
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు జరిపిన చర్చలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించాకే అంతిమంగా ఒక నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. చర్చల సారాంశంపై సోనియాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివేదిక సమర్పించాక ఆమె నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ అమలుకానుందన్నారు.
మరోవైపు సోమవారం రాత్రి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం మరోసారి జరిగింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఇందులో మునుగోడు వ్యవహారంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రేవంత్, వెంకట్‌రెడ్డి, జానా, ఉత్తమ్‌లతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో రాజకీయ పరిణామాలు సహా పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామని, 2–3 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను మీడియాకు వివరిస్తామన్నారు.
చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు
Comments
Please login to add a commentAdd a comment