సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ లేఖ
దయతో తెలంగాణ ఇచ్చామనే అహంభావ ధోరణి చూపుతున్నారు
ఉద్యమాన్ని, అమరుల త్యాగాలను అవమానిస్తున్నారు
అలాంటి మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది?
నాటి కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరుల స్తూపం
తెలంగాణ సీఎం అయి ఉండీ ‘జై తెలంగాణ’ అనలేదెందుకు?
ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు నన్ను అవమానించేలా ఉంది
మీ వికృత పోకడలకు నిరసనగా ఉత్సవాలకు బీఆర్‌ఎస్ దూరం
చేసిన తప్పులకు కాంగ్రెస్ ఇప్పటికైనా క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: ‘‘తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవం ఒక ఉద్విగ్న, ఉత్తేజకరమైన సందర్భమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమన దిశగా తీసుకువెళ్తోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉత్సవాల్లో కేసీఆర్ పాల్గొనడం సమంజసం కాదని బీఆర్‌ఎస్ సహా ఉద్యమకారులు, తెలంగాణవాదులు అభిప్రా యం వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణ అస్తిత్వా న్ని అవమానిస్తున్న మీ వికృత పోకడలను నిర సిస్తూ ప్రభుత్వం నిర్వహించే దశాబ్ది ఉత్సవా ల్లో బీఆర్‌ఎస్ పార్టీ పాల్గొనడం లేదు..’’ అని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ దశా బ్ది ఉత్సవాల్లో పాల్గొనాలని ఆహ్వానిస్తూ రేవంత్‌రెడ్డి రాసిన లేఖకు ప్రతిగా కేసీఆర్ శని వారం సీఎం రేవంత్‌కు బహిరంగ లేఖ రాశారు. అందులో కేసీఆర్ పేర్కొన్న అంశాలివే..
‘‘రాష్ట్ర అవతరణ ఉత్సవాల నిర్వహణపై మీ (కాంగ్రెస్) ప్రభుత్వం ఇటీవల నిర్వహించి న అఖిలపక్ష సమావేశానికి ప్రధాన ప్రతిపక్షమై న బీఆర్‌ఎస్‌ను ఆహ్వానించక పోవడం అప్రజా స్వామిక వైఖరికి నిదర్శనం. బీఆర్‌ఎస్‌ను కావాలని విస్మరించి మీ సంకుచితత్వాన్ని మరోసారి నిరూపించుకున్నారు.
నన్ను దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానించిన తీరు.. నోటితో మాట్లాడుతూ నొసటితో వెక్కిరించినట్లుగా ఉంది. ప్రాణాన్ని పణంగా పెట్టి ఆమరణ నిరాహార దీక్షతో ఉద్యమాన్ని విజయతీరానికి చేర్చిన న న్ను ఆహ్వానించిన తీరు ఎంతో అవమానకరంగా ఉంది. తెలంగాణ ప్రజాపోరాటానికి నాయ కత్వ స్థానంలో నిలిచిన నాకు వేదికపై స్థానం కల్పించలేదు.
రాష్ట్ర సాధనలో నాకున్న అనుభ వాలు పంచుకునేలా ప్రసంగించే అవకాశం క ల్పించక పోవడం మీ అహంకార ఆధిపత్య ధో రణికి పరాకాష్ట. నన్ను ఆహ్వానించి అవమానించాలనే మీ దురుద్దేశాన్ని ప్రజలు గ్రహిస్తున్నా రు. పోరాట వారసత్వాన్ని దెబ్బతీయడానికి మీరు చేస్తున్న కుట్రలను తెలంగాణ సమాజం గమనిస్తున్నది. తెలంగాణ స్ఫూర్తిని దెబ్బతీసే లా ఉత్సవాలు జరుగుతున్న తీరును ఉద్యమ కారులు ఇప్పటికే నిరసిస్తున్నారు.
జై తెలంగాణ అని నినదించరెందుకు?
తెలంగాణ ముఖ్యమంత్రి అయినా ప్రజలకు ప్రాణప్రదమైన ‘జై తెలంగాణ’ నినాదాన్ని ఇప్పటివరకు నోటినిండా పలకలేని మీ మానసిక వైకల్యాన్ని ప్రజలు ఆక్షేపిస్తున్నారు. ఇక ముందైనా తెలంగాణ వ్యతిరేక మానసికత నుంచి బయటపడి జై తెలంగాణ అని నినదించే వివేకాన్ని తెలంగాణ సమాజం మీ నుంచి కోరుకుంటున్నది.
సీఎంగా బాధ్యతలు చేపట్టి ఆరు నెలలవుతున్నా.. ఇప్పటివరకూ తెలంగాణ అమరవీరుల స్తూపాన్ని సందర్శించక, శ్రద్ధాంజలి ఘటించక పోవడం ద్వారా ప్రజల మనోభావాలను గాయపరిచారు. అమరుల త్యాగాలతో అవతరించిన తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్ దయాభిక్షగా ప్రచారం చేస్తున్న మీ భావ దారిద్య్రాన్ని నేను నిరసిస్తున్నాను. 1969 నుంచి ఐదు దశాబ్దాల పాటు తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో చరిత్ర పొడుగునా కాంగ్రెస్ రక్తసిక్తం చేసిందనేది దాచేస్తే దాగని సత్యం.
