సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు
సిరిసిల్ల, న్యూస్‌లైన్: తెలంగాణలో పెత్తనం చెలాయించేందుకు జాతీయ పార్టీలు కుట్ర పన్నుతున్నాయని సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు ఆరోపించారు. కరీంనగర్ జిల్లా సిరిసిల్లలో బుధవారం ఆయన విలేకరుల తో మాట్లాడారు. కరీంనగర్ సభలో నరేంద్రమోడీ తల్లిని చంపి బిడ్డకు పురుడుపోశారని చెప్పడం ఏమిటని ప్రశ్నించారు. ఏ తల్లి చనిపోయింది.. ఏ బిడ్డ పుట్టింది.. హిందీ మాట్లాడే రాష్ట్రాలు ఎనిమిది ఉండవచ్చుగానీ.. తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉండొద్దా అన్నారు. మోడీకి చంద్రబా బు, పవన్‌లే ప్రచారానికి దొరికారా అని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన కిషన్‌రెడ్డి, దత్తాత్రేయ, విద్యాసాగర్‌రావు పనికిరారా అని ఎద్దేవా చేశారు. వెన్నుపోట్లకు, నయవంచనకు కాంగ్రెస్ కేరాఫ్ అని ఆరోపించారు.
మోడీకి తెలంగాణ నేతలు పనికిరారా?
Published Thu, Apr 24 2014 5:04 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM
Advertisement
Advertisement