'కేసీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు'
Published Thu, Aug 25 2016 3:57 PM | Last Updated on Thu, Sep 19 2019 8:28 PM
హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులపై తెలంగాణ సీఎం కేసీఆర్ అహంకార ధోరణితో మాట్లాడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ.. కేసులు పెట్టి జైల్లో పెడతా, చిప్ప కూడు తినిపిస్తా అని కేసీఆర్ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. ప్రాణహిత - చేవేళ్ల జాతీయ ప్రాజెక్టు కోసం కేసీఆర్ కేంద్రానికి లేఖ రాసిన విషయం మరిచిపోయారా అని ప్రశ్నించారు. జైలుకు పోవటం కాంగ్రెస్ కార్యకర్తలకు కొత్తకాదు అన్నారు. మహారాష్ట్రతో జరిగిన ఒప్పందంతో ఆ రాష్ట్రానికి లాభం చేకూర్చి ఇక్కడ సంబరాలు చేసుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలపై ఒక్క కేసు పెట్టినా.. అది టీఆర్ఎస్ పతనానికి నాంది అవుతుందని హెచ్చరించారు.
Advertisement
Advertisement