సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలో మాజీమంత్రి హరీశ్‌రావు ఉన్నట్టున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా హరీశ్‌రావు చేసిన వ్యాఖ్యలు కేసీఆర్, కేటీఆర్‌కు వెన్నుపోటు పొడిచేలా ఉన్నాయని చెప్పారు. తనను సీఎం చేస్తే మేడిగడ్డను పూర్తిచేసి చూపుతానన్న హరీశ్‌రావు వ్యాఖ్యల నేపథ్యంలో వెంకటరెడ్డి పైవిధంగా స్పందించారు. ఆయన గురువారం అసెంబ్లీ లాబీల్లో విలేకరులతో మాట్లాడుతూ.. కేసీఆర్‌ను వ్యతిరేకించి హరీశ్ బయటికొస్తే మద్దతు ఇస్తామని స్పష్టం చేశారు. ఇరవైమంది ఎమ్మెల్యేలతో ఆయన బీఆర్‌ఎస్ పార్టీ నేత కావాలని సూచించారు.
బీఆర్‌ఎస్‌లోనే ఉంటే హరీశ్‌రావు ఫ్లోర్‌లీడర్ కూడా కాలేరని ఎద్దేవా చేశారు. బీఆర్‌ఎస్ పార్టీ కవిత, హరీశ్, కేటీఆర్ పేర్ల మీద మూడు గా విడిపోతుందని జోస్యం చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కర్ర పట్టుకుని తిరుగుతున్నారని, అలాంటపుడు ఆయన పులి ఎట్లా అవుతారని ప్రశ్నించారు. 60 కేజీల బరువున్న కేసీఆర్ పులి అయితే.. 86కిలోల బరువున్న తానేం కావాలో చెప్పాలన్నారు. రాబోయే 20 ఏళ్లు కాంగ్రెస్ పారీ్టనే అధికారంలో ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment