సాక్షి, యాదాద్రి భువనగిరి: కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కొమటిరెడ్డి వెంకటరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొలి సంతకం రూ.2లక్షల రుణమాఫీ పైనే చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, నాలుగు వేల పింఛన్ అందిస్తామని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.
కాగా, కోమటిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతోంది. ఆగస్టు నెలాఖరుకు కాంగ్రెస్ బస్సు యాత్ర చేపడతాం. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ నేతలంతా పర్యటిస్తాం. ఎన్నికలపై సర్వేలన్నీ కాంగ్రెస్ గెలుస్తోందని చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా ఉంది.. ఎన్నికల్లో గెలుస్తుందనే నమ్మకం ఉంది. భువనగిరి అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్‌ను గెలిపిస్తాను.
తెలంగాణలో గ్రూప్-2 పరీక్షపై అభ్యర్థులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పరీక్షను వాయిదా వేయమంటే వేయడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉద్యోగాలను పారదర్శకంగా ఇస్తాం. వడగళ్ల వానకు పంట నష్టం జరిగితే ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వడం లేదు. 24 గంటల కరెంట్‌పై కేసీఆర్ ప్రభుత్వం చెప్పేవన్నీ అబద్దాలే. లాగ్ బుక్స్‌తో అన్నీ బయటపెట్టాను. మరోసారి సబ్ స్టేషన్ దగ్గర ధర్నాకు దిగుతాను. దెబ్బకు కేసీఆర్ దిగి రావాలి. కాంగ్రెస్ ప్రభుత్వంలో 24 గంటల కరెంట్ ఇస్తాం. విచ్చలవిడిగా భూములు అమ్మేస్తున్నారు. 50వేల కోట్లు మద్యం అమ్మకాల మీదే వస్తున్నాయి. ఆ పైసలన్నీ ఎటుపోతున్నాయి’ అని ప్రశ్నించారు.
ఇది కూడా చదవండి: ‘కేంద్రంలో వచ్చేది సంకీర్ణ ప్రభుత్వమే.. కేటీఆర్’
Comments
Please login to add a commentAdd a comment