సభ్యత్వ నమోదులో పాల్గొన్న బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు, నాయకులు
సాక్షి, భువనగిరి: తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనే అని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. మంగళవారం భువనగిరిలోని స్వామి వివేకానంద విగ్రహం వద్ద చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పీవీ శ్యాంసుందర్‌రావుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం మురళీధర్‌రావు మాట్లాడుతూ దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలు కలిగిన పార్టీ బీజేపీ అని పేర్కొన్నారు.
ఎలాంటి లాభాపేక్ష చూడకుండా నిబద్ధతతో పనిచేసే కార్యకర్తలున్న పార్టీ బీజేపీ అని కొనియాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈనెల 6న వారణాసిలో, అలