
చౌటుప్పల్/నార్కట్‌పల్లి: వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇచ్చి రాష్టాన్ని సీఎం కేసీఆర్ సర్వనాశనం చేశారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ధ్వజమెత్తారు. బ్రాహ్మణ వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టును పూర్తి చేయకుంటే ఆగస్టు 15న ఉదయ సముద్రం ప్రాజెక్టు నుంచి హైదరాబాద్‌లోని జలసౌధ వరకు పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. ఆదివారం చౌటుప్పల్, నార్కట్‌పల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలు గడుస్తున్నా చినుకు జాడలేదని, ఎండలతో భూగర్భ జలాలు అడుగంటాయన్నారు. నిరంతర విద్యుత్ సరఫరా లేకపోతే ఇంతటి పరిస్థితి ఉండేదికాదని పేర్కొన్నారు. పొరుగు రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు పెద్దపీట వేయడాన్ని చూసి కేసీఆర్ నేర్చుకోవాలని హితవు పలికారు.