నల్గొండ జిల్లా భువనగిరి మున్సిపాలిటికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం టీఆర్‌ఎస్ తీర్చం పుచ్చుకున్నారు.
భువనగిరి మున్సిపల్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత
Jan 11 2016 12:19 PM | Updated on Oct 16 2018 6:35 PM
భువనగిరి: నల్గొండ జిల్లా భువనగిరి మున్సిపాలిటికి సంబంధించి బీజేపీ, కాంగ్రెస్, టీడీపీకి చెందిన 16 మంది కౌన్సిలర్లు సోమవారం ఉదయం టీఆర్‌ఎస్ తీర్చం పుచ్చుకున్నారు. ఇందుకు నిరసనగా మిగిలిన 14 మంది కౌన్సిలర్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కౌన్సిలర్ పదవులకు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ రోజు మున్సిపల్ సమావేశం జరుగుతుండగా నాటకీయంగా 16 మంది టీఆర్‌ఎస్‌లో చేరారు.
ఇంతవరకూ టీఆర్‌ఏస్‌కు ఒక్క కౌన్సిలర్ స్థానం కూడా లేదు. 30 మంది కూడా ఇతర పార్టీల వారే గెలిచారు. అయితే అధికార పార్టీ జరిపిన మంత్రాంగంతో 16 మంది టీఆర్‌ఎస్ లో చేరారు. కోరం ఉంది కాబట్టి తాము సమావేశం నిర్వహిస్తామని 16 మంది సమావేశానికి వెళ్లారు. అక్కడ మిగిలిన 14 మంది కౌన్సిలర్లు గొడవకు దిగారు. అయితే గందరగోళం మధ్యనే మున్సిపల్ సమావేశం జరుగుతోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా గట్టి పోలీస్ బందోబస్త్ ఏర్పాటు చేశారు. సమావేశ హాలు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Advertisement
Advertisement