
జగిత్యాలటౌన్: టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మధ్య ఏం జరుగు తోందో తనకు తెలియదని.. మునుగోడు సభ విషయంలో వెంకట్‌రెడ్డికి ముందస్తు సమాచారం ఇచ్చి ఉండాల్సిందని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. శనివారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రజాస్వామిక పార్టీ అని, కొత్త చేరికల సందర్భంగా అసంతృప్తి చోటుచేసుకోవడం సహజమన్నారు.
ఇంతకాలం పార్టీ బలోపేతానికి పనిచేసిన నాయకుల్లో ఇది మరింత ఎక్కువగా ఉంటుందని తెలిపారు. దాసోజు శ్రవణ్ కాంగ్రెస్‌ను వీడటం బాధాకరమేనని అన్నారు. హుజూరాబాద్‌లో ఈటల రాజేందర్‌కు, టీఆర్‌ఎస్‌కు మధ్య పోటీ జరిందని.. మునుగోడులో బీజేపీ, టీఆర్‌ఎస్ మధ్య పోటీ ఉంటుందని అభిప్రాయపడ్డారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకల్లో జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, కాళేశ్వరం ప్రాజెక్టు కమీషన్‌తో అవినీతియమైన టీఆర్‌ఎస్ పాలన చూసి జయశంకర్ ఆత్మక్షోభిస్తుందన్నారు.
చదవండి: 34 ఏళ్లు పనిచేసినా హోంగార్డు.. ఎస్పీ అవుతాడా?
Comments
Please login to add a commentAdd a comment