సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో చేరికలపై మరింత ఫోకస్ పెంచాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో బుధవారం కీలక భేటీ జరిగింది.
ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా దాదాపు 30 మంది నేతలు హాజరయ్యారు.
చదవండి: సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు
వచ్చే నెల నుంచి బస్సు యాత్ర చేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారు. భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని, విభేదాలు మరిచిపోయి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. జూలై 30న ప్రియాంక గాంధీ సభ ఉంటుందని, మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని కోమటిరెడ్డి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment