సాక్షి, యాదాద్రి: ‘ప్రభుత్వం ఆరు నెలల్లో పడిపోతుందని కేటీఆర్ కలలు కంటున్నాడు. కానీ బీఆర్‌ఎస్‌కు చెందిన 39 మంది ఎమ్మెల్యేలను 39 ముక్కలుగా విభజిస్తాం.. మీ పార్టీని 14 ముక్కలు చేస్తాం.. మా ముఖ్యమంత్రి చెప్పినట్టుగా బీఆర్‌ఎస్ పార్టీని మేము బరాబర్ బొంద పెడతాం’ అని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. తొలిసారి యాదాద్రి జిల్లా భువనగిరికి వచ్చిన కోమటిరెడ్డి, ఆదివారం జిల్లా కలెక్టరేట్‌లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం విలేకరులతో మాట్లాడారు.
కేటీఆర్ అధికారం పోయిన షాక్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నారని విమర్శించారు. 100 రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం దోచుకున్న అవినీతి సొమ్ముతో 20 సంవత్సరాలు సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చని అన్నారు. కేసీఆర్ ప్రభుత్వం ఆరు లక్షల కోట్లు అప్పులు చేసిందని, పేదల భూములు లాక్కుందని ధ్వజమెత్తారు. ప్రస్తుతం తమ ప్రభుత్వం తెలంగాణను గాడిలో పెడుతోందన్నారు.
త్రిపుల్‌ఆర్ తెలంగాణకు మణిహారమని, రైతులు కోరుతున్నట్లు దీని అలైన్‌మెంట్ మార్చడానికి ప్రయత్నం చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు. యాదాద్రి థర్మల్ ప్లాంట్‌లో 10 వేల కోట్ల అక్రమాలు జరిగాయని ఆరోపించారు. మంత్రి వెంట ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment