రైతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి | komatireddy venkat reddy slams on kcr | Sakshi
Sakshi News home page

రైతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

Published Mon, Sep 14 2015 12:56 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి - Sakshi

రైతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలి

హైదరాబాద్: తెలంగాణలో వందలమంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టు ఉంటోందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. ఆయనిక్కడ సోమవారం మట్లాడుతూ రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతి కుటుంబానికి రూ. 5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వాలన్నారు. పంటనష్టపోయిన రైతు కుటుంబానికి ఎకరాకు రూ. 10 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాలన్నారు.
 
కాగా కోమటిరెడ్డి ప్రతీక్ ఫౌండేషన్ తరపున మెదక్ జిల్లాలో 10 మంది, నల్లగొండ జిల్లాలో 20 మంది రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఆర్థిక స్థోమత ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారస్తులు , ఇతర అన్ని పార్టీల కార్యకర్తలు రైతులను ఆదుకునేందుకు ముందుకు రావాలని కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement