‘మాటలు కోటలు దాటుతున్నాయ్‌’..రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌ | KTR slams on Congress Govt | Sakshi
Sakshi News home page

‘మాటలు కోటలు దాటుతున్నాయ్‌’..రేవంత్‌పై కేటీఆర్‌ ఫైర్‌

Published Mon, Aug 12 2024 9:57 AM | Last Updated on Mon, Aug 12 2024 11:03 AM

KTR slams on Congress Govt

మాజీ సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో సాగుకు స్వర్ణయుగమని..కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలంగా మారిందని అన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ట్విటర్‌ వేదికగా ఆయన కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఎక్స్‌లో  కేటీఆర్ ఏమన్నారంటే

కేసీఆర్ పాలనలో సాగుకు స్వర్ణయుగం.. కాంగ్రెస్ రాగానే వ్యవసాయానికి గడ్డుకాలం..ఇది కాంగ్రెస్ సర్కార్ చేసిన.. కమాల్. తెలంగాణలో సాగు విస్తీర్ణం కళ్ళముందే..ఢమాల్

ఒక్క ఏడాదిలోనే.. 15.30 లక్షల ఎకరాల్లో తగ్గిన సాగు విస్తీర్ణం..ఆగమైతున్న తెలంగాణ రైతు బతుకుకు.. తొలి ప్రమాద సంకేతం..! దశాబ్ద కాలంలోనే.. దేశానికే అన్నపూర్ణగా ఎదిగిన తెలంగాణలో..ఎనిమిది నెలల్లోనే..ఎందుకింత  వ్యవసాయ విధ్వంసం..? సంతోషంగా సాగిన సాగులో..ఎందుకింత సంక్షోభం..?? మొన్న.. వ్యవసాయానికి కరెంట్ కట్.. నిన్న.. రుణమాఫీలో రైతుల సంఖ్య కట్.నేడు.. సాగయ్యే భూమి విస్తీర్ణం కట్. రుణమాఫీ అని మభ్య పెట్టి..పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టడం వల్లే  రైతులకు ఈ అవస్థ అంటూ కేటీఆర్‌ కాంగ్రెస్‌పై మండిపడ్డారు.

రూ.500 బోనస్ అని..నిలువునా మోసం చేసింది ఈ కాంగ్రెస్ వ్యవస్థ..ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నయ్..కానీ చేతలు సచివాలయం గేటు దాటడం లేదు..ఆదిలాబాద్ నుంచి అలంపూర్ వరకు..అన్నదాతలది అత్యంత దయనీయ పరిస్థితి..కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకునే విజన్ లేదు..రిజర్వాయర్లు నింపే ప్రణాళిక  లేదు..చెరువులకు మళ్లించే తెలివి లేదు..ఒక్క మాటలో చెప్పాలంటే.. కాంగ్రెస్ పాలనలో..రైతు బతుకుకు భరోసానే లేదు.

బురద రాజకీయాలు తప్ప.. సమయానికి సాగు నీళ్లిచ్చే సోయి అసలే లేదు.. ఎరువులు-విత్తనాల కోసం రైతులకు తిప్పలు..క్యూలైన్లో పాసుబుక్కులు, చెప్పులు..కొత్త రుణాల కోసం బ్యాంకుల వద్దే..పగలూ రాత్రి తేడాలేకుండా పడిగాపులు అప్పుల బాధతో..అన్నదాతల ఆత్మహత్యలు..కౌలు రైతుల బలవన్మరణాలు ఇలా.. ఒకటా.. రెండా..సాగు విస్తీర్ణం తగ్గడానికి కారణాలు.. సవాలక్ష !!అని కాంగ్రెస్‌ ప్రభుత్వంపై కేటీఆర్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement