komati reddy
-
3 గంటలు కావాలా?.. 24 గంటలు కావాలా?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ/రామన్నపేట/తుంగతుర్తి: ‘మీ ఇంటి ముందున్న అభివృద్ధిని చూడండి.. మీ కళ్ల ముందుండే అభ్యర్థిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి’ అని వైద్యారోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పిలుపునిచ్చారు. నకిరేకల్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి లింగయ్యను గెలిపించి సీఎం కేసీఆర్‌ను హ్యాట్రిక్ సీఎంను చేయాలన్నారు. నకిరేకల్ పట్టణంలో ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. హరీశ్‌రావు మాట్లాడుతూ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సిగ్గులేకుండా 3 గంటల కరెంట్ చాలని మాట్లాడారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ వస్తే 3 గంటల కరెంటే ఉంటుందని, బీఆర్ఎస్ వస్తే 24 గంటలు వస్తుందని, ఏది కావాలో ప్రజలు ఆలోచించాలని సూచించారు. 3 గంటల కరెంటు కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలన్నారు. కోమటిరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్‌రెడ్డిలు పేర్లుకే పెద్దమనుషులు నల్లగొండ జిల్లాకు చెందిన కొందరు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని, వారు పేరుకే పెద్దమనుషులని హరీశ్ వ్యాఖ్యానించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డి పేర్లు పెద్దవే తప్ప వాళ్లు చేసే పనులు చిన్నవన్నారు. వారు జిల్లాను ఏనాడైనా పట్టించుకున్నారా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ వారి పాలనలో శవాన్ని కాల్చేసి స్నానం చేద్దామంటే కరెంట్ లేని పరిస్థితి ఉండేదని, ఇప్పుడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఆనాడు ఉచిత కరెంట్ అని ఉత్త కరెంట్ ఇచ్చారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ ఎన్ని ట్రిక్కులు చేసినా హ్యాట్రిక్ కొట్టేది బీఆర్ఎస్ పార్టీయేనని, నకిరేకల్ అభివృద్ధి కొనసాగాలంటే ఎమ్మెల్యేగా లింగయ్యను గెలిపించాలని పిలుపునిచ్చారు. వంద రకాలుగా తెలంగాణకు ద్రోహం చేసిన కాంగ్రెస్ః జగదీష్ రెడ్డి రాష్ట్ర ప్రజల ముఖాల్లో వెలుగులు నింపిన ఘనత సీఎం కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ పార్టీదేనని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ‹Ùరెడ్డి అన్నారు. తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ వంద రకాలుగా ద్రోహం చేస్తే. బీఆర్ఎస్ ప్రభుత్వం వంద మంచి పనులు చేసిందన్నారు. ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే మేనిఫెస్టో వస్తుంది ప్రతిపక్షాలకు దిమ్మతిరిగే విధంగా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాబోతుందని హరీశ్‌రావు తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీకి 35 నియోజకవర్గాల్లో అభ్యర్థులు కరువయ్యారని, మనం పనికిరారంటూ పక్కన పెట్టిన వారిని పార్టీలో చేర్చుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే తెలంగాణ వాంరటీ అయినా గ్యారంటీ అయినా కేసీఆరే అని మంత్రి హరీష్‌రావు అన్నారు. తుంగతుర్తి సభలో మంత్రి జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిషోర్‌కుమార్‌తో కలిసి మాట్లాడారు. అసెంబ్లీ టిక్కెట్లను కాంగ్రెస్ పార్టీ రూ.15కోట్లకు అమ్ముకుంటోందని ఆరోపించారు. రేపు అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని అమ్ముకుంటారని హెచ్చరించారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటల, నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలంలో, నకిరేకల్‌లో, సూ ర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి హరీశ్ శంకుస్థాపనలు ప్రారంబోత్సవాలు చేశారు. -
టీ కాంగ్రెస్ ఎన్నికల యాక్షన్ ప్లానేంటి? కోమటిరెడ్డి నివాసంలో ఏం జరిగింది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. ఎన్నికలు సమీపిస్తుండడంతో చేరికలపై మరింత ఫోకస్ పెంచాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నివాసంలో బుధవారం కీలక భేటీ జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేశ్‌కుమార్‌గౌడ్, సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో సహా దాదాపు 30 మంది నేతలు హాజరయ్యారు. చదవండి: సీఎం కేసీఆర్‌కు ఊహించని షాక్.. హైకోర్టు నోటీసులు వచ్చే నెల నుంచి బస్సు యాత్ర చేయాలని ఆ పార్టీ సీనియర్ నేతలు నిర్ణయించారు. భేటీ అనంతరం ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, కలిసికట్టుగా ప్రజల్లోకి వెళ్లాలని, విభేదాలు మరిచిపోయి పనిచేయాలని నిర్ణయించామని తెలిపారు. కాంగ్రెస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆయన మండిపడ్డారు. జూలై 30న ప్రియాంక గాంధీ సభ ఉంటుందని, మహిళా డిక్లరేషన్‌ను ప్రియాంక గాంధీ ప్రకటిస్తారని కోమటిరెడ్డి తెలిపారు. -
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో " స్ట్రెయిట్ టాక్ "
-
తెలంగాణ కోసం మంత్రి పదవినే వదులుకున్నా
ఇబ్రహీంపట్నం రూరల్: తెలంగాణ రాష్ట్ర సాధన కోసం మంత్రి పదవికి రాజీనామా చేసిన ఏకైక వ్యక్తిని తానేనని, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల్లో భారీ మోజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఆదిబట్ల మున్సిపాలిటీ పరిధిలోని బొగ్లూర్ గేటు సమీపంలో ఉన్న కన్వెన్షన్ హాల్లో ఆదివారం ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడారు. తాను తెలంగాణ ఉద్యమంలో కీలక భూమిక పోషించానని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మంత్రి పదవిని వదులుకొని పాల్గొన్న చరిత్ర తనదన్నారు. సోనియాగాంధీ పిలిచి మంత్రి పదవికి రాజీనామా చేయొద్దని వారించినా, తాను పట్టించుకోలేదన్నారు. మన పిల్లల భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని, ఆ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు. ఎల్బీనగర్లో అత్మబలిదానం చేసుకున్న శ్రీకాంతచారిని దగ్గరుండి అస్పత్రికి తీసుకెళ్లానన్నారు. భువనగిరి అభివృద్ధి కోసం అన్నివిధాలుగా కృషి చేస్తానని చెప్పారు. ఎవరికీ ఏ అపద వచ్చినా తాము ముందుంటామని అన్నారు. ఎమ్మెల్సీగా, ఎంపీగా, ఎమ్మెల్యేగా, మంత్రిగా అనేక బాధ్యతలు నిర్వర్తించి సేవలందించామని తెలిపారు. చేవెళ్ల, పెద్దపల్లి, మల్కాజ్గిరి, భువనగిరితో పాటు మరో రెండు సీట్లు తమ పార్టీ గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్రం బాగుపడాలంటే తప్పకుండా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని తెలిపారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి, ఎంపీపీలు నిరంజన్‌రెడ్డి, జయమ్మ, మాజీ ఎంపీపీ రాంరెడ్డి, జెడ్పీటీసీ అయిలయ్య, ఈసీ శేఖర్‌గౌడ్, ఆదిబట్ల మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాల్‌రాజ్‌గౌడ్, పార్టీ మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు ఉన్నారు. -
ఎవరికి వారే..!
సాక్షి, జనగామ: జిల్లాలోని కాంగ్రెస్ నాయకుల్లో సమన్వయం కరువైందని కార్యకర్తలు పేర్కొంటున్నారు. నాయకులు పోటాపోటీగా ప్రజలను కలవడానికి ప్రయత్నిస్తుండడంతో వారు అయోమయానికి గురవుతున్నారు. సాధారణ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడంతో నాయకులు విస్తృత పర్యటనలు చేస్తున్నారు. జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గం మినహా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్ నియోజవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్యనే పోటీ నెలకొంది. జనగామ నియోజకవర్గంలో పట్టు కోసం మాజీ ఎంపీ, ప్రస్తుత ఎమ్మెల్సీ కొమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ప్రయత్నాలను మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గంలో జనగామ అంతర్భాగంగా ఉంది. 2009–14 మధ్య కాలంలో భువనగిరి ఎంపీగా రాజగోపాల్‌రెడ్డి ప్రాతినిథ్యం వహించారు. ఎంపీగా ఉన్న సమయంలో జనగామ ప్రాంతంలో ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఇప్పటికి రాజగోపాల్‌రెడ్డి సొంత క్యాడర్‌ను కలిగి నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. నమ్ముకున్న కార్యకర్తలకు అండగా ఉంటారనే పేరున్న రాజగోపాల్‌రెడ్డి ఇటీవల జనగామలో పర్యటించారు. అప్పుల బాధతో ఆత్మహత్యకు పాల్పడిన రైతు దంపతుల కుటుంబాన్ని సిద్ధంకిలో పరామర్శించారు. జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలోనే జనగామలో కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటామని వ్యాఖ్యానించారు. రాజగోపాల్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. జనగామ నుంచి 2019లో జరుగనున్న ఎన్నికల్లో ఆయన సతీమణి కోమటిరెడ్డి లక్ష్మీని బరిలోకి దించే ఆలోచన చేస్తున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2009 ఎన్నికల్లో భర్త రాజగోపాల్‌రెడ్డి గెలుపు కోసం ఈ ప్రాంతంలో ఆమె స్వయంగా ప్రచారం నిర్వహించారు. ప్రచార సరళిలో ఆమె ప్రజలను విశేషంగా ఆకర్షించారు. ప్రజలకు పరిచయం ఉండడంతో టికెట్‌ను ఆశిస్తున్నట్లు కొమటిరెడ్డి వర్గీయులు చెబుతుండడం గమనార్హం. ఘన్‌పూర్‌లో మూడు ముక్కలాట.. స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ మూడు ముక్కలాటగా మారింది. మాజీ మంత్రి జి.విజయరామారావు, బి.ఆరోగ్యం, సిం గపురం ఇందిర మూడు వర్గాలుగా విడిపోయారు. ముగ్గురు నేతలు ఎవరికి వారుగా వర్గాలు విడిపోయి ప్రజలను కలుస్తున్నారు. ముగ్గురు టికెట్ల ను ఆశిస్తూ సొంత ఇమేజ్ కోసం ప్రయత్నిస్తున్నా రు. అయితే కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజా చైతన్య యాత్రకు ముందు టీపీసీసీ నియోజకవర్గ సభ్యులుగా జి.విజయరామారావు, గంగా రపు అమృతరావును నియమించింది. నాయకుల మధ్య సమన్వయం లేకపోవడంతో బస్సు యాత్ర నియోజకవర్గంలో కొనసాగినా ఎలాంటి కార్యక్రమాలను చేపట్టలేదు. కనీసం రోడ్ షోను సైతం చేపట్టక పోవడంతో కార్యకర్తల్లో నైరాశ్యం నెలకొంది. యాత్రను ప్రజల చైతన్యవంతం కోసం ఉపయోగించుకోవడంలో స్థానిక నాయకులు విఫలమయ్యారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పొన్నాలపై ఏఐసీసీ కార్యదర్శికి ఫిర్యాదు.. ఇటీవల భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ పార్టీ సమావేశంలో జనగామ నియోజకవర్గానికి చెందిన కొందరు నాయకులు పొన్నాల లక్ష్మయ్యపైనే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. 2014 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి పొన్నాల కార్యకర్తలను పట్టించుకోవడం లేదని ఈ నెల 17వ తేదీన జరిగిన పార్టీ సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శికి విన్నవించారు. దీంతో ఆ పార్టీలోని అంతర్గత కలహాలు బహిర్గతమయ్యాయి. కానీ, జనగామ నుంచి పొన్నాల నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. రెండు పర్యాయాలు కేబినెట్ మంత్రిగా పని చేశారు. కాంగ్రెస్ పార్టీలో మంచి మేధావిగా, బీసీ నేతగా గుర్తింపు ఉంది. కాంగ్రెస్ పార్టీలో జనగామ అనగానే పొన్నాల అనే స్థాయిలో పేరుంది. అయితే పొన్నాల, కోమటిరెడ్డి ఒకే పార్టీ అయినా వేర్వేరుగా పర్యటనలు చేయడం రాజకీయ చర్చకు దారితీస్తోంది. పాలకుర్తిలో గ్రూపులకుతావివ్వకుండా.. పాలకుర్తి నియోజకవర్గంలో జంగా రాఘవరెడ్డి మాత్రమే ఎలాంటి గ్రూపులకు తావివ్వకుండా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. నిత్యం అందుబాటులో ఉంటూ కార్యకర్తలను సమన్వయం చేస్తున్నారు. అధికార పార్టీ వైఫల్యాలను ప్రజల మధ్యలో ఎండగడుతూనే నిరసన కార్యక్రమాలను చేపడుతున్నారు. ఏప్రిల్‌లో పాలకుర్తిలో నిర్వహించిన ప్రజా చైతన్య యాత్రను సక్సెస్ చేయడంతో జంగాకు అధిష్టానం నుంచి ప్రశంసలు వచ్చాయి. ఇటీవల రైతు దీక్ష సందర్భగా పాలకుర్తి నుంచి జనగామ వరకు భారీ ర్యాలీ నిర్వహించి ప్రజలను ఆకర్షించారు. -
కోమటిరెడ్డి, సంపత్ కోర్టు ధిక్కార పిటిషన్‌పై విచారణా
-
నా భర్తది ముమ్మాటికీ రాజకీయ హత్యే
-
‘కేసీఆర్‌కు వ్యవసాయంపై అవగాహన లేదు’
నల్లగొండ టూటౌన్: వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఏ మాత్రం అవగాహన లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని మండిపడ్డారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు. రైతుల కోసం ఏదో చేసినట్టుగా గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్‌కు పోయే కాలం దగ్గరికొచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఒక మోసగాడి చేతిలో మోసపోయిందని, రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం లేకుండా చేశారని అన్నారు. -
రూ.10 వేల కోట్ల కుంభకోణం
-
రూ.10 వేల కోట్ల కుంభకోణం
నిరూపించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: కోమటిరెడ్డి సవాల్ ⇒ సభా సంఘంతో విచారణకు డిమాండ్ ⇒ కోమటిరెడ్డికి కాంట్రాక్టర్లపైనే ధ్యాస ఎందుకోనని కేటీఆర్ ఎద్దేవా ⇒ జనానికి మంచినీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు నీళ్లొస్తాయని కాంగ్రెస్‌లో భయం ⇒ సభా సంఘం వేయాల్సిందే: జానారెడ్డి ⇒ అసెంబ్లీలో మిషన్ భగీరథపై తీవ్ర వాదోపవాదాలు.. కాంగ్రెస్ వాకౌట్ ఒక్క రూపాయి పెట్టుబడి లేకుండా 30 శాతం మొత్తానికి కాంట్రాక్టర్లు సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పగించారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం. దీని విలువ రూ.10 వేల కోట్లు. విద్యావంతుడైన మంత్రి కేటీఆర్ నా ఆరోపణలపై స్పందించిన తీరు దారుణం. నేను ఊరకే మాట్లాడ్డం లేదు. దీన్ని నిరూపించకుంటే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా.. – కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డిది ఇదే తీరు. నల్లగొండ ప్రజలకు నీళ్ల గురించి అడక్కుండా కాంట్రాక్టర్లు, టెండర్లపైనే ఎందుకు దృష్టి. అవినీతిపై ఆయన మాట్లాడటం హాస్యాస్పదం. కోమటిరెడ్డిది స్వీయ మానసిక ఆందోళన.. దాన్ని ప్రజలపై రుద్దొద్దు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్లకిందకు నీళ్లొస్తాయనేది కాంగ్రెస్ భయం. మిషన్ భగీరథలో అవినీతి లేదు. ఎవరికి ఫిర్యాదు చేస్తారో చేసుకోమనండి.. – మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో బుధవారం మంత్రి కేటీఆర్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. గ్రామీణ నీటి సరఫరా పద్దుపై కేటీఆర్ మాట్లాడిన తర్వాత పలువురు సభ్యులు సందేహాలు అడి గారు. ఈ సమయంలో కోమటిరెడ్డి మాట్లాడుతూ.. మిషన్ భగీరథ పథకం మంచిదేనని, అయితే ఇందులో కాంట్రాక్టర్లు పనులను సబ్ కాంట్రాక్టర్లకు ఇచ్చి డబ్బులు వసూలు చేసుకున్నారని ఆరోపించారు. కొందరు కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డ తీరును ప్రస్తావిస్తూ ఏ ప్యాకేజీ ఏ కాంట్రాక్టర్‌కు కట్టబెట్టారో పేర్లు చదివారు. 26 ప్యాకేజీలుగా సాగుతున్న రూ.32,582 కోట్ల పనుల్లో 30శాతం మొత్తాన్ని సబ్ కాంట్రాక్టర్ల నుంచి ప్రధాన కాంట్రాక్టర్లు వసూలు చేశారని, రూపాయి పెట్టుబడి లేకుండా వారు రూ.10 వేల కోట్లు దండుకున్నారని ఆరోపణలు గుప్పించారు. దీనిపై వెంటనే సభా సంఘం వేసి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇది ఆంధ్రా కాంట్రాక్టర్ల దోపిడీ అంటూ గట్టిగా మాట్లా డారు. దీనికి కేటీ«ఆర్ స్పందిస్తూ.. గత సమావేశాల్లోనూ కోమటిరెడ్డి ఇవే మాటలు మాట్లాడారని, ఆ ప్రాజెక్టుతో నల్లగొండకు మంచినీళ్లు ఎలా వస్తాయని ప్రశ్నిస్తే ప్రజలు కూడా హర్షించేవారని, కానీ దాన్ని వదిలి కాంట్రాక్టర్లు, సబ్‌కాంట్రాక్టర్లు, టెండర్లు అంటూ మాట్లాడ్డం దారుణ మన్నారు. దీనికి కోమటిరెడ్డి మరింత తీవ్రంగా స్పందిస్తూ.. ‘‘నల్లగొండ తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో బాధపడుతుంటే టీడీపీ ప్రభుత్వం పట్టించుకోకపోతే నేను 11 రోజులు నిరసన దీక్ష చేశా. వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం కాగానే నల్లగొండకు సాగర్ నీటిని అందించే ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయించిన విషయం మరిచిపోవద్దు. ఇప్పుడు 80 శాతం గ్రామాలకు మంచినీళ్లు అందుతున్న విషయం నిజమో కాదో మంత్రి తెలుసుకోవాలి. నేను ఊరకే ఆరోపణలు చేయటం లేదు. నా వద్ద అవినీతిపై సాక్ష్యాలున్నాయి. వాటిని నిరూపించ లేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను. శాశ్వతంగా రాజకీయాలు వదులుకుంటా.. ఇది నా సవాల్..’’ అని పేర్కొన్నారు. దీనిపై మళ్లీ కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘మిషన్ భగీరథలో 0.52 శాతం లెస్‌కు టెండర్లు కేటాయించామని, దీంతో ప్రజాధనం ఆదా అయిందని చెప్పారు. ఈ సమ యంలో కోమటిరెడ్డి ఏదో అంటుండటంతో ‘నేను అంకెలు చెప్తుంటే రంకెలెందుకు వేస్తున్నారని, ఈ ఆవేశం ఫ్లోరైడ్ బాధితుడిని ప్రధాని టేబుల్‌పై పడుకోబెట్టి మాట్లాడి నప్పుడు చూపి ఉంటే బాగుండేది..’ అని అన్నారు. ప్రజలకు నీళ్లు ఇస్తే తమ కాళ్ల కిందకు ఎక్కడ నీళ్లు వస్తాయోనని కాంగ్రెస్ నేతలు బుగులుపడుతున్నారన్నారు. దీంతో మళ్లీ కల్పించుకున్న కోమటిరెడ్డి.. మంత్రులకు ఇదో ఫ్యాషన్ అయిందని, గోదావరి నీటిని గ్రామాలకు తరలించే పనులు కాంగ్రెస్ చేపడితే దాన్ని మిషన్ భగీరథగా చూపి గజ్వేల్‌కు ప్రధానిని తీసుకొచ్చి నల్లా ప్రారంభించారని ఎద్దేవా చేశారు. తెలంగాణ కాంట్రాక్టర్లకు కాకుండా ఆంధ్రా కాంట్రాక్టర్లకు పనులు అప్పగించటం దారుణమని, భగీరథలో జరు గుతున్న అవినీతి దేశంలో మరెక్కడాలేదని దుయ్యబట్టారు. వెంటనే భగీరథపై సభాసంఘం వేయాలని డిమాండ్ చేశారు. ఈ సమయంలో మంత్రి హరీశ్ జోక్యం చేసుకుని.. ఓ క్లారిఫికేషన్ కోసం కోమటిరెడ్డి ఇన్నిసార్లు మైకు తీసుకుని ఆరోపణలు చేయటం సభా సమయాన్ని వృథా చేయట మేనన్నారు. అందుకు విపక్ష నేత జానారెడ్డి జోక్యం చేసుకుని పథకాన్ని తాము విమర్శించటం లేదని, అందులో జరిగిన అవినీతినే ప్రశ్నిస్తున్నామన్నారు. సభ్యుడు కోరినట్టుగా సభా సంఘాన్ని వేసి అవినీతి లేదని ప్రజలకు జవాబు చెప్పుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. కోమటిరెడ్డి ఒత్తిడికి తలొగ్గి జానారెడ్డి సభా సంఘాన్ని డిమాండ్ చేసినట్టు కనిపిస్తోందని, మొహమాటానికి వెళ్లి ఇలా అడగటం భావ్యం కాదని కేటీఆర్ అన్నారు. అందుకు జానారెడ్డి లేచి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేయా లన్న దురభిప్రాయం తమకు లేదని, సభాసంఘం వేసి వాస్తవాలు ప్రజల ముందుపెట్టాలని, దీనికి అంగీకరిం చనందున వాకౌట్ చేస్తున్నట్టు ప్రకటించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితే నేను ఎమ్మెల్యేగా ఉండను: కోమటిరెడ్డి వచ్చే ఎన్నికల్లో నెగ్గి, కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి అయితే తాను ఎమ్మెల్యేగా ఉండనని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ లాబీల్లో బుధవారం తనను కలిసిన విలేకరులతో ఆయన ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. కోమటిరెడ్డి అంటే ఏమిటో, ప్రజల సమస్యల గురించి పోరాటం ఎలా చేస్తానో ఇక ముందు చూస్తారని హెచ్చరించారు. నల్లగొండ జిల్లాలో నిర్మించాలనుకుంటున్న థర్మల్ విద్యుత్ ప్రాజెక్టుతో అనేక సమస్యలు వస్తాయని, లక్ష మందితో కలసి ఈ ప్రాజెక్టును అడ్డుకుంటానని హెచ్చరించారు. కాంగ్రెస్‌లో సీఎం అభ్యర్థిగా ఎవరిని నిర్ణయించినా.. వారితో కలసి పనిచేస్తానన్నారు. జానారెడ్డిని సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే మద్దతునిస్తానని చెప్పారు. సభా సంఘంతోనే వాస్తవాలు: కాంగ్రెస్ మిషన్ భగీరథలో అవినీతిపై సభాసంఘం వేస్తేనే వాస్తవాలు బయటకు వస్తాయని సీఎల్పీ ఉపనాయకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టి.జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం అసెంబ్లీలోని మీడియా పాయింట్ వద్ద వారు మాట్లాడారు. మిషన్ భగీరథలో 20 నుంచి 25 వేల కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వంలోని పెద్దలకు ఈ స్కామ్‌లో భాగముందన్నారు. -
'కోమటిరెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు'
హైదరాబాద్: జైపాల్ రెడ్డిని విమర్శించే స్ధాయి ఎంపీ సుమన్ కు లేదని టీపీసీసీ ఉపాధ్యాక్షుడు మల్లు రవి తెలిపారు. తెలంగాణ ఏర్పాటుపై పార్లమెంట్ ను ఒప్పించింది కేసీఆర్ కాదని, జైపాల్ రెడ్డి అని గుర్తుచేశారు. పీసీసీ చీఫ్ పై కోమటి రెడ్డి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇష్టానుసారంగా మాట్లాడటం సరిగా లేదన్నారు. పార్టీలో ఎంతటి నేతలైనా క్రమశిక్షణకు కట్టుబడాల్సిందేనన్నారు. -
నల్లగొండలో కోమటి రెడ్డికి ఎదురుదెబ్బ!
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంతనియోజక వర్గంలో జరగిన ఈ పరిణామాలు ఆయనకు గట్టి ఎదురుదెబ్బగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. -
కోమటిరెడ్డి వర్సెస్ జగదీశ్‌రెడ్డి
♦ నల్లగొండలో పరిస్థితిపై మండలిలో వాగ్వాదం ♦ జిల్లాల్లో రాజకీయం రౌడీల చేతికి వెళ్లిందన్న రాజగోపాల్‌రెడ్డి ♦ టికెట్లు కొనుక్కొని రాజకీయాలు చేస్తున్నారన్న మంత్రి జగదీశ్ సాక్షి, హైదరాబాద్: ‘‘శాంతిభద్రతలు అంటే ఒక్క హైదరాబాద్‌లోనే కాదు. జిల్లాల్లో పరిస్థితి ఘోరంగా ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా రౌడీయిజం సాగించారు. సీఎం సహా నేతలంతా గెలుపు కో సం ఎంతకైనా తెగించమని ఆదేశించారు. నల్లగొం డ రాజకీయం రౌడీల చేతుల్లోకి వెళ్లింది..’’ అంటూ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి శనివారం మండలిలో చేసిన వ్యాఖ్యలు గందరగోళానికి దారి తీశాయి. దీనిపై డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి స్పందిస్తూ.. ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా మా ట్లాడవద్దంటూ హితవు పలికారు. టీఆర్ఎస్కు ప్రజ లు అనుకూల తీర్పునిచ్చారని, ప్రజా తీర్పును జీర్ణించుకోలేక ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దని సూచించారు. సభలో ఉన్న నల్లగొండ జిల్లాకే చెందిన మంత్రి జగదీశ్వర్ రెడ్డి.. కోమటిరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో స్పందించారు. ‘‘పైసలు పెట్టి టికె ట్లు కొనుక్కొని కొందరు రాజకీయాల్లోకి వచ్చారు. పైసలతో ఏమైనా చేయొచ్చని భావించారు. రాజకీ య వ్యభిచారం చేస్తున్నారు. జిల్లాలో అరాచకం చే సిన విస్నూర్ రాంచంద్రారెడ్డి వారసులుగా కొం ద రు తయారయ్యారు. అదే సమయంలో రావి నారాయణరెడ్డి వంటి వారి వారసులు కూడా ఉన్నారు. నల్లగొండ జిల్లాలో ఒక్క రాజకీయ కేసు నమోదు కాలే దు. కొందరి వల్ల జిల్లా కలుషితం అయింది’’ అని అన్నారు. దీనిపై రాజగోపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘తెలంగాణ ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. మా సోదరులం (కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, రాజ గోపాల్‌రెడ్డి) వ్యాపారం చేసుకొని రాజకీయం చేస్తున్నాం. దొంగనోట్లు, ఇసుక దందాలు, అక్రమాలకు పాల్ప డే వారు కొందరు జిల్లాలో రాజకీయం చేస్తున్నారు. తాను ఎంపీగా ఉండి ఢిల్లీలో తెలంగాణ కో సం పోరాడితే మా అన్న మంత్రి పదవికి రాజీనా మా చేశాడు. తెలంగాణ పోరాటంతో సంబంధం లేని వాళ్లం కాదు. మా నల్లగొండ జిల్లాలో రౌడీలే రాజ్యమేలుతున్నారు..’’ అని ఆవేశంగా అన్నారు. దీంతో కడియం జోక్యం చేసుకుంటూ.. ప్రజాతీ ర్పుతో అధికారంలోకి వచ్చిన పార్టీని పట్టుకొని రౌ డీలు రాజ్యమేలుతున్నారు అనడం మంచిది కాదు. మనల్ని మనమే కించపరుచుకోవద్దు’’ అన్నారు. రౌడీలు అనే పదాన్ని ఉపసంహరించుకోవాలని ఆ దేశించాల్సిందిగా చైర్మన్ స్వామిగౌడ్‌కు విజ్ఞప్తి చేశారు. దీంతో చైర్మన్ స్పందిస్తూ... నల్లగొండను ఆంగ్లేయులు పాలించడం లేదని, ఈ ప్రభుత్వమే న డుపుతోందన్నారు. రౌడీలు అన్న పదాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. దీంతో ఆ పదాన్ని ఉప సంహరించుకున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పారు. -
రైతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి
హైదరాబాద్: తెలంగాణలో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ సోమవారం మట్లాడుతూ రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. పంటనష్టపోయిన రైతు కుటుంబానికి ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు. కాగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున మెదక్ జిల్లాలో 10 మంది, నల్లగొండ జిల్లాలో 20 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆర్థిక స్థోమత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు , ఇతర అన్ని పార్టీల కార్యకర్తలు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు. -
'గుట్ట' కాదు పంటలను చూడండి - కోమటిరెడ్డి
నల్లగొండ: ముఖ్యమంత్రి కేసీఆర్ ఆకాల వర్షాలకు పంట నష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం కురిసిన ఆకాల వర్షాల నేపథ్యంలో ఆయన నిమోజకవర్గంలోని పలు మండలాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం యాదగిరిగుట్టలో సందర్శించడం మానేసి జిల్లాలోని పంటనష్టం జరిగిన ప్రాంతాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. రైతులు తెచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. -
పొన్నాల, ఉత్తమ్ రాజీనామా చేయాలి
ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ తిప్పర్తి : కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యానికి బాధ్యత వహిస్తూ టీ-పీసీసీ ప్రెసిడెంట్, వర్కింగ్ ప్రెసిడెంట్ తమ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నల్లగొండ జిల్లా తిప్పర్తిలో ఆదివారం జరిగిన విజయోత్సవ ర్యాలీలో ఆయన మాట్లాడారు. ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన తెలంగాణ రాష్ట్రాన్ని సోనియాగాంధీ నాయకత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఇచ్చినా.. ఆ విషయాన్ని ప్రజల్లోకి తీసుకుపోవడంలో టీ-పీసీసీ వైఫల్యం చెందిందని విమర్శించారు. దీనివల్లే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలైందన్నారు. తెలంగాణ కోసం పోరాడిన వారిని పక్కనపెట్టి అనామకులకు టీపీసీసీ పగ్గాలు ఇచ్చారని.. దీంతో వారు ఎన్నికల్లో తమ నియోజకవర్గాలకే పరిమితమయ్యారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ నేతను అందరి ఎమ్మెల్యేల అంగీకారంతో ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని సూచించారు. -
సలాం.. సోనియా
నల్లగొండ : అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తమ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఇక్కడి వేదికపై నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అదే భువనగిరిలో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా కృతజ్ఞతలు తెలపాలని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్పక్షాన హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న సభకు ముందే ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో ‘సోనియాకు... తెలంగాణ సలాం’ పేర సభ జరపాలని నిర్ణయిం చారు. జిల్లా కాంగ్రెస్ నేతలు రెండు శిబిరాలుగా విడిపోయి గుంపుల లొల్లితో ఆధిపత్య రాజకీయాలు నడుపుతున్న ఈ తరుణంలో సభను ఎలాంటి ఇబ్బందులు, వివాదాల్లేకుండా విజయవంతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ కారణంగానే జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరినీ సభకు ఆహ్వానించడం లేదు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనుంచి కార్యకర్తలను మాత్రం సమీకరించనున్నారు. ఇక,తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్రమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఒకవిధంగా ఎంపీలకు మాత్రమే ప్రత్యేకమైన సభగా పేర్కొం టున్నారు. హైదరాబాద్ సభకు ముందే భువనగిరి సభ విజయవంతానికి కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు. సాక్షిప్రతినిధి, నల్లగొండ : అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తమ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఇక్కడి వేదికపై నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారు. -
'పదవులు ముఖ్యం కాదు...తెలంగాణ అభివృద్ధే ముఖ్యం'