1952 ముల్కీ ఉద్యమంలో సిటీ కాలేజీ విద్యార్థులపై కాల్పులు జరిపి నలుగురు విద్యార్థుల ప్రాణాలు పొట్టన పెట్టుకోవడం మొదలు కాంగ్రెస్ క్రూర చరిత్ర కొనసాగింది. తెలంగాణ ప్రజల అభీష్టానికి విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్‌ను ఏర్పాటు చేసి తెలంగాణలో ఐదారు తరాల ప్రజల జీవితాలను చిన్నాభిన్నం చేసిన దుర్మార్గ చరిత్ర కాంగ్రెస్ పార్టీది.
మీ దమన నీతికి సాక్ష్యం.. అమరుల స్తూపం
తెలంగాణ తొలిదశ ఉద్యమంలో 369 మంది యువకులను కాల్చి చంపిన కాంగ్రెస్ దమన నీతికి సాక్ష్యమే గన్‌పార్క్ అమరవీరుల స్తూపం. ఆ స్తూపాన్ని కూడా ఆవిష్కరించ నీయకుండా అడ్డుపడిన కాంగ్రెస్ కర్కశత్వం తెలంగాణ చరిత్ర పుటల్లో నిలిచింది. మలిదశ ఉద్యమంలోనూ వందలాది మంది యువకుల ప్రాణాలను బలిగొన్న పాపం కాంగ్రెస్ పార్టీదే.
తెలంగాణకు కాంగ్రెస్ చేసిన అన్యాయాన్ని సరిదిద్దడానికి జరిగిన చరిత్రాత్మక ప్రయత్నంలో భాగంగా ఆవిర్భవించిన టీఆర్‌ఎస్ ఉద్యమానికి రాజకీయ వ్యక్తీకరణను ఇచ్చింది. తెలంగాణ వాదాన్ని తిరుగులేని రాజకీయ శక్తిగా మలిచి ఎన్నికలు, సభలు, సమావేశాలతో రాజకీయ ఒత్తిడి పెంచింది. దేశంలో ఉన్న పార్టీల మద్దతును లిఖిత పూర్వకంగా సాధించింది. కానీ తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యపరిచే అనైతిక కుట్రలకు కాంగ్రెస్ పాల్పడింది.
తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పండి
నా ప్రాణాలను పణంగా పెట్టి ‘తెలంగాణ వ చ్చుడో, కేసీఆర్ సచ్చుడో’ అని ఆమరణ నిరా హార దీక్షకు దిగడంతో కాంగ్రెస్ ‘డిసెంబర్ 9’ ప్రకటన చేసింది. కానీ సమైక్య పాలకుల ఒత్తి డితో వెనక్కితగ్గి మోసం చేసింది. దాంతో వందలాది మంది యువకులు ప్రాణత్యాగాలు చే శారు. దీనిపై కాంగ్రెస్ ఎన్నడూ పశ్చాత్తాపాన్ని ప్రకటించలేదు, క్షమాపణ కోరలేదు.
పైగా ద యతో మేమే తెలంగాణ ఇచ్చామనే ఆధిపత్య, అహంభావ ధోరణి ప్రదర్శిస్తూ.. ఉద్యమాన్ని, అమరుల త్యాగాన్ని అవమానిస్తున్నారు. ఈ రకమైన వైఖరిని మార్చుకోనప్పుడు మీరు చేసే ఉత్సవాలకు సార్థకత ఏముంటుంది? ఇప్పటికైనా తెలగా>ణ సమాజానికి క్షమాపణ చెప్పండి. రాజకీయ అవసరాల కోసం కాకుండా మనస్ఫూర్తిగా తెలంగాణ సమాజానికి క్షమాపణలు కాంగ్రెస్ చెప్పినప్పుడే పాప పరిహారం చేసుకున్నట్టు అవుతుంది.
మీకు తెలంగాణ రాజకీయ అవకాశమే..
కాంగ్రెస్‌కు తెలంగాణ ఒక రాజకీయ అవకాశమే తప్ప మనఃపూర్వక ఆమోదం కాదు. కాంగ్రెస్ ఎన్నటికీ మారదని మీ ప్రవర్తన, మీ పార్టీ ప్రవర్తనతో స్పష్టమ వు తోంది. నాడు, నేడు ఎన్నడూ అంతే. తెలంగాణలో గత ఆరు నెలలుగా సాగుతున్న మీ పరిపాలనే ఇందుకు నిదర్శనం. ప్రజాపా లన పేరిట అధికారంలోకి వచ్చిన మిమ్మ ల్ని ప్రశ్నిస్తే భౌతిక దాడులు చేస్తున్నారు.
సోషల్ మీడియాలో ప్రశ్నిస్తూ పోస్టులు పెడితే కేసులతో వేధింపులు, నిర్బంధాలు ప్రయోగిస్తున్నారు. తెలంగాణకు గర్వకార ణమైన అస్తిత్వ చిహ్నాలపై విషం కక్కు తూ.. అధికార ముద్ర నుంచి తొలగిస్తామ ని అవమానిస్తున్నారు. మీ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు వ్యర్థ ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణకు అన్నం పెట్టిన కాకతీయ రాజులను అవమా ని స్తూ.. కుతుబ్ షాహీల కాలంలో నిర్మించిన చార్మినార్‌కు మలినాన్ని ఆపాదిస్తున్న మీ సంకుచితత్వం తెలంగాణకు హానికరం.
Comments
Please login to add a commentAdd a comment