‘తెలంగాణలో హాంకాంగ్‌ తరహా ఉద్యమం​’ | Telangana Needs Hong Kong Style Movement: Komatireddy Venkat Reddy | Sakshi
Sakshi News home page

‘తెలంగాణలో హాంకాంగ్‌ తరహా ఉద్యమం​’

Published Wed, Oct 2 2019 6:09 PM | Last Updated on Wed, Oct 2 2019 6:14 PM

Telangana Needs Hong Kong Style Movement: Komatireddy Venkat Reddy - Sakshi

మాట్లాడుతున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి

సాక్షి, యాదాద్రి భువనగిరి : నిరంకుశ, నియంత తరహా పాలన చేస్తున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా తెలంగాణలో హాంకాంగ్‌ తరహా ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని భువనగిరి కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఆర్ధిక మాంద్యం ఉందన్న కేసీఆర్‌ కొత్త సచివాలయం ఎందుకు కడుతున్నాడని ప్రశ్నించారు. సచివాలయంపై హైకోర్టు తీర్పిచ్చినా ముందుకెళ్లుండడంపై పార్టీలకతీతంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రాన్ని దోచుకున్న బందిపోటు దొంగలు హుజూర్‌నగర్‌పై పడ్డారని కోమటిరెడ్డి విమర్శించారు. ఉప ఎన్నికల్లో ఒక్క మహిళను ఓడించడానికి సీపీఐ కాళ్లు పట్టుకున్నందుకు కేసీఆర్‌ సిగ్గుపడాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీకున్న ఒకే ఒక్క ఎమ్మెల్యేను (దేవరకొండ) కేసీఆర్‌ కొన్న విషయం సీపీఐ మర్చిపోయిందా? అని ప్రశ్నించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అక్టోబరు 2 నుంచి గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంటే, తెలంగాణలో కేసీఆర్‌ రాష్ట్రాన్ని ఎలా దోచుకోవాలో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement