
సాక్షి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా తన సతీమణి గెలుపొందుతుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. వరంగల్, రంగారెడ్డి, నల్లగొండ ఉమ్మడి జిల్లాల స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు శుక్రవారం ఉప ఎన్నికలు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను హీనంగా చూస్తుందని ఆరోపించారు. ఇన్ని రోజులు గడిచిన సర్పంచులకు చెక్ పవర్ ఇవ్వలేదని మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో మాదిరిగానే కేసీఆర్‌కు బుద్ధి చెబుతూ నల్లగొండ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మిని గెలిపించాలని కోరారు.
Comments
Please login to add a commentAdd a comment