awareness meeting
-
దళితబంధు కార్యక్రమం కాదు.. ఉద్యమం: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సోమవారం ‘దళిత బంధు’ పథకంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హుజురాబాద్ నియోజకవర్గ దళితులతో పాటు మంత్రి కొప్పుల ఈశ్వర్, హరీష్‌రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘‘దళితబంధు కేవలం కార్యక్రమం కాదు.. ఉద్యమం. మంచి కార్యక్రమానికి ప్రతికూల శక్తులు ఉంటాయి. మనలో పరస్పర సహకారం పెరగాలి.. ద్వేషాలు పోవాలి’’ అని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘దళిత బంధు’ పథకానికి సంబంధించి ఈ నెల 26న ప్రగతిభవన్‌లో అవగాహన సదస్సు నిర్వహించాలని సీఎం కేసీఆర్ రెండు రోజుల క్రితం నిర్ణయించిన సంగతి తెలిసిందే. దానికి హుజూరాబాద్ నియోజకవర్గం నుంచి 400 మందికిపైగా మంది దళిత ప్రతినిధులు హాజరయినట్లు తెలిసింది. -
పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోంది: మేకపాటి
సాక్షి, విశాఖపట్నం: పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించే వాతావరణం విశాఖలో ఉందని, ఇక్కడ చక్కటి వనరులు ఉన్నాయని పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ పేర్కొన్నారు. విశాఖలోని నోవాటెల్ హోటల్లో యునైటేడ్ నేషన్స్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్(యుఎన్‌ఐడీఓ), డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంటర్నల్ ట్రేడ్(డీపీఐఐటీ)తో మంగళవారం జరిగిన అవగాహన సదస్సులో మంత్రితో పాటు పరిశ్రమల, ఐటీ, వాణిజ్య శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి అవంతి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 13 జిల్లాల అభివృద్ధిని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోరుకుంటున్నారని, అందుకే అభివృద్ధిని మాటల్లో కాకుండా చేతల్లో చూపిస్తున్నారన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించేవారికి కేవలం 48 గంటల్లో అన్ని అనుమతులు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. పారిశ్రామికాభివృద్ధి ప్రణాళిక, ప్రచార ఆవశ్యకత, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల నవీకరణ, పర్యావరణ వ్యవస్థ, వాణిజ్య తదితర అంశాలపై నేడు ఈ సదస్సులో చర్చించనున్నట్లు మంత్రి తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ ఇక రేపు(బుధవారం) విశాఖలో మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి పర్యటించనున్న సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంటు నియోజకవర్గాల వారిగా నైపుణ్య శిక్షణ సంస్థలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. విద్యాలయాలు, విశ్వవిద్యాలయాల్లో పరిశ్రమల అభివృద్ధికి దోహదం చేసే విద్యా విధానంతో ముందుకు వెళ్తున్నామన్నారు. పారదర్శకత పాలన రాష్ట్రంలో ఉందని, వైఎస్సార్ నవోదయ పథకంతో వందలాది సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని తెలిపారు. 2024నాటికి పారిశ్రామిక అభివృద్ధి సూచిలో రాష్ట్రం ముందుంటుందన్నారు. ఆహార ఉత్పత్తులు వాణిజ్యం పెంచడంతో పాటు వ్యవసాయ రంగ అభివృద్ధికి బాటలు వేస్తున్నామని పేర్కొన్నారు. త్వరలోనే విశాఖ ప్రపంచ స్థాయి మహానగరంగా అవతరిస్తుందని తాను నమ్ముతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. -
వేధిస్తే వేటాడుతారు..!
కరీంనగర్‌క్రైం: మహిళలు, యువతులు, విద్యార్థినులను వేధించే పోకిరీలను షీటీమ్స్ కట్టడి చేస్తున్నాయి. సమాచారం అందిన వెంటనే రంగంలోకి దిగి పక్కా ఆధారాలు సేకరించి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటున్నాయి. కరీంనగర్ కమిషనరేట్‌గా మారిన తర్వాత మహిళలపై వేధింపులకు చెక్ పెట్టేందుకు 2016 నవంబర్ 3న పోలీసు కమిషనర్ కమలాసన్‌రెడ్డి షీటీమ్స్ ఏర్పాటు చేశారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లోని షీటీంలు ఈవ్‌టీజింగ్‌లను వీడియో రికార్డ్ చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ పద్ధతిని కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోనూ అమలు చేస్తున్నారు. ఈవ్‌టీజింగ్‌ను అడ్డుకుని వారిని పట్టుకునేందుకు షీటీం సభ్యులకు ప్రత్యేక శిక్షణనిచ్చారు. మొదట ఈవ్‌టీజింగ్ జరుగుతున్న ప్రాంతాలను గుర్తిస్తారు. అనంతరం షీటీం సభ్యులను రంగంలోకి దింపుతారు. ఈవ్‌టీజింగ్‌లకు పాల్పడుతున్న వారిని వీడియో కెమెరాలో రికార్డ్ చేసిన తర్వాత రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకుంటారు. పోలీస్స్టేషన్లకు తరలించి వారి కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. వెంటపడి వేధిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్న వారిపై మహిళల ఫిర్యాదుల ద్వారా వలపన్ని పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. ప్రతీ కేసును కూడా ఒక కేసు స్టడీగా ఎక్కడా ఆరోపణలకు తావులేకుండా ఆకతాయిలను అగడాలకు అడ్డుకట్ట వేస్తున్నారు. ప్రస్తుతం నగరంలో దాదాపు ప్రతీ కాలేజీ, బస్టాప్, ఆర్టీసీ బస్టాండ్ల వద్ద షీ బృందాలు పని చేస్తున్నాయి. వీటికి కరీంనగర్ కమిషనరేట్ అడిషనల్ డీసీపీ పర్యవేక్షణలో మహిళా పోలీస్‌స్టేషన్ ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. ప్రతీ వారం కేసులపై సమీక్ష నిర్వహిస్తున్నారు. వాట్సాప్‌కు పోలీస్ స్పందన.. కరీంనగర్ ఆర్టీసీ బస్టాండ్‌లో వేములవాడకు వెళ్తున్న మహిళల పట్ల ముగ్గురు ఆటో డ్రైవర్లు వెంటపడి వేధింపులకు పాల్పడడమే కాకుండా అసభ్యకరంగా మాట్లాడుతూ వేధించారు. దీంతో సదరు మహిళ వెంటనే ఆటోను ఫొటో తీసి సీపీ కమలాసన్‌రెడ్డి, షీటీం ఇన్చార్జి సంతోష్‌కుమార్‌లకు పంపించింది. రంగంలోకి దిగిన షీటీం ఇన్చార్జి బృందం ఆటోడ్రైవర్లను పట్టుకుని కటకటాల్లోకి పంపారు. వేధింపులు, ఈవ్‌టీజింగ్‌లపై మహిళలు నేరుగా ఫిర్యాదు చేయడానికి ఇబ్బందులు పడుతుంటే వాట్సాప్, హక్‌ఐ, ఫేస్బుక్ ద్వారా ఫిర్యాదు చేసినా షీటీంలు స్పందిస్తున్నాయి. షీటీం వాట్సప్ నంబర్ 9440795182. అందుబాటులో ఉన్నాయి. కాలేజీల్లో విద్యార్థినులు, ఉద్యోగినులు, మహిళలు వేధింపులకు గురైతే ఆయా నంబర్లకు కాల్ చేసి చేప్పడం లేదా మెయిల్ చేసినా షీటీం స్పందించి చర్యలు తీసుకుంటుంది. ఫిర్యాదుదారుల వివరాలు బయటకు తెలియకుండా జాగ్రత్తలు తీసకుంటున్నారు. అమాయకులు బలి కాకుండా పగడ్బందీగా వీడియో రికార్డ్ చేసి పక్కాగా ఈవ్టీజర్లనే పట్టుకుంటున్నారు. మొదటిసారి పట్టుబడితే కౌన్సెలింగ్, రెండోసారి పట్టుబడితే బైండోవర్, మూడో సారి పట్టుబడితే జైలుకు పంపిస్తున్నారు. అవగాహన సదస్సులు.. షీటీంలు ఏర్పాటు చేయడమే కాకుండా వాటి పనితీరుపై షీటీం ఇన్చార్జి ఇన్స్పెక్టర్ సంతోష్‌కుమార్ ఆధ్వర్యంలో కాలేజీల్లో, యువతులు, ఉద్యోగుల్లో అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటి వరకు వివిధ కాలేజీల్లో 89 అవగాహన సదస్సులు నిర్వహించారు. ప్రతీ వారం ఏదో కాలేజీ, కార్యాలయాల్లో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. షీటీంలు ఎలా పని చేస్తాయి, వేధింపుల సమయంలో ఎలా స్పందించాలో వివరిస్తున్నారు. పోకిరీల ఆగడాలకు అడ్డుకట్టవేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై కాలేజీ యాజమాన్యాలకు అవగాహన కల్పిస్తున్నారు. పట్టుబడిన వారిలో.. షీటీంలు ఏర్పాటు చేసిన తర్వాత పట్టుబడిన వారిలో మైనర్లు, 50 ఏళ్ల దాటిన వారు, ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఉంటున్నారు. మైనర్లకు కొందరు తల్లిదండ్రులు వేగవంతమైన బైకులు కొనివ్వడంతో వారు చదువులు మాని విద్యార్థినుల వెంటపడి వేధింపులకు దిగుతున్నారు. ఇంట్లో మృధుస్వభావిగా ఉంటూ బయటకు రాగానే విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. దీంతో షీటీం బృందాలు వారి ఆగడాలను వీడియో రికార్డ్ చేసి మరీ పట్టుకుంటున్నారు. – 2016 నవంబర్ 3న ప్రారంభించిన షీటీంలు ఇప్పటి వరకు 1,607 మందిని పట్టుకున్నాయి. వారిలో మైనర్లు 139 మంది, 19 నుంచి 24 ఏళ్లలోపు వారు 530 మంది, 25 నుంచి 35 ఏళ్ల లోపు వారు 377 మంది, 36 నుంచి 50 ఏళ్లలోపు వారు 470 మంది, 50 ఏళ్లు అపైన 91 మందిని పట్టుకున్నారు. బాధిత మహిళల ఫిర్యాదు మేరకు పోకిరీలపై 18 కేసులు నమోదు చేశారు. వీరిలో మొదటి తప్పుగా బావించి 1469 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. 120 మందిపై పెట్టీ కేసులు నమోదు చేశారు. సుమారు 50 వేల పైగా విద్యార్థినులు, మహిళలకు హక్‌ఐ ఆప్లికేషన్ డౌన్లోడు చేయించారు. విద్యార్థినులకు ఎంతో భరోసా షీటీం ఏర్పాటు చేయడమనేది విద్యార్థినులకు ఎంతో భద్రత కలిగిస్తోంది. పోకిరీల వేధింపుల నుంచి రక్షణ పొందవచ్చు. విద్యార్థినులు వీటిపై మరింత అవగాహన పెంచుకోవాలి. వేధింపుల వల్ల నష్టపొతున్న విషయం కూడా ఈవ్‌టీజర్లకు తెలియాలి. స్వీయరక్షణ పద్ధతుల్లో కూడా విద్యార్థినులు, యువతులు శిక్షణ పొందాలి.– గాజుల దీప్తి, విద్యార్థిని అవగాహన కలిగి ఉండాలి.. షీటీం పని విధానంపై అవగాహన కలిగి ఉండాలి. మహిళలకు ముఖ్యంగా విద్యార్థినుల భద్రత కోసం షీటీంలను ఏర్పాటు చేశారు. ఫిర్యాదుల వివరాలు బయటకు చెప్పకుండా ఈవ్‌టీజర్లపై చర్య తీసుకోవడం మంచి పరిణామం. గ్రామీణ ప్రాంతాల విద్యార్థినులకు నిత్యం వేధింపులు తప్పడం లేదు. ఈవ్‌టీజింగ్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి.– డి మాలతి, బీటెక్ విద్యార్థిని మరింత బలోపేతం చేస్తాం.. సీపీ ఆదేశాల మేరకు షీటీంలను మరింత బలోపేతం చేస్తాం. ప్రస్తుతం 20 టీంలు పని చేస్తున్నాయి. త్వరలో మరిన్ని పెంచడంతోపాటు ఆధునిక గాడ్జెట్ అందిస్తాం. ఈవ్‌టీజర్లపై షీటీం సభ్యులకు ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నాం. ఎలాంటి అనుమానాలు, అపోహాలకు తావులేకుండా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఈవ్‌టీజర్లను పట్టుకుంటున్నారు. విద్యార్థినులు, మహిళలు అవగాహన కలిగి ఉండాలి. ఈవ్‌టీజింగ్ చేసినా, వేధించినా వెంటనే 9440795182కు సమాచారం అందించండి.– సంతోష్‌కుమార్, ఇన్స్పెక్టర్, మహిళా పోలీస్‌స్టేషన్, షీటీం ఇన్చార్జి -
హిప్ ప్రజర్వేషన్పై సర్జన్లకు అవగాహన సదస్సు
-
బాల్యవివాహాలను ఆపేదెవరు?
మంచిర్యాల క్రైం: ఆర్థిక అసమానతలు... నిరక్షరాస్యత... బాలికలను జాగ్రత్తగా పెంచలేమన్న అభద్రతా భావం... ¿¶భవిష్యత్‌లో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందోనన్న బెంగ.. జిల్లాలో బాల్య వివాçహాలు పెరిగేందుకు దోహదపడుతున్నాయి. చట్టాలు ఎన్ని చేసినా ఆ వివాహాలు ఆగడంలేదు. అధికారుల దృష్టికి 10 శాతం మాత్రమే వస్తుండగా.. 90శాతం వివాహాలు గుట్టుచప్పుడు కాకుండా జరిగి పోతున్నాయి. జిల్లా శిశు సంక్షేమశాఖ పరిధిలోని ఇంటిగ్రేటెడ్ చైల్డ్ ప్రొటెక్షన్ స్కీమ్(ఐసీపీఎస్) అధికారులు ఆపిన వివాహాలు అతి తక్కువగానే ఉన్నాయి. 2014 నుంచి 2018 డిసెంబర్ 15వరకు జిల్లాలో 48 బాల్యవివాహాలను నిలిపి వేసినట్లు అధికారులు చెబుతున్నారు. మరి లెక్కలోకి రాని వివాహాలు అనేకం ఉంటున్నాయి. బాల్యవివాహాలు నిరోధించే చట్టం బ్రిటిష్ కాలంలో 1929 నుంచి అమలులో ఉంది. ఈ చట్టంలో అనేక మార్పులు చేసిన కేంద్రం బాల్య వివాహాల నిరోధక చట్టం 2006ను రూపొందించింది. ఈచట్టంపై ప్రజలకు అవగాహన లేకపోవడంతోనే బాల్యవివాహాలు యథేచ్ఛగా జరుగుతూనే ఉన్నాయి. వివాహానికి బాలికలకు 18 ఏళ్లు, బాలురకు 21ఏళ్లుగా ఈ చట్టంలో నిర్ధారించారు. మరి ఈ చట్టం ఏంచెబుతుంతో తెలుసుకుందాం.. నేరస్తుల విచారణలో ... 21 సంవత్సరాల వయస్సు కన్నా తక్కువ ఉన్న వ్యక్తి, 18 సంవత్సరాల కన్నా తక్కువ కలిగిన బాలికను వివాహం చేసుకుంటే ఆవ్యక్తి శిక్షార్హుడని చట్టం పేర్కొంటుంది. బాల్యవివాహాలు నిర్వహించడం, ప్రోత్సహించడం వంటి పనులు చేస్తున్న వారిలో తల్లిదండ్రులు, సంరక్షకులు, ఇతర వ్యక్తులు, సంస్థలు ఎవరైనా సరే ఈ చట్టంలో శిక్షార్హులుగా నిర్ధేశించారు. ఈ తరహా నేరాలకు పాల్పడిన వారిలో మహిళలుంటే మాత్రం వారికి జైలుశిక్ష విధించాలని ఈ చట్టంలో స్పష్టంగా పేర్కొన్నారు. బాల్య వివాహం నేరం – శిక్ష - బాల్య వివాహాలను ప్రోత్సహించేవారు కఠిన కారాగార శిక్షకు అర్హులు. ఈ నేరానికి రెండేళ్ల జైలుశిక్ష లేదా రూ.లక్ష వరకు జరిమానా లేదా రెండూ వి«ధించవచ్చు. - బాల్య వివాహం తర్వాత ఆ మైనరు అక్రమ రవాణా చేయడానికి, ఆమెను దాచేందుకు ప్రయత్నించడం చట్టరీత్యా నేరం. - బాల్య వివాహాలను నిషేధిస్తూ న్యాయస్థానాలు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. - చట్టాన్ని, మేజిస్ట్రేట్ ఉత్తర్వులను ఉల్లంఘించి బాల్యవివాహాన్ని ఏ మత సాంప్రదాయాలతో జరిపినా ఆ వివాహం చెల్లదు. - ఈ చట్టం కింద నమోదయ్యే కేసులో వారెంట్ లేదా మేజిస్ట్రేట్ అనుమతి లేకుండానే పోలీసులు బాల్య వివాహాన్ని ఆపవచ్చు. - ఈ చట్టం కింద నేరస్తులకు శిక్షతో కూడిన లేదా బెయిలుకు వీలులేని శిక్ష విధిస్తారు. ఈ చట్టం కింద శిక్షార్హులయ్యే వ్యక్తులు - ఇరుపక్షాల తల్లిదండ్రులు, సంరక్షకులు, పురోహితులు - ఇరుపక్షాల ఇరుగు పొరుగు వారు - ఈ వివాహానికి హాజరైన ప్రభుత్వ ఉద్యోగులు సమాచారం అందించే వారి వివరాలు గోప్యంగా.... జిల్లాలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరుగుతున్నట్టు తెలిస్తే జిల్లా కలెక్టర్, పోలీస్, ఉన్నాతాధికారులు (ఫోన్ నంబర్100)మహిళా శిశు సంక్షేమ శాఖ పథకం సంచాలకులు, ఐసీపీఎస్, చైల్డ్ లైన్ (ఫోన్ నంబర్1098) తహసీల్దార్, సీడీపీవో, గ్రామస్థాయిలో అయితే వీఆర్వో, పంచాయతీ కార్యదర్శులకు వెంటనే తెలియజేయవచ్చు. అవసరమైతే సామాజిక సేవ కార్యకర్తలకు కూడా సమాచారం అందించవచ్చు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడుతాయి. బాల్య వివాహంతో వచ్చే సమస్యలు.... - అమ్మాయిలకు 18 ఏళ్లు, అబ్బాయిలకు 21ఏళ్లు నిండకముందే వివాహం చేయడం వారి ఆరోగ్యానికి అంత క్షేమకరం కాదని వైద్యనిపుణులు చెబుతున్నారు. - ప్రధానంగా స్త్రీలు త్వరగా రక్తహీనతకు గురికావడం, అనారోగ్య శిశువులు జన్మించడం, అవయవ ఎదుగుదల లేకపోవడం, శిశు మరణాలు ఎక్కువగా జరగడం. - త్వరగా గర్భం దాల్చడంవల్ల వారు త్వరగా బలహీనంగా మారుతారు. పుట్టేబిడ్డ జన్యుపరమైన సమస్యలతో పాటు, పోషకలోపాలతో జన్మించడం. - అధిక సంఖ్యలో గర్భస్రావాలు, మాతాశిశుమరణాలు జరుగుతున్నట్టు వివిధ సర్వేలు చెపుతున్నాయి. - దంపతుల మధ్య అవగాహనలోపంతో కుటుంబంలో కలహాలు వచ్చి త్వరగా విడిపోయే అవకాశం ఉంది. - మానసిక పరిపక్వత లేక చిన్న సమస్య తలెత్తినా ఆత్మహత్యలకు ప్రయత్నించడం. - కుటుంబహింసకు, లైంగిక హింసకు, ఇంకా పలు సమస్యల బారినపడే అవకాశం. అవగాహన కల్పిస్తున్నాం బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రతీఒక్కరు సహకారించాలి. బాల్య విహాలు చేసుకోవడం నేరం. వివాహాలు చేసిన, చేసేందుకు సహకరించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవు. మంచిర్యాల జిల్లాలో 2014 నుంచి 2018 డిసెంబర్ 15 వరకు 48బాల్య వివాహాలను అడ్డుకున్నాం. బాల్యవివాహాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాÆం. – రాహూఫ్ఖాన్, శిశు సంక్షేమశాఖ అధికారి, మంచిర్యాల -
ఒక్కో మహిళ.. ఆరు మొక్కలు
భీంపూర్(బోథ్): ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై ప్రత్యేక దృష్టి సారించింది. నాలుగో విడతలో మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించే బాధ్యతను మహిళా సంఘాలకు అప్పగిస్తోంది. ఇందిరా క్రాంతి పథం ద్వారా గ్రామాల్లోని మహిళా సంఘాల సభ్యులకు సంరక్షణ బాధ్యతలు అప్పగిస్తున్నారు. హరితహారం విజయవంతం కావాలనే సదుద్దేశంతో ప్రతీ మహిళా సభ్యురాలు ఆరు మొక్కలు నాటించాలని సంబంధిత మండల సీసీలు, ఏపీఎంలు సూచిస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని ప్రతీ మండలంలో సంబంధిత అధికారులు మండల సమాఖ్య మహిళలకు ఇప్పటికే అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామస్థాయితోపాటు మండలాల్లో అవగాహన కల్పించగా.. గ్రామాల్లోని ఎస్‌హెచ్‌జీ(స్వయం సహాయక సంఘాలు) మహిళలకు అందిస్తున్న మొక్కల వివరాలపై ప్రతీరోజు ఉన్నతాధికారులకు రోజువారీగా నివేదికలను కూడా పంపిస్తున్నారు. 96,244 మంది.. జిల్లాలోని 18 మండలాల్లో మొత్తం 532 వీఓల పరిధిలో 9,348 మహిళా సంఘాలుండగా.. అందులో 96,244 మంది సభ్యులు ఉన్నారు. వీరు ఆరు మొక్కల చొప్పున నాటేందుకు ఇప్పటికే ఆదేశాలు జారీ అయ్యాయి. వీరందరూ హరితహారంలో భాగస్వాములు కానున్నారు. ఇందులో తాంసి మండలంలో అతి తక్కువగా 3,447మంది సభ్యులుండగా.. అత్యధికంగా జైనథ్ మండలంలో 8,792మంది ఉన్నారు. జిల్లా మొత్తంగా 96,244 మంది సభ్యులు ఒక్కొక్కరూ ఆరు మొక్కలు నాటేందుకు అన్ని రకాల సరంజామాను ఏర్పాటు చేస్తున్నారు. అవగాహన.. కొనసాగుతున్న సర్వే.. మొక్కలు నాటడంతోపాటు వాటి సంరక్షణ ఎలా చేపట్టాలనే విషయమై మండల స్థాయి సమావేశాల్లో ఏసీలు, ఏపీయంలు, సీసీలు వివరించారు. అన్ని మండలాల్లో హరితహారంపై సంఘాల మహిళలకు ఇప్పటికే అవగాహన కల్పించారు. కొన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పథకం ద్వారా గుంతలు తవ్వించి సంఘాల సభ్యులకు మొక్కలు అందించాలని సూచనలు ఉన్నట్లు ఆయా మండలాల ఏపీఎంలు తెలిపారు. ఇంటి పెరట్లో, పాఠశాలలు, కార్యాలయాలు, గ్రామపంచాయతీ పరిసరాలు, మొక్కలకు సంరక్షణ ఉన్న చోట్ల మొక్కలు నాటాలని ఈ అవగాహన కార్యక్రమాల్లో చెప్పారు. ఇప్పటికే ఆయా స్థలాల్లో మొక్కలు నాటి ఉంటే పెరట్లలో, గట్లపై నాటాల్సి ఉంది. వారం రోజులుగా గ్రామాల్లో ఇంటింటి సర్వే కొనసాగుతోంది. ఏ సంఘం సభ్యులు ఏ మొక్క నాటుతారో ముందుగానే సర్వే ద్వారా తెలియజేస్తున్నారు. ఆ సర్వే వివరాలను ప్రతీరోజు సంబంధిత డీఆర్డీఓ కార్యాలయానికి చేరవేస్తున్నట్లు ఆయా మండలాల సీసీలు చెబుతున్నారు. ఉండమ్మా బొట్టు పెడతా.. గ్రామాల్లో ఇప్పటికే మహిళా సంఘాల సభ్యులకు ఐకేపీ అధికారులు అవగాహన కల్పించగా.. ఆయా మండలాల్లో మండలాల్లో ఉన్న సంప్రదాయ పద్ధతులను అనుసరించి మహిళలకు తెలియజేస్తున్నారు. గ్రామాల్లో తమ పెరట్లలో, గట్లపై ప్రతీ ఒక్క మహిళా సభ్యురాలు విధిగా ఆరు మొక్కలు నాటాలని చెబుతూ బొట్టుపెట్టే కార్యక్రమం కొనసాగుతోంది. అందరికీ అవగాహన కల్పించాం.. మండల స్థాయి సమావేశంతోపాటు ఇప్పటికే అన్ని గ్రామాల్లో సభ్యురాలికి బొట్టుపెట్టి మొక్కలు నాటే పద్ధతులు వివరించాం. తదనుగుణంగా గ్రామాల్లో నాటే ఆరు మొక్కల వివరాల సేకరణపై సర్వే కూడా పూర్తవుతోంది. మొక్కలు నాటడంతోపాటు వాటిని సంరక్షించాలని అందరికీ తెలియజేస్తున్నాం. కే.ప్రసాద్‌రాజ్, ఏపీఎం, భీంపూర్ -
ఆఖరి మజిలీలోనూ ‘ఆకలి బాధలు’
గుంటూరు, ప్రత్తిపాడు: ‘వయస్సు మీద పడింది. ఆకలి కష్టాలు తప్పడం లేదు. కడుపు నింపలేని ప్రకటనలు, ఆకలి తీర్చలేని నిబంధనలు మాకేందుకు. ప్రభుత్వం అందించే పథకాల కోసం ప్రాణం పోయేలా తిరుగుతున్నాం. వేలిముద్రలంటూ సర్కారు తెచ్చిన రూలు కడుపునకు నాలుగు రూకలు పెట్టలేకపోతుంది. మలి వయస్సులో అరిగిన చేతి వేళ్లే ముద్ద నోటిలోనికి పోనివ్వకుండా అడ్డుకుంటున్నాయి’ అంటూ వృద్ధులు ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం స్థానిక పోలిస్ స్టేషన్లో నిర్వహించిన సీనియర్ సిటిజన్స్ అవగాహన సదస్సులో వృద్ధులు ఏళ్ల తరబడి తాము పడుతున్న బాధలను డిప్యూటీ తహసీల్దార్ రాఘవయ్య ఎదుట ఏకరువు పెట్టారు. రెండేళ్లుగా బియ్యం రావడం లేదు.. రెండేళ్లుగా రేషన్ బియ్యం ఇవ్వడం లేదు. వెళ్లినప్పుడల్లా వేలిముద్రలు పడటం లేదని చెబుతున్నారు. తిరిగి తిరిగి విసుగొస్తోంది. కనీసం బియ్యం కూడా ఇవ్వకపోతే ఎలాగయ్యా.. కొంచెమైనా కనికరం చూపించండి సారూ.– షేక్ చాంద్‌బి,ప్రత్తిపాడు మిషన్లు పెట్టిన దగ్గర్నుంచి.. వేలిముద్రల మిషన్లు పెట్టిన దగ్గర నుంచి బియ్యం కోసం కోటాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రల పడటం లేదంటారు. ఇవ్వరు. ఎన్ని సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగానో. పట్టించుకున్నోళ్లు లేరు. వీఆర్వో వత్తారు. బియ్యం ఇత్తారు అంటారు. కానీ ఎప్పుడిచ్చిన పాపాన పోలేదు.–దూపాటి సుందరరావు, తూర్పుపాలెం దుకాణాల చుట్టూ తిరుగుతున్నాం.. రేషన్ బియ్యం కోసం చౌకధరల దుకాణాల చుట్టూ తిరుగుతున్నా. వేలిముద్రలు పడటం లేదంటారు. మళ్లీ రమ్మంటారు. బియ్యం మాత్రం ఇవ్వరు. ఒకసారి ఆధార్‌లో మార్చుకోమంటారు. –గింజుపల్లి బాలాత్రిపురసుందరి,ప్రత్తిపాడు -
ఐఏఎస్ పరీక్షపై అవగాహన సదస్సు నేడు
విజయవాడ (సత్యానారాయణపురం) : ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు చిత్తరంజన్ శాఖా గ్రంథాలయం అధికారిణి కోగంటి పద్మావతి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. స్థానిక గ్రంథాలయంలో నిర్వహించే కార్యక్రమానికి ఢిల్లీలోని ఐఏఎస్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ రామకృష్ణ, అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసరావు, అంబేడ్కర్ స్టడీ సర్కిల్ ప్రొఫెసర్ ఎం.శ్రీనివాసరావు పాల్గొంటారని చెప్పారు. -
ఇంట్లో ఉంటేనే పేరు నమోదు
- సమగ్ర సర్వేతో అభివృద్ధి కలెక్టర్ ప్రియదర్శిని - జెడ్పీలో ప్రజాప్రతినిధులకు అవగాహన సమావేశం - అపోహలు తొలగించాలి : కాంగ్రెస్ పునర్నిర్మాణం కోసమే : టీఆర్ఎస్ సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 19న నిర్వహించే సమగ్ర కుటుంబ ఆర్థిక, సామాజిక సర్వే-2014పై జిల్లాకు చెందిన శాసనసభ్యులు భిన్నాభిప్రాయం వ్యక్తం చేశారు. సమగ్ర కుటుంబ సర్వేపై సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో కలెక్టర్ జీడీ ప్రియదర్శిని అవగాహన సమావేశం నిర్వహించారు. ఒకే వ్యక్తి అనేక చోట్ల వివరాలు నమోదు చేసుకోకుండా ఉండేందుకే ఒకే రోజులో సమగ్ర సర్వే పూర్తి చేసేలా ప్రణాళిక సిద్ధం చేసినట్లు కలెక్టర్ ప్రకటించారు. సర్వే సమయంలో అందుబాటులో ఉండే వారి వివరాలు మాత్రమే నమోదు చేస్తామని స్పష్టం చేశారు. ఇతర ప్రాంతాల్లో చదువుతున్న వారు. అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారు తగిన ఆధారాలు చూపాల్సి ఉంటుందన్నారు. జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి వివరాల నమోదుకు తీసుకుంటున్న చర్యలను కలెక్టర్ ప్రియదర్శిని వివరించారు. గుంపు మేస్త్రీల ద్వారా వలస కూలీల వివరాలు సేకరిస్తున్నట్లు వెల్లడించారు. జిల్లాలో తొమ్మిదిన్నర లక్షల కుటుంబాల వివరాల సేకరణకు 40వేలకు పైగా సిబ్బందిని వినియోగిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఎమ్మెల్యేలు, జెడ్పీ చైర్మన్, జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు సమావేశంలో పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు. కేవలం ఒక్క రోజు వ్యవధిలోనే సర్వే నిర్వహించడం సరికాదని, వలస వెళ్లిన వివరాల నమోదుకు మరో అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్ శాసన సభ్యులు డీకే అరుణ, చిన్నారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి సూచించారు. సర్వేపై అపోహలు పెట్టుకోవాల్సిన అవసరం లేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, అంజయ్యయాదవ్, గువ్వల బాలరాజు, మర్రి జనార్దన్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు. సమగ్ర వివరాలు సేకరించేందుకు ప్రభుత్వం సర్వే చేపట్టిందని జిల్లా పరిషత్ చైర్మన్ బండారి భాస్కర్ స్పష్టం చేశారు. సర్వే నిర్వహణపై నెలకొన్న అనుమానాలు నివృత్తి చేయాలని జెడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు విజ్ఞప్తి చేశారు. జాయింట్ కలెక్టర్ శర్మన్, జెడ్పీ సీఈఓ రవీందర్, డీఆర్డీఏ పీడీ చంద్రశేఖర్‌రెడ్డి సమావేశంలో పాల్గొన్నారు.