తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి.
నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్లోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా నల్లగొండ మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డుపల్లి లక్ష్మి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. శనివారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి సమక్షంలో ఆమె టీఆర్ఎస్లో చేరారు. మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సొంతనియోజక వర్గంలో జరగిన ఈ పరిణామాలు ఆయనకు గట్టి ఎదురుదెబ్బగా పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.