ఘనంగా సీఎం జన్మదిన వేడుకలు
⇒ ప్రగతి భవన్‌లో పండుగ వాతావరణం
⇒ శుభాకాంక్షలు తెలియజేసిన ప్రధాని మోదీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్రంలోని పలువురు ప్రముఖులు, మంత్రులు, వివిధ జిల్లాల నుంచి తరలివచ్చిన నేతలు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయాన్నే వేద పండితులు సీఎంను ఆశీర్వదించారు. సీఎంను కలసి శుభాకాంక్షలు తెలిపేందుకు వచ్చిన ప్రముఖులతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రగతి భవన్‌లో పండుగ వాతావరణం వెల్లివిరిసింది. మంత్రులు, ప్రభుత్వ సలహాదారులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు, సీఎంవో అధికారులు క్యాంపు కార్యాలయానికి వెళ్లి సీఎంను కలిశారు. పుష్పగుచ్ఛాలు అందించి శుభాకాంక్షలు చెప్పారు.
ప్రధాని మోదీ శుభాకాంక్షలు
సీఎం కేసీఆర్‌కు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం ఉదయం కేసీఆర్‌కు మోదీ ఫోన్ చేసి బర్త్ డే వి షెస్ తెలిపారు. సంపూర్ణ ఆరో గ్యంతో నిండు జీవితం గడపాలని శుభాశీస్సు లు అందించారు. ఈ సందర్భంగా ప్రధా నికి సీఎం కృతజ్ఞ తలు తెలిపారు. కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాం క్షల సందేశాన్ని ప్ర ధాని ట్వీటర్‌లోనూ ట్వీట్ చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు, మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావు కూడా కేసీఆర్‌కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. ఫోన్‌లో తమ శుభాకాంక్షలు తెలపగా.. వారిద్దరికీ సీఎం కృతజ్ఞతలు తెలిపారు.
తెలంగాణ భవన్‌లో..
తెలంగాణ భవన్‌లో జరిగిన వేడుకల్లో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, హోం మంత్రి నాయిని నర్సింహా రెడ్డి, నిజామాబాద్ ఎంపీ కవిత, జీహెచ్ ఎంసీ మేయర్ బొంతు రామ్మోహ న్, డిప్యూటీ మే యర్ బాబా ఫసి యుద్దీన్ తదితరు లు పాల్గొన్నారు. కేక్ కట్ చేసిన అనంతరం ఎంపీ కవిత మాట్లాడుతూ.. కేసీఆర్ జన్మదిన వేడుకలు తెలంగాణ భవన్‌లో జరుపుకోవడం ఆనవాయితీగా వస్తో్తందన్నారు. వేడుకల్లో పాల్గొన్న కార్యకర్తలకు ఆమె ధన్యవాదాలు తెలిపారు. నాయిని మాట్లాడుతూ.. కేసీఆర్, అమరుల త్యాగమే తెలంగాణ రాష్ట్రమని పేర్కొన్నారు. ప్రజలంతా కేసీఆర్ వెంటే ఉన్నారని, ఎవరెన్ని కుట్రలు చేసినా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోలేరని స్పష్టం చేశారు. తెలంగాణ భవన్‌లో కేసీఆర్ ఛాయా చిత్రాల ప్రదర్శనను మంత్రులు ప్రారంభించారు.
శంభీపూర్ రాజు శుభాకాంక్షలు
కేసీఆర్ జన్మదినం సందర్భంగా రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు శుక్రవారం ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రిని కలసి శుభాకాంక్షలు తెలిపారు. మర్యాదపూర్వకంగా సీఎంను కలసిన రాజు.. పుష్పగుచ్ఛం అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు. 2001 నుంచి తెలంగాణ ఉద్యమంలో చిన్న వయస్సులోనే కేసీఆర్‌తో అడుగులు వేసిన శంభీపూర్ రాజు ఆయనకు అత్యంత నమ్మకస్తుడిగా, కేటీఆర్‌కు ముఖ్య అనుచరుడిగా ఉంటూ వచ్చారు. గత సంవత్సరం ఎమ్మెల్సీగా రంగారెడ్డి జిల్లా స్థానిక సంస్థల నుంచి రాజును గెలిపించి చిన్న వయసులోనే పెద్దల సభకు పంపించిన ఘనత కేసీఆర్‌కు దక్కింది.
నాన్నా.. హ్యాపీ బర్త్‌డే: మంత్రి కేటీఆర్
కేసీఆర్‌కు ఆయన కుమారుడు, మంత్రి కె.తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ ముద్దుబిడ్డ, జన నేత, భయమే తెలియని పోరాట యోధుడు కేసీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు. ఆయన కుమారుడిగా పుట్టినందుకు ఎంతో గర్వంగా ఉంది. నాన్నా.. మీకు పుట్టిన రోజు శుభాకాంక్షలు..’ అంటూ ట్వీట్ చేశారు. కేసీఆర్ ఫొటోను పోస్ట్ చేశారు.