌లో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని... ఆ సభకు వచ్చే పార్టీ కార్యకర్తలు కూలీ పనిచేసి ఖర్చులు సంపాదించుకోవాలని టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ సూచించారు. బహిరంగ సభకు ముందు 21వ తేదీన హైదరాబాద్‌లో పార్టీ ప్లీనరీ జరుగుతుందని చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక ఆనవాయితీ ప్రకారం ఈసారి కూడా మంత్రి నాయిని నర్సింహారెడ్డి ఆధ్వర్యంలో జరుగుతుందని, ఎన్నికల షెడ్యూల్‌ను ఆయనే ప్రకటిస్తారని తెలిపారు. బుధవారం ప్రగతిభవన్‌లో జరిగిన కేబినెట్ భేటీ అనంతరం కేసీఆర్ విలేకరులతో మాట్లాడారు. పధ్నాలుగేళ్ల ఉద్యమం తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్.. మొదట 51.5 లక్షల సభ్యత్వాలు చేసుకుందని తెలిపారు. అధికారంలోకి వచ్చిన మూడేళ్ల తర్వాత అదే సభ్యత్వం 75 లక్షలు దాటిపోతోందని చెప్పారు. సభ్యత్వాలకు ప్రజల్లో అద్భుతమైన స్పందన ఉందని, రుసుము పెంచినా సభ్యత్వం పెరుగుతోందని వ్యాఖ్యానించారు. దేశంలో అత్యధిక సంఖ్యలో సభ్యులున్న అతికొద్ది పార్టీల్లో టీఆర్ఎస్ ఒకటిగా అవతరించిందని పేర్కొన్నారు. సభ్యత్వ రుసుము ద్వారా రూ.25 కోట్ల నుంచి రూ.35 కోట్ల వరకు సమకూరనుం దని, ఇప్పటికే పార్టీ ప్రధాన కార్యాలయానికి రూ.13.5 కోట్లు అందాయని తెలిపారు. నియోజకవర్గాల పెంపు జరుగుతుంది అసెంబ్లీ నియోజకవర్గాల పెంపు అంశాన్నీ కేసీఆర్ ప్రస్తావించారు. ‘‘నియోజకవర్గాల పెంపు వంద శాతం జరగబోతోంది. దీనిపై నాకు సమాచారం ఉంది. పార్లమెంటు సమావేశాలు అయిపోయినా ఇబ్బంది ఉండదు. ఆర్డినెన్స్ తేవచ్చు..’అని చెప్పారు. కేబినెట్ విస్తరణపై ప్రశ్నించగా.. ‘అది చేసిన చంద్రబాబే తలపట్టుకున్నడు..’అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఉస్మానియా వర్సిటీ వందేళ్ల ఉత్సవాల నేపథ్యంలో.. హైదరాబాద్‌లో ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతో ప్లీనరీని, బహిరంగ సభను వేర్వేరుగా నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈనెల 26న ఉస్మానియా ఉత్సవాల్లో రాష్ట్రపతితో పాటు తాను కూడా పాల్గొంటానని తెలిపారు. నూరు శాతం మేనిఫెస్టో అమలు చేశాం.. దేశవ్యాప్తంగా ఏ రాజకీయ పార్టీ సాధించని ఘనతను టీఆర్ఎస్ సాధించిందని.. ఎన్నికల మేనిఫెస్టోను నూటికి నూరుశాతం అమలు చేశామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మేనిఫెస్టోలో చెప్పని కల్యాణలక్ష్మి, బీడీ కార్మికుల పెన్షన్లు, విదేశీ విద్యకు ఉపకార వేతనం, స్కూళ్లు, హాస్టళ్లకు సన్నబియ్యం వంటివాటినీ అమలు చేశామన్నారు. 2019 ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే రైతుల రుణాలను ఒకేసారి మాఫీ చేస్తామన్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ ప్రకటనను విలేకరులు ప్రస్తావించగా.. ‘వారు వచ్చేదుందా..? చచ్చేదుందా..’అని కేసీఆర్ కొట్టిపారేశారు. తాము అధికారంలోకి వస్తే ప్రగతిభవన్‌ను ఆస్పత్రిగా మారుస్తామన్న టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి ప్రకటనపైనా సీఎం స్పందించారు. ‘ఎవరిది హాస్పిటల్ అయిందో తెలుస్త లేదా.. ఇప్పుడు ఏముందక్కడ..’ అని ఎన్టీఆర్ ట్రస్ట్‌భవన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. నేనూ కూలి పని చేస్తా.. టీఆర్ఎస్ రాష్ట్ర అధ్యక్షుడి నుంచి కార్యకర్తల దాకా అందరూ కూలి చేసి బహిరంగ సభ కోసం డబ్బు సమకూర్చుకోవాలని కేసీఆర్ సూచించారు. తాను కూడా రెండు రోజుల పాటు కూలీ చేస్తానన్నారు. ఈనెల 14వ తేదీ నుంచి 20వ తేదీవరకు గులాబీ కూలీ దినాలుగా ప్రకటిస్తున్నానని.. ఆ ఆరు రోజుల వ్యవధిలో కనీసం రెండు రోజుల పాటు కూలీ చేయాలని పేర్కొన్నారు. దేశంలో నంబర్ వన్ సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందిందని, ఇక్కడ అమలు చేస్తున్న పథకాలపై ఇతర రాష్ట్రాలు అధ్యయనం చేసి వెళుతున్నాయని కేసీఆర్ చెప్పారు. ఈ నేపథ్యంలో జరుగుతున్న వరంగల్ సభను కనీవినీ ఎరుగని రీతిలో విజయవంతం చేసుకోవాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కేటీఆర్‌కు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఇస్తున్నారన్న ఊహాగానాలను విలేకరులు ప్రస్తావించగా.. ‘మీరే ఊహాగానం అంటున్నారు కదా..? ఊహగానంగానే ఉండనీయండి..’ అని కేసీఆర్ పేర్కొన్నారు. -
అణువణువూ అనుసంధానం
⇔ ప్రగతి భవన్‌కు గ్రేటర్‌లోని సీసీ కెమెరాలన్నీ లింక్ ⇔కీలక సమయాల్లో సీఎం స్వయంగా పర్యవేక్షించేందుకే ⇔హనుమాన్ జయంతి యాత్రతో మొదలైన లింకేజీ సాక్షి, హైదరాబాద్: నగరంలోని ప్రతి కీలక ప్రాంతాన్ని ఇకపై ముఖ్యమంత్రి అధికార నివాసమైన ప్రగతి భవన్ నుంచి వీక్షించవచ్చు. నగర వ్యాప్తంగా ఏర్పాటైన ప్రభుత్వ, కమ్యూనిటీ సీసీ కెమెరాలను అనుసంధానించడంతో ఇది సాధ్యమవుతోంది. హనుమాన్ జయంతి శోభాయాత్ర నేపథ్యంలో మంగళవారం ఈ లింకేజ్ పనిచేయడం ప్రారంభమైంది. డీజీపీ కార్యాలయంతోనూ వీటిని లింక్ చేశారు. కీలక సమయాలు, ఉత్సవాలు, ఊరేగింపులు జరిగేప్పుడు ముఖ్యమంత్రితో పాటు డీజీపీ సైతం పరిస్థితుల్ని పర్యవేక్షించడం కోసం ఈ ఏర్పాట్లు చేసినట్లు నగర పోలీసు అధికారులు చెప్పారు. పది వేలకు పైగా కెమెరాల అనుసంధానం... ప్రజా భద్రతా చట్టాన్ని పక్కాగా అమలు చేస్తున్న సిటీ పోలీసులు సీసీ కెమెరాల ఏర్పాటుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ నిఘా, ట్రాఫిక్ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. మరోపక్క ఆయా ప్రాంతాల్లో ఉండే స్థానిక వ్యాపార, వాణిజ్య వర్గాలతో పాటు అపార్ట్మెంట్ వాసుల్నీ కలుపుకుంటూ వెళ్తున్న పోలీసులు వారితో కమ్యూనిటీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయిస్తున్నారు. ఈ రకంగా ఇప్పటికే నగరంలో 10 వేలకు పైగా సీసీ కెమెరాలు అందుబాటులోకి వచ్చాయి. వీటిని బషీర్‌బాగ్ కమిషనరేట్‌లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్‌తో (సీసీసీ) అనుసంధానించారు. దీంతో పాటు స్థానిక పోలసుస్టేషన్లు, ఏసీపీ, డీసీపీ కార్యాలయాల్లోనూ మినీ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేయించారు. వీటి నుంచి సీసీ కెమెరాల్లో కనిపించే దృశ్యాలను పర్యవేక్షించే అవకాశం కల్పించారు. పారిశుధ్యం, మంచినీటి సరఫరా, లీకేజీలు తదితరాల పర్యవేక్షణకూ ఇప్పటికే ఈ సీసీ కెమెరాలను వినియోగిస్తున్నారు. దీనికోసం ఆయా విభాగాలకూ భాగస్వామ్యం కల్పించారు. ఇకపై వీటన్నింటినీ అవసరమనుకున్నప్పుడు సీఎం ప్రగతిభవన్ నుంచి పర్యవేక్షించే అవకాశం ఏర్పడింది. వివిధ ఉత్సవాల సందర్భంగా నగరంలో జరిగే భారీ ర్యాలీల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిరోధించడానికి ఇది దోహదపడుతుంది. నిత్యం వీటికి సంబంధించిన సమాచారం సీఎం, డీజీపీ తదితర కార్యాలయాలకు చేరుతుంటుంది. హనుమాన్ ర్యాలీ పర్యవేక్షణ... మంగళవారం జరిగిన హనుమాన్ జయంతి ర్యాలీని నగర పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి సీసీసీ నుంచి, డీజీపీ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ నుంచి డీజీపీ అనురాగ్ శర్మ పర్యవేక్షించారు. మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో ప్రగతి భవన్లో సీఎం, ఇతర అధికారులు సైతం దీన్ని వీక్షించినట్లు తెలిసింది. దీనికోసం ప్రగతిభవన్‌లో ప్రత్యేకంగా భారీ వీడియో వాల్‌ను శాశ్వత ప్రాతిపదికన ఏర్పాటు చేశారు. -
ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
⇒ ప్రగతి భవన్లో పండుగ వాతావరణం ⇒ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు. ప్రధాని మోదీ శుభాకాంక్షలు సీఎం కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం కేసీఆర్‌కు మోదీ ఫోన్ చేసి బర్త్ డే వి షెస్ తెలిపారు. సంపూర్ణ ఆరో గ్యంతో నిండు జీవితం గడపాలని శుభాశీస్సు లు అందించారు. ఈ సందర్భంగా ప్రధా నికి సీఎం కృతజ్ఞ తలు తెలిపారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాం క్షల సందేశాన్ని ప్ర ధాని ట్వీటర్‌లోనూ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్లో తమ శుభాకాంక్షలు తెలపగా.. వారిద్దరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్లో.. తెలంగాణ భవన్లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహ న్, డిప్యూటీ మే యర్ బాబా ఫసి యుద్దీన్ తదితరు లు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తో్తందన్నారు. వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాయిని మాట్లాడుతూ.. కేసీఆర్, అమరుల త్యాగమే తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేసీఆర్ ఛాయా చిత్రాల ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు. శంభీపూర్ రాజు శుభాకాంక్షలు కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శుక్రవారం ప్రగతి భవన్లో ముఖ్యమంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగా సీఎంను కలసిన రాజు.. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చిన్న వయస్సులోనే కేసీఆర్‌తో అడుగులు వేసిన శంభీపూర్ రాజు ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా, కేటీఆర్‌కు ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. గత సంవత్సరం ఎమ్మెల్సీగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి రాజును గెలిపించి చిన్న వయసులోనే పెద్దల సభకు పంపించిన ఘనత కేసీఆర్‌కు దక్కింది. నాన్నా.. హ్యాపీ బర్త్‌డే: మంత్రి కేటీఆర్ కేసీఆర్‌కు ఆయన కుమారుడు, మంత్రి కె.తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముద్దుబిడ్డ, జన నేత, భయమే తెలియని పోరాట యోధుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాన్నా.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..’ అంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఫొటోను పోస్ట్ చేశారు. -
రైతులతో నేరుగా చర్చలు
రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో సమావేశాలు ► సమీక్షలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం ► పలు కార్యక్రమాలపై రైతులకు అవగాహన కల్పించాలని సూచన సాక్షి, హైదరాబాద్: రైతులు, మత్స్యకారులు, గొర్రెల పెంపకందారులతో నేరుగా చర్చించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. త్వరలో ‘జనహిత’లో ఆయా వర్గాలతో విస్తృత సమావేశాలు నిర్వహిస్తానని ప్రకటించారు. ఎక్కువ మంది జనాభాకు జీవనాధారమైన వ్యవసాయం– అనుబంధ రంగాలు, గొర్రెల పెంపకం, మత్స్య శాఖల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర చర్యలు తీసుకుంటోందని సీఎం ఉద్ఘాటించారు. వ్యవసాయం, ఉద్యానవనం, నీటి పారుదల, మత్స్యశాఖ, గొర్రెల పెంపకం తదితర అంశాలపై శనివారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఈ రంగాల్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి, భవిష్యత్తు నిర్ణయాలు, చేయాల్సిన కార్యక్రమాలపై డాక్యుమెంటరీలు రూపొందించి అవగాహన కల్పించాలని అధికారులను సీఎం ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల రూపకల్పన ప్రజల భాగస్వామ్యంతో, వారికి అవసరమైన రీతిలో జరగాలని కోరారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమం తమ అభివృద్ధి, సంక్షేమం కోసం చేస్తున్నదే అన్న విశ్వాసం ఆయా వర్గాల్లో కలగాలన్నారు. లాభమంతా మత్స్యకారులకే.. ఇంతకాలం రాష్ట్రంలో మత్స్య పరిశ్రమ నిర్లక్ష్యానికి గురైందని, చేపలు దిగుమతి చేసుకునే దుస్థితి నెలకొందని కేసీఆర్ పేర్కొన్నారు. భవిష్యత్తులో చేపల పెంపకానికి అధిక ప్రాధాన్యమిస్తామని, చేప పిల్లల ఉత్పత్తి, పెంపకం, మార్కెటింగ్, వసతుల కల్పన, నిర్వహణ భారాన్నంతా ప్రభుత్వమే భరిస్తుందన్నారు. నిర్వహణ వ్యయం పోగా మిగిలిన లాభం అంతా మత్స్యకారులకే దక్కేలా నిర్ణయం తీసుకుంటామన్నారు. చేపలు పట్టుకుని జీవించే కులాలు, కుటుంబాలకు మేలు జరిగేలా కార్యక్రమం రూపొందిస్తామన్నారు. పెద్ద ఎత్తున నిర్మిస్తున్న నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ చెరువులు, మధ్యతరహా నీటిపారుదల ప్రాజెక్టులతో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, నాగార్జునసాగర్, శ్రీశైలం రిజర్వాయర్లలో కూడా మనకు వాటాలు దక్కుతాయన్నారు. చేపల పెంపకం కోసం ప్రాజెక్టులను బాగా ఉపయోగించుకోవాలని, ప్రాజెక్టుల వద్దే చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాలు నెలకొల్పాలని ఆదేశించారు. మిషన్ భగీరథ కోసం ప్రతి ప్రాజెక్టు వద్ద 10 శాతం నీళ్లు నిల్వ ఉంచాలని నిర్ణయం తీసుకున్నందున నీటి కొరత ఉండదన్నారు. గొర్రెల పెంపకానికి ప్రోత్సాహం.. రాష్ట్రంలోని యాదవులు, కుర్మల ను ప్రోత్సహించి గొర్రెల పెంప కాన్ని విస్తృతంగా పెంచాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర అవసరాలు తీర్చడమే కాకుండా ఇతర ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా గొర్రెల పెంపకం ఉండాలన్నారు. ఏడాదికి లక్ష చొప్పున కనీసం రెండు లక్షల మందికి గొర్రె పిల్లలు కొనివ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. దీనికి అనుగుణంగా గొర్రె పిల్లల పంపిణీకి ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాలన్నారు. సమావేశంలో సమాచార శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ, నీటిపారుదల శాఖ ఈఎన్ సీ మురళీధర్‌రావు, వ్యవసాయ శాఖ కమిషనర్ జగన్ మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. అవసరాలకు తగ్గట్టు ప్రణాళిక ‘ఎక్కువ మంది వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్నారు. నీటిపారుదల రంగానికి ఇస్తున్న ప్రాధాన్యం వల్ల రాష్ట్రంలో సాగుభూమి పెరుగుతుంది. రాష్ట్రంలోని వాతావరణం, వర్షపాతం, నేల స్వభావానికి ఏ రకమైన పంటలు అనుకూలమైనవి? ఏ వ్యవసాయ ఉత్పత్తులకు డిమాండ్ ఉంది? ఏ నేలలో ఏ పంట వేయాలి? పంట ఉత్పత్తుల మార్కెటింగ్ పరిస్థితి ఏంటి? వ్యవసాయదారుల కోసం ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలేంటి? వ్యవసాయ యాంత్రీకరణ, గ్రీన్ హౌజ్, పాలీ హౌజ్ సాగు విధానాల ద్వారా ఎలాంటి పంటలు పండించవచ్చు? తదితర విషయాలపై రైతులకు అవగాహన కల్పించాలి. ఈ మేరకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు, కార్యక్రమాలుండాలి’ అని సీఎం ఆదేశించారు. -
మధ్యప్రదేశ్ సీఎం నివాసాన్ని చూసే కట్టించా
ప్రగతి భవన్‌పై ముఖ్యమంత్రి కేసీఆర్ సాక్షి, హైదరాబాద్: ఇటీవల సీఎం కేసీఆర్ గృహప్రవేశం చేసిన కొత్త క్యాంపు కార్యాలయం తరచూ వార్తల్లో అంశంగా మారుతోంది. అనవసరంగా నిర్మించారంటూ ప్రతిపక్షాలు విమర్శిస్తుండటం, నేరుగా అసెంబ్లీలోనే ప్రస్తావనకు తేవడంతో ముఖ్యమంత్రి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది. తాజాగా మంగళవారం మరో సందర్భంలో స్వయంగా ముఖ్యమంత్రే దాన్ని ప్రస్తావించారు. మత్స్యశాఖపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా ఆయన దీని గురించి మాట్లాడారు. ‘‘నేను మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ అధికార నివాసాన్ని చూసిన తర్వాత అలాంటి భవనం తెలంగాణ ముఖ్యమంత్రికి ఉండాలని భావించి ప్రగతి భవన్ నిర్మించా. మధ్యప్రదేశ్ సీఎం నివాసంలో దాదాపు 2 వేల మంది సామర్థ్యంతో భారీ సమావేశ మందిరం ఉంది. అది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. ఎక్కువ మంది పాల్గొనాల్సిన సమావేశాలకు అలాంటి హాలు అవసరం. అందుకే తెలంగాణ ముఖ్యమంత్రి అధికార నివాసంలో జనహిత పేరుతో అలాంటి హాల్‌నే నిర్మించా. దాదాపు 1,500 మంది ఇందులో కూర్చోవచ్చు. ఇప్పుడు ఆ హాలులో మత్య్యకార వృత్తిలో ఉండే వారితో సమావేశమవుతా. వీలైతే సంక్రాంతి సమయంలోనే సమావేశం ఏర్పాటు చేస్తా’’అని వివరించారు. మంత్రి తలసాని సూచనతో మంగళవారం ముఖ్యమంత్రి శాసనసభ వేదిక ద్వారా ప్రజలకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. కొత్తగా చేపట్టబోయే వంతెనలను చెక్‌డ్యాం నమూనాలో నిర్మించాలని సూచించానని, అవి కూడా నీటిని నిల్వ చేస్తే వాటిల్లో కూడా చేపలు పెంచే వెసులుబాటు ఉంటుందని సీఎం అన్నారు. -
ప్రగతి భవన్‌పై రాజకీయాలు
-
నేడు కలెక్టర్ల సదస్సు
సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల అభివృద్ధి ప్రణాళికల తయారీయే లక్ష్యంగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నేడు జిల్లా కలెక్టర్లతో సమావేశమవుతున్నారు. కొత్తగా నిర్మించిన ముఖ్యమంత్రి అధికారిక నివాస ప్రాంగణంలోని ప్రగతిభవన్ లో బుధవారం ఉదయం 11 గంటలకు ఈ సదస్సు ప్రారంభమవుతుంది. జిల్లా కలెక్లర్లతో పాటు ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు, జాయింట్ కలెక్టర్లు, జీహెచ్ఎంసీ, వరంగల్, కరీంనగర్ మున్సిపల్ కమిషనర్లు, సబ్ కలెక్టర్లు, అసిస్టెంట్ కలెక్టర్లు ఈ సదస్సుకు హాజరవుతారు. కలెక్టర్ల సదస్సులో చర్చించే అంశాల ఎజెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ఖరారు చేశారు. నో యువర్ డిస్టిక్ర్ ్ట(మీ జిల్లా గురించి తెలుసుకోండి).. ప్లాన్ యువర్ డిస్టిక్ట్ర్ (మీ జిల్లా ప్రణాళిక రూపొందించండి) లక్ష్యంగా 20 అంశాలపై ఈ సదస్సులో చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటుతో వచ్చిన పరిపాలనా సంస్కరణల ఫలితాలను ప్రజలకు అందించేందుకు అవసరమైన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తోంది. స్థానిక ప్రాధాన్యతలకు అనుగుణంగా ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేపట్టే దిశగా ముఖ్యమంత్రి వ్యూహరచన చేస్తున్నారు. కొత్త జిల్లాలు ఏర్పడి రెండు నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికే కలెక్టర్లకు జిల్లాలపై కొంత అవగాహన వచ్చి ఉంటుందని, మరికొన్ని అంశాల్లో కూడా అధ్యయనం చేసేలా వాళ్లకు మార్గదర్శకం చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. నిర్దేశించిన ఎజెండాలోని అంశాలపై నివేదికను సిద్ధం చేసుకుని రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌చంద్ర అన్ని జిల్లాల కలెక్టర్లను ఇప్పటికే ఆదేశించారు. -
అభివృద్ధికి మార్గదర్శిగా ‘ప్రగతి భవన్’
ఇక అధికారిక కార్యక్రమాలన్నీ ఇక్కడి నుంచే..: సీఎం కేసీఆర్ సమాజంలోని అన్ని వర్గాలతో నేరుగా మాట్లాడుతాం ఆయా వర్గాల వారిని ప్రభుత్వ ఖర్చులతోనే రప్పిస్తాం క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు తెలుసుకుని చర్యలు చేపడతాం సాక్షి, హైదరాబాద్: కొత్తగా ప్రారంభిం చుకున్న ‘ప్రగతి భవన్’ రాష్ట్ర అభివృద్ధికి మార్గదర్శకం చేసే వేదికగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షిం చారు. దానిలో భాగంగా నిర్మించిన ‘జనహిత’ సమావేశ మందిరం ప్రభుత్వ పథకాలు, విధానాల రూపకల్పనలకు, కార్యక్రమాల అమలు కార్యాచరణ సిద్ధం చేయడానికి, ప్రజలతో ముఖాముఖి నిర్వహించడానికి ఉపయోగపడుతుం దన్నారు. కలెక్టర్ల సదస్సుతో సహా ఇతర ఏ సమావేశం నిర్వహించాలనుకున్నా ఇప్పటి వరకు తగిన స్థలం లేక హోటళ్ల చుట్టూ తిరిగామని, ఇప్పుడా సమస్య తీరిందని పేర్కొన్నారు. ఇకపై జనహితలో నిరంతరం వివిధ వర్గాలతో సమావేశాలు నిర్వహిస్తూ, పాలనా ఫలితాలు క్షేత్రస్థాయిలో అమలు కావడానికి కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు. బేగంపేటలో ముఖ్యమంత్రి నూతన క్యాంపు కార్యాలయం ‘ప్రగతి భవన్’ను ప్రారంభించిన అనంతరం అందులోని చాంబర్లో భవన్ నిర్వహణ, జనహిత ఉద్దేశాలపై సీఎం కేసీఆర్ సమీక్షించారు. మంత్రులు కేటీఆర్, జగదీశ్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఎంపీ కె.కేశవరావు, మండలి విప్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఇందులో పాల్గొన్నారు. సమాజంలో అనేక వర్గాల ప్రజలు వివిధ సమస్యలతో బాధపడుతుంటారని.. ప్రభుత్వం వారితో నేరుగా మాట్లాడితే పరిష్కారం దొరుకు తుందని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. రైతులు, కార్మికులు, మహిళ లు, వృత్తిపనివారు సహా ప్రతి వర్గంతో ఇకపై ‘జనహిత’లో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తామని... వారిని ప్రభుత్వ ఖర్చులతోనే హైదరాబాద్‌కు రప్పించి మాట్లాడతామని తెలిపారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితిని తెలుసు కుని, ప్రభుత్వ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో అమలు చేయడానికి అవసరమైన పంథాను ఖరారు చేస్తామని చెప్పారు. ఇఫ్తార్ విందులు, క్రిస్మస్ డిన్నర్లు, ఉగాది పంచాంగ శ్రవణాలు, కవి సమ్మేళనాలు తదితర అధికారిక కార్యక్రమాలన్నీ ఇకపై ప్రగతిభవన్లోనే జరుగుతాయని సీఎం ప్రకటించారు. ఎస్టీ విద్యార్థుల ఎంటీఎఫ్పై తొలి సంతకం పోస్ట్ మెట్రిక్ హాస్టళ్లలో ఎస్సీ, బీసీ విద్యార్థుల మాదిరిగానే ఇకపై ఎస్టీ విద్యార్థులకు సైతం నెలవారీగా నిర్వహణ ఖర్చు (ఎంటీఎఫ్) చెల్లించాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ సంతకం చేసిన తొలి ఉత్తర్వు ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలోని 101 ఎస్టీ హాస్టళ్లలో 14,685 మంది విద్యార్థులు ఉంటున్నారు. వారికి ప్రతినెలా కాకుండా ఆరు నెలలకు, ఏడాదికోసారి బిల్లులు వచ్చేవి. దాంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ పరిస్థితిని గమనించిన ముఖ్యమంత్రి... ఎస్టీ విద్యార్థులకు నెలవారీగా చెల్లించాలని ఆదేశించారు. దీని ప్రకారం ఒక్కో విద్యార్థికి నెలకు రూ.1,050 నుంచి రూ.1,200 వరకు అందనున్నాయి. -
‘అత్యాచారం’పై 24 గంటల్లో ఎఫ్ఐఆర్
* నిందితులపై చట్ట ప్రకారం చర్యలు * విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో కలెక్టర్ * ఎస్సీ, ఎస్టీలకు భద్రత కల్పిస్తామని హామీ ఇందూరు : ఎస్సీ, ఎస్టీలపై అత్యాచారాలు జరిగిన 24 గంటల్లోగా ఎఫ్ఐఆర్ నమోదు చేసి వివరాలను ఎస్పీతో పాటు కలెక్టరేట్‌కు పంపాలని కలెక్టర్ యోగితా రాణా అధికారులను ఆదేశించారు. చట్టం ప్రకారం నిందితులపై చర్యలు తీసుకుంటామని, బాధితులకు ఆర్థిక సాయం అందిస్తామని తెలిపారు. శుక్రవారం జిల్లాకేంద్రంలోని ప్రగతి భవన్లో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఇందులో ఎస్సీ, ఎస్టీ కుటుంబాలపై జరిగిన అత్యాచార సంఘటనలు, నమోదైన కేసులపై చేపట్టిన చర్యలను సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అత్యాచార సంఘటనలకు సంబంధించి 62 కేసులు కోర్టులో విచారణలో ఉన్నాయని, మరో 25 సంఘటనలు ఇన్వెస్టిగేషన్లో ఉన్నాయని తెలిపారు. బాధిత కుటుంబాలకు తాత్కాలిక ఉపశమనాన్ని కలిగించేందుకు రూ. 15 వేల చొప్పున 2014లో 50 మందికి, 2015లో 16 మందికి ప్రభుత్వంనుంచి ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు. ప్రతివారం నమోదైన కేసుల వివరాలను డీఎస్పీల వారీగా అందజేయాలని ఆదేశించారు. ఎఫ్ఐఆర్ నమోదు అయిన వెంటనే బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాలో 25 శాతం విడుదల చేయనున్నట్లు తెలిపారు. నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు చార్జిషీట్లు దాఖలు చేయాలని, దాని ప్రతులను మండల స్థాయి జెండర్ కమిటీలకు పంపాలని సూచించారు. సామాజిక వివక్షపై ఆందోళన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లవుతున్నా ఇప్పటికీ కుల బహిష్కరణ, దేవాలయాల్లోకి ప్రవేశాల నిషేధం తదితర సామాజిక వివక్షలు కొనసాగడంపై కలెక్టర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీలలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదుపై స్పందించాలని పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులను, అట్రాసిటీ కమిటీ సభ్యులను కోరారు. ప్రభుత్వం అండగా ఉంటుందనే భరోసాను కల్పించేందుకు ఇక నుంచి ప్రతి నెలా 30వ తేదీన పౌరహక్కుల దినోత్సవంగా జరుపనున్నట్లు తెలిపారు. అన్ని మండలాల్లో రెవెన్యూ, పోలీసు, ఇతర ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఎస్సీ, ఎస్టీ గ్రామాలు, కాలనీలలో పర్యటిస్తామన్నారు. అవగాహన సదస్సులు నిర్వహిస్తాం అలాగే సాంఘిక సంక్షేమ శాఖ విద్యా సంస్థల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇటు ఇంటర్, డిగ్రీ విద్యార్థినులకు ఎస్సీ, ఎస్టీల హక్కుల సంరక్షణకు ప్రభుత్వం రూపొందించిన చట్టాలు, ఏర్పాటు చేసిన యంత్రాంగం గురించి అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 714 ఎకరాల భూ పంపిణీ లక్ష్యానికి అనుగుణంగా జిల్లా యంత్రాంగం ముందుకు వెళ్తోందని, ఈనెల 30వ తేదీ నాటిని లక్ష్యాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. సామాజిక వివక్షను నిర్మూలించేందుకు కల్పించిన చట్టపరమైన హక్కుల గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలని జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ వీజీ గౌడ్ సూచించారు. సమాజంలో ఏ వర్గానికి చెందిన ప్రజలు కూడా వివక్షకు గురి కారాదని, అదే సమయంలో ఏ వ్యక్తి కూడా అన్యాయంగా శిక్షించబడరాదని పేర్కొన్నారు. కక్షలతో కావాలనే అట్రాసిటీ కేసులు పెట్టిన చాలా సంఘటనలున్నాయని, అవి కూడా విచారించి నిజానిజాలు తేల్చాలని సూచించారు. చట్టాన్ని తప్పుడు పనులకు ఉపయోగించిన వారిపై కూడా చర్యలు తీసుకోవాలన్నారు. ‘గుర్తింపు’ ఇవ్వాలి ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, అత్యాచార సంఘటనలపై ఏడాదిలో మూడు నెలలకు ఒకసారి సమావేశాలు నిర్వహించాల్సి ఉన్నా అలా చేయడం లేదని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. తద్వారా కేసులు నీరుగారిపోతున్నాయన్నారు. కమిటీ సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కలెక్టర్‌ను కోరారు. సమావేశంలో ఎస్పీ చంద్రశేఖరరెడ్డి, ఏఎస్పీ ప్రతాప్‌రెడ్డి, ఏజేసీ రాజారాం, ఐకేపీ పీడీ వెంకటేశం, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ విజయ్ కుమార్, కమిటీ సభ్యులు సాయిలు, నాగభూషణం, ప్రభుదాస్ తదితరులు పాల్గొన్నారు.