'ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం' | v hanumantha rao slams trs government | Sakshi
Sakshi News home page

'ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే సహించం'

Published Sat, May 20 2017 3:53 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM

v hanumantha rao slams trs government

హైదరాబాద్‌: తెలంగాణ ఇచ్చిన పార్టీని నరరూప రాక్షస పార్టీ అంటారా అని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంత రావు టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన డీఎస్‌ను, కేకేను కలుపుకుని తమ పార్టీని నరరూప రాక్షస పార్టీ అనడంపై సీఎం కేసీఆర్‌ సమాధానం చెప్పాలని నిలదీశారు. ఇష్టం వచ్చినట్లు కాంగ్రెస్‌ను తిడుతూ మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. కాంగ్రెస్ నరరూప రాక్షస పార్టీ అనే వ్యాఖ్యలను సీఎం కేసీఆర్‌ వెనక్కి తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.
 
రైతుల సమస్యలను తెలుసుకోవడానికి రాహుల్ వారితో మాట్లాడతారని స్పష్టం చేశారు. తమ పార్టీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి, కార్యకర్తలఫై దాడి చేస్తారు.. రైతులకు బేడీలు వేసి రైతే రారాజు అంటారు.. ఇదేమి పద్దతి అని ప్రశ్నించారు. బయటకు ఫ్రెండ్లి పోలీస్ అంటావు.. లోపలనేమో కేసులు పెట్టిస్తావు.. ఎవరి అబ్బ సొత్తు అని పోలీసులకు రూ. 500 కోట్లు ఇస్తానంటున్నావు అని వీహెచ్‌ వ్యాఖ్యానించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement