
సలాం.. సోనియా
నల్లగొండ : అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తమ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
గత ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఇక్కడి వేదికపై నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకునే అదే భువనగిరిలో భారీ బహిరంగసభను నిర్వహించడం ద్వారా కృతజ్ఞతలు తెలపాలని భావిస్తున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌పక్షాన హైదరాబాద్‌లో నిర్వహించాలని ప్లాన్ చేస్తున్న సభకు ముందే ఎంపీలు, ముగ్గురు కేంద్ర మంత్రులతో ‘సోనియాకు... తెలంగాణ సలాం’ పేర సభ జరపాలని నిర్ణయిం చారు. జిల్లా కాంగ్రెస్ నేతలు రెండు శిబిరాలుగా విడిపోయి గుంపుల లొల్లితో ఆధిపత్య రాజకీయాలు నడుపుతున్న ఈ తరుణంలో సభను ఎలాంటి ఇబ్బందులు, వివాదాల్లేకుండా విజయవంతం చేయడంపై దృష్టి పెట్టారు. ఈ కారణంగానే జిల్లా కాంగ్రెస్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఎవరినీ సభకు ఆహ్వానించడం లేదు. భువనగిరి పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లనుంచి కార్యకర్తలను మాత్రం సమీకరించనున్నారు. ఇక,తెలంగాణకు చెందిన ఏడుగురు ఎంపీలు, ముగ్గురు కేంద్రమంత్రులను ఆహ్వానిస్తున్నారు. ఒకవిధంగా ఎంపీలకు మాత్రమే ప్రత్యేకమైన సభగా పేర్కొం టున్నారు. హైదరాబాద్ సభకు ముందే భువనగిరి సభ విజయవంతానికి కార్యకర్తలను భారీ సంఖ్యలో తరలించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారు.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అరవై ఏళ్ల తెలంగాణ కలను సాకారం చేసిన తమ అధినేత్రి సోనియాగాంధీకి కృతజ్ఞతలు తెలియజేసేందుకు తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు సిద్ధమవుతున్నారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం భువనగిరి పట్టణంలో భారీ బహిరంగసభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. గత ఎన్నికల సమయంలో భువనగిరిలో ప్రచారానికి వచ్చిన ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా ఇక్కడి వేదికపై నుంచి తెలంగాణ అనుకూల ప్రకటన చేశారు.