ప్రధానిని ఏనాడైనా ఆహ్వానించారా? | Kishan Reddy fires on cm kcr | Sakshi
Sakshi News home page

ప్రధానిని ఏనాడైనా ఆహ్వానించారా?

Published Thu, Dec 24 2015 2:49 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

ప్రధానిని ఏనాడైనా ఆహ్వానించారా? - Sakshi

ప్రధానిని ఏనాడైనా ఆహ్వానించారా?

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి
 సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీని ముఖ్యమంత్రి కేసీఆర్ ఏనాడైనా రాష్ట్రానికి ఆహ్వానించారా అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి కోసం కనీసం ప్రతిపాదనలను పంపాలనే స్పృహ కూడా ప్రభుత్వానికి లేకుండా పోయిందని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన ప్రతిపాదనలు అందకున్నా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం 67,794 ఇళ్లను మంజూరు చేసిన విషయాన్ని గుర్తుచేశారు.

కేంద్రం మంజూరు చేసిన నిధులతో ప్రారంభం అవుతున్న ఇళ్లను మంత్రి కేటీఆర్ ఏ హోదాలో ప్రారంభించారో ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మోదీని విమర్శించే స్థాయి, నైతికహక్కు మంత్రి కేటీఆర్‌కు లేదన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement