
ప్రగతి భవన్‌కు పరిమితమవడం సరికాదు
కేసీఆర్ భజనను గవర్నర్ మానుకోవాలి: వీహెచ్
సాక్షి, హైదరాబాద్: ప్రజల్లోకి వెళ్లకుండా ప్రగతిభవన్‌కే సీఎం కేసీఆర్ పరిమితమవడం సరికాదని కాంగ్రెస్ నేత వి.హనుమం తరావు అన్నారు. బీసీ నేత అయిన జ్యోతిబా పూలేకి నివాళుల ర్పించడానికి కూడా సీఎంకు సమయం లేకపోవడం దుర్మార్గమ న్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గవర్నర్‌ని కలవడానికి సీఎంకు సమయం దొరుకుతోంది కానీ, పూలేకు నివాళులర్పిం చడానికి సమయం దొరకడం లేదా అని ప్రశ్నించారు. ఈ విధంగా బీసీలను సీఎం కించపరుస్తున్నారని ఆరోపించారు. టీఆర్‌ఎస్ నేతలా గవర్నర్ నరసింహన్ కేసీఆర్ భజన చేయడం మానుకోవాలని హితవు పలికారు.