సాక్షి, నల్గొండ : స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. జిల్లా వ్యాప్తంగా ఏడు రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో శుక్రవారం ఉదయం 8 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం నాలుగు గంటలకు ముగిసింది. నల్గొండలోని పోలింగ్ కేంద్రాన్ని పరిశీలించిన అనంతరం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి తెర చిన్నపరెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘నా గెలుపు ఎప్పుడో ఖాయమైంది. నాకు ఓటేసిన అందరికీ ధన్యవాదాలు. మంత్రి జగదీష్ రెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు, కార్యకర్తలు అందరి కృషితో మంచి మెజారిటీతో విజయం సాధించబోతున్నా. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమమే.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటర్లు టీఆర్‌ఎస్‌కు పట్టేందుకు దోహదపడింది. శాసనమండలికి వెళ్లి విశేషమైన అభివృద్ధి చేసి చూపిస్తా. సీఎం కేసీఆర్ నాయకత్వంలో నల్గొండ జిల్లా లోకల్‌బాడీ స్థానాన్ని గులాబీ పార్టీ కైవసం చేసుకుంటుంది. నల్గొండ జిల్లా ఎమ్మెల్సీ బరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కోమటిరెడ్డి లక్ష్మీ రాజగోపాల్‌రెడ్డి ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment