komatireddy rajgopal reddy
-
సీఎం ఆయనే..కోమటి రెడ్డి కీలక వ్యాఖ్యలు
-
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారతాడంటూ ప్రచారం
-
‘ఆపరేషన్ బొగ్గు’.. సాక్ష్యాలివిగో.. వివరాలు వెల్లడించిన మధుయాష్కీ
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: జార్ఖండ్‌లోని చంద్రగుప్త బొగ్గు గని ప్రాజెక్ట్ దక్కించుకునేందుకు తల్లిలాంటి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలోకి రాజగోపాల్‌రెడ్డి ఎంట్రీ ఇచ్చారని టీపీసీసీ ప్రచారకమిటీ చైర్మన్, మాజీ ఎంపీ మధుయాష్కీ ఆరోపించారు. రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో భాగంగా జడ్చర్ల నియోజకవర్గం పెద్దాయపల్లి గేట్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజగోపాల్‌రెడ్డి తన వ్యాపార విస్తరణ కోసం మునుగోడు ప్రజలను మోసం చేశాడనడానికి సాక్ష్యాలివిగో అంటూ ప్రతులు చూపిస్తూ వివరాలు వెల్లడించారు. ‘ఆపరేషన్ బొగ్గు’అంటూ మధుయాష్కీ చెప్పిన వివరాలు ఆయన మాటల్లోనే.. చంద్రగుప్త బొగ్గుగని ప్రాజెక్ట్‌ను రూ.3,437 కోట్ల అతి తక్కువ బిడ్డింగ్‌తో దొడ్డిదారిన రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ సంస్థ దక్కించుకుంది. ఈ ప్రాజెక్ట్ ద్వారా దాదాపు ఐదురెట్లకిపైగా రూ.18 ,264 కోట్ల లాభం వస్తుంది. వాస్తవానికి 2019లో కోల్‌కతా హైకోర్టు సుశి ఇన్‌ఫ్రాటెక్‌ను బ్యాంక్ డిఫాల్టర్‌గా ప్రకటించింది. అలాంటి కంపె నీకి చంద్రగుప్త ప్రాజెక్ట్‌ను బీజేపీ కేటాయించడంలో మతలబేంటో అందరికీ తెలుసు. కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా 2020 జూన్ 30న జార్ఖండ్‌లోని చంద్రగుప్త కోల్ ప్రాజెక్ట్‌కు మొదటి టెండర్ ప్రకటించింది. ఇందులో రాజగోపాల్‌రెడ్డికి చెందిన సుశి ఇన్ఫ్రాటెక్ పాల్గొనలేదు. మొదటి టెండరు అదానీ గ్రూప్‌నకు దక్కినా.. దాన్ని రద్దుచేస్తూ 2021 జనవరిలో రెండోసారి టెండర్ ప్రకటించింది. అదే సమయంలో రాజగోపాల్‌రెడ్డి బీజేపీకి అనుకూలంగా ప్రకటనలిస్తూ లాబీయింగ్ చేశాడు. రెండో టెండరులో పాల్గొ న్న సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు 2021 ఫిబ్రవరి 3న చంద్రగు ప్త ప్రాజెక్ట్ కేటాయించారు. టెండర్ అలాటైనా ప్ర భుత్వం ఆ కంపెనీకి గని కేటాయించలేదు. దీంతో 2021 మార్చిలో నాగార్జునసాగర్ ఉపఎన్నిక సందర్భంగా ఆయన బీజేపీ నేతలతో చర్చలు మొదలుపెట్టారు. ఫలితంగా 2021 డిసెంబర్లో లెటర్ ఆఫ్ ఇంటెంట్‌తో జారీ జరిగింది. సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు కోల్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంట్రాక్ట్ ఇచ్చినా.. ఒప్పందంలో జాప్యం జరుగుతుండగా ఈ ఏడాది మార్చి 17న బీజేపీలో చేరనంటూ రాజగోపాల్‌రెడ్డి ప్రకటించి పరోక్షంగా ఒత్తిడి తెచ్చి అగ్రిమెంట్ చేయించుకున్నారు. పథకం ప్రకారం జరిగిన అగ్రిమెంట్.. ‘ఈ బొగ్గు కుంభకోణంలో చర్చల పర్వం జనవరి 2021 నుంచి డిసెంబర్ 2021 వరకు జరిగింది. కాంట్రాక్ట్ వచ్చినంక ఒప్పందం ఆలస్యం అవుతుంటే జనవరి 2022 నుంచి జూలై 2022 వరకు మరో పర్వం కొనసాగింది. చివరకు జూలై 27న బీజేపీలోకి చేరుతున్నట్లు రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. క్విడ్‌ప్రోకో కిందనే జార్ఖండ్‌లోని చంద్రగుప్త దక్కించుకున్నారు. గతంలో సుశి ఇన్‌ఫ్రాటెక్‌కు, తనకు సంబంధం లేదని రాజగోపాల్‌రెడ్డి ప్రకటించారు. అయితే ఆయన భార్య, కూతురుకు 99.09శాతం షేర్లు ఉన్నాయి. అటువంటోడు ఆత్మగౌరవ పోరాటమంటడు.. మునుగోడు, తెలంగాణ ప్రజలు దీన్ని అర్థం చేసుకోవాలి’ అని మధుయాష్కీ అన్నారు. ఈ విలేకరుల సమావేశంలో పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. -
ఆపరేషన్ బొగ్గు.. డాక్యుమెంట్ విడుదల చేసిన మధుయాష్కీ గౌడ్
సాక్షి, హైదరాబాద్: ఆపరేషన్ బొగ్గు పేరుతో డాక్యుమెంట్ విడుదల చేశారు కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్. రాజగోపాల్ రెడ్డికి బీజేపీ చంద్రగుప్త బొగ్గు గనుల టెండర్ ఇచ్చిందని సెటైర్లు వేశారు. నష్టాల్లో ఉన్న కంపెనీకి రూ.18వేల కోట్ల కాంట్రాక్ట్ ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తన కంపెనీ అభివృద్ధి కోసమే రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారని ఆరోపించారు. ఆయన రాజకీయమంతా బ్యాక్‌డోర్ లాబీయింగ్ అని విమర్శలు గుప్పించారు. చదవండి: సీఎం కేసీఆర్.. ఇంటర్నేషనల్ కేడీ.. టీఆర్ఎస్ వీఆర్ఎస్ తప్పదు -
కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుంది : రాజగోపాల్ రెడ్డి
-
‘నా రాజీనామా తర్వాత మునుగోడులో ఎన్నో మార్పులు’
నల్గొండ: మునుగోడు ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే కాంగ్రెస్ పార్టీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశానని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి స్పష్టం చేశారు. తన రాజీనామా అనంతరం మునుగోడులో ఎన్నో మార్పులు వస్తున్నాయనే విషయాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. ప్రజలకు అన్యాయం జరుగుతుంది కాబట్టే రాజీనామా చేస్తే, బీజేపీకి అమ్ముడుపోయానంటూ తనపై విష ప్రచారం చేస్తున్నారన్నారు. చుండూరులో నిర్వహించిన ప్రెస్మీట్లో రాజగోపాల్‌రెడ్డి మాట్లాడారు. ‘చౌటుప్పల్, నారాయణ పురం మండల కేంద్రాల్లో ఆరోపణలు చేస్తూ పోస్టర్లు వేశారు. రాత్రికి రాత్రి ఆటోల్లో పిరికిపందల్లా వచ్చి అతికించిపోయారు. రాజగోపాల్ అమ్ముడు పోయారంటూ అందులో ఉంది.నేనంటే గిట్టనివాళ్లే చేస్తున్నారు. 12 మంది ఎమ్మెల్యేలు పోయిన నాడే పార్టీ మారేవాడిని. భూ నిర్వాసితులకు న్యాయం చేయమని, రోడ్లు నిర్మించాలని, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, బెల్ట్ షాపులు తొలగించాలని, చౌటుప్పల్ లో కాలుష్యం పై పోరాటం చేస్తూనే ఉన్నా. తెలంగాణలో ప్రాజెక్టుల రీ డిజైనింగ్ లో అవినీతిపై పోరాటం చేశా. నిజంగా అమ్ముడుపోయే వ్యక్తి ప్రభుత్వంపై పోరాటం చేస్తాడా?, ఒక పార్టీలో గెలిచి పార్టీ ఫిరాయించిన వ్యక్తులను పట్టించుకోలేదు. అవినీతి, కుటుంబ పాలనపోవాలనే పార్టీ మారుతున్నా. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బలహీనపడింది. గట్టుప్పల మూడున్నరేళ్లుగా ఎందుకు ఇవ్వలేదు. అమిత్ షాని కలవగానే మండలం ఇవ్వలేదా?, నా రాజీనామాతో తెలంగాణా వ్యాప్తంగా పది లక్షల పించన్లు రాలేదా?, నా రాజీనామా వల్ల ఎన్నో మార్పులు వస్తున్నాయి. సోనియా గాంధీ అంటే గౌరవం ఉందని చెప్పిన. మునుగోడు ప్రజలు నా వెంట ఉన్నారనే ఇలాంటి పని చేస్తున్నారు.నాకు వస్తున్న ఆదరణ చూసే ఇలాంటి పనులు చేస్తున్నారు. గతంలో టీఆర్ఎస్ నుంచి ఎన్నో ఆఫర్లు వచ్చినా పోలేదు. అలాంటిది ఇప్పుడు కాంట్రాక్టుల కోసం పార్టీ మారుతానా?, నిజాయితీగా నైతిక విలువలకు కట్టుబడి బీజేపీలో చేరుతున్నా’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. -
మునుగోడులో 2 లక్షల మందితో సభ
చౌటుప్పల్ రూరల్: తాను ఈ నెల 21న అమిత్‌షా సమక్షంలో బీజేపీలో చేరనున్నానని.. ఆ బహిరంగ సభను 2 లక్షల మందితో మునుగోడు మండల కేంద్రంలో నిర్వహించనున్నామని మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. మంగళవారం యాదాద్రి జిల్లా అంకిరెడ్డిగూడెం వద్ద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను రాజగోపాల్ కలిశారు. బహిరంగ సభ ఏర్పాట్లపై బండి, మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, వివేక్, గంగిడి మనోహర్‌రెడ్డితో కలిసి చర్చించారు. అనంతరం రాజగోపాల్‌రెడ్డి మీడి యాతో మాట్లాడారు. బుధవారం నుంచి మునుగోడులోని మండలాలవారీగా సమీక్ష సమావేశాలు నిర్వహిస్తానని, బహిరంగ సభ అనంతరం గ్రామగ్రామాన తిరుగుతానన్నారు. రాజీనామా చేయాల్సిన పరిస్థితి, నియోజకవర్గంలోని సమస్యలను ప్రజలకు వివరిస్తానని చెప్పారు. తనకు తిన్నది అరగడం లేదని గుత్తా సుఖేందర్‌రెడ్డి విమర్శించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఆయనకు చీము, నెత్తురు, సిగ్గు, శరం ఉందా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి, రాజీనామా చేయకుండానే పార్టీ మారాడని దుయ్యబట్టారు. నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని, లేదంటే తీవ్ర పరిమాణాలు ఉంటాయని హెచ్చరించారు. సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో ఉప ఎన్నికలు రావచ్చన్నారు. చదవండి: కేంద్రం నిధులు బొక్కేస్తున్న కేసీఆర్ -
హస్తినలో తేలని ‘కోమటిరెడ్డి’ పంచాయితీ
సాక్షి, న్యూఢిల్లీ: మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పార్టీ మార్పు వ్యవహారం ఇంకా ఎటూ తేలలేదు. ఈ విషయంలో పార్టీపరంగా రాజగోపాల్‌రెడ్డిపై చర్యలు ఉంటాయంటూ ఊహాగానాలు వెలువడ్డా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం మరో రెండు, మూడు రోజులపాటు వేచిచూసి నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించింది. పార్టీ మారకుండా ఆయన్ను బుజ్జగించేందుకు జరిపిన చర్చలను ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీకి వివరించాకే అంతిమంగా ఒక నిర్ణయం ఉంటుందని ఏఐసీసీ సీనియర్ నేత ఒకరు తెలిపారు. చర్చల సారాంశంపై సోనియాకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివేదిక సమర్పించాక ఆమె నిర్ణయం మేరకే తదుపరి కార్యాచరణ అమలుకానుందన్నారు. మరోవైపు సోమవారం రాత్రి ఢిల్లీలోని కేసీ వేణుగోపాల్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాలకు సంబంధించిన కీలక సమావేశం మరోసారి జరిగింది. దాదాపు అరగంటపాటు జరిగిన ఈ భేటీలో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సీనియర్ నేత జానారెడ్డి పాల్గొన్నారు. ఇందులో మునుగోడు వ్యవహారంతోపాటు తాజా పరిణామాలపై చర్చించారు. అనంతరం రేవంత్, వెంకట్‌రెడ్డి, జానా, ఉత్తమ్లతో కలిసి భట్టి మీడియాతో మాట్లాడారు. మునుగోడులో రాజకీయ పరిణామాలు సహా పార్టీ పటిష్టతకు అనుసరించాల్సిన వ్యూహాలపై భేటీలో సుదీర్ఘంగా చర్చించామని, 2–3 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను మీడియాకు వివరిస్తామన్నారు. చదవండి: ఉద్యమాల పురిటిగడ్డకు వారసులొస్తున్నారు.. ఎమ్మెల్యే రేసులో నేతల పిల్లలు -
ఆ రోజు అలా మాట్లాడి తప్పు చేశా!
సాక్షి, హైదరాబాద్: టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా గురించి గతంలో బహిరంగంగా మాట్లాడి తప్పు చేశానని మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అయితే పార్టీకి నష్టం జరగకూడదనే ఆలోచన, ఆవేదనలే తనను అలా మాట్లాడించాయని పేర్కొన్నారు. టీడీపీతో పొత్తు వద్దని, అందరినీ కలుపుకుని వెళ్లాలని మాత్రమే చెప్పానని, అయినా తాను చేసింది తప్పేనని అంగీకరించారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పార్టీ నేతలకు ఏదైనా సమస్య ఉంటే అంతర్గత వేదికల్లో మాత్రమే మాట్లాడాలన్న కుంతియా సూచన సరైందేనని, పార్టీలో అంతర్గతంగా మాట్లాడుకోవడమే మంచిదని అభిప్రాయపడ్డారు. మల్కాజ్గిరి ఎంపీ రేవంత్‌రెడ్డి జైలుకు వెళ్లడానికి, ఆయనకు పీసీసీ అధ్యక్ష పదవి రావడానికి సంబంధం లేదన్నారు. రేవంత్ ఓటుకు నోటు కేసులోనే జైలుకు వెళ్లారని, ఇప్పుడు జైలుకు వెళ్తే తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతాననే ఆలోచనతో జైలుకు వెళ్లలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల అభిమానులు వారు అభిమానించే వారికి పీసీసీ అధ్యక్ష పదవి రావాలనుకోవడంలో తప్పులేదని, అయితే అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అన్నారు. టీపీసీసీ అధ్యక్ష పదవి అధిష్టానం ఎవరికి ఇచ్చినా అందరూ సహకరించాలని కోరారు. బలమైన నాయకుడికి పీసీసీ అధ్యక్ష పదవి ఇస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తామని, టీఆర్ఎస్ను గద్దె దించుతామని ధీమా వ్యక్తం చేశారు. -
‘నా సతీమణి తప్పక గెలుస్తుంది’
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తన సతీమణి గెలుపొందుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను హీనంగా చూస్తుందని ఆరోపించారు. ఇన్ని రోజులు గడిచిన సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే కేసీఆర్‌కు బుద్ధి చెబుతూ నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిని గెలిపించాలని కోరారు. -
'ఇప్పుడు కబుర్లు చెబుతోంది'
సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ నేతలు, ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో శనివారం ఆయన ప్రసంగిస్తూ.. ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, నేడేమో విడతలవారీగా చేస్తామని కబుర్లు చెబుతోందన్నారు. రూ.1.30 లక్షల కోట్లతో సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేదిగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత రెండు బడ్జెట్లలోనూ పేర్కొన్న అంచనాల మేరకు నిధులను ఖర్చు చేయలేకపోవడమే ఇందుకు నిదర్శనం అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించడం పచ్చిబూటకమని, రూ.15 వేల కోట్ల కన్నా ఖర్చు చేసే సామర్థ్యం ప్రభుత్వ యంత్రాంగానికి లేదన్నారు.