'ఇప్పుడు కబుర్లు చెబుతోంది'
'ఇప్పుడు కబుర్లు చెబుతోంది'
Published Sat, Mar 19 2016 5:10 PM | Last Updated on Sun, Apr 7 2019 3:50 PM
సాక్షి, హైదరాబాద్: ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ నేతలు, ప్రజలను పచ్చిగా మోసం చేస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బడ్జెట్‌పై చర్చ సందర్భంగా తెలంగాణ శాసనమండలిలో శనివారం ఆయన ప్రసంగిస్తూ.. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ పార్టీ రైతులకు రూ.లక్ష రుణమాఫీ చేస్తానని హామీ ఇచ్చి, నేడేమో విడతలవారీగా చేస్తామని కబుర్లు చెబుతోందన్నారు. రూ.1.30 లక్షల కోట్లతో సర్కారు ప్రవేశపెట్టిన బడ్జెట్ రాష్ట్రాన్ని సంక్షోభంలోకి నెట్టేదిగా ఉందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన గత రెండు బడ్జెట్‌లలోనూ పేర్కొన్న అంచనాల మేరకు నిధులను ఖర్చు చేయలేకపోవడమే ఇందుకు నిదర్శనం అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. బడ్జెట్లో ఇరిగేషన్‌కు రూ.25 వేల కోట్లు కేటాయించడం పచ్చిబూటకమని, రూ.15 వేల కోట్ల కన్నా ఖర్చు చేసే సామర్థ్యం ప్రభుత్వ యంత్రాంగానికి లేదన్నారు.
Advertisement