
'ఉద్యమకారులను కేసీఆర్ అవమానిస్తున్నారు'
తెలంగాణ ఉద్యమకారులను అవమానించే విధంగా తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రవర్తిస్తున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. వేలాదిమందిపై కేసులు ఉంటే.. చిన్న చిన్న కేసులను మాత్రమే ఎత్తేస్తున్నారని, మిగిలిన వాటి సంగతి మాత్రం ఎక్కడా చెప్పడంలేదని ఆయన అన్నారు.
రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే సీఎం కేసీఆర్ గానీ, మంత్రి కేటీఆర్ గానీ ఏ ఒక్కరినైనా పరామర్శించారా అని షబ్బీర్ అలీ నిలదీశారు. ప్రజా సమస్యల మీద కేసీఆర్కు చిత్తశుద్ధి లేదని ఆయన విమర్శించారు.