
సాక్షి, హైదరాబాద్: మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్న తెలంగాణను మూడున్నరేళ్లలో లోటు బడ్జెట్ రాష్ట్రంగా మార్చారని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ విమర్శించారు. రాష్ట్రంలో అవినీతి బాగా పెరిగిపోయిందని ఆయన అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో విద్యార్థుల ఆత్మహత్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్ సర్కార్ ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని షబ్బీర్ అలీ డిమాండ్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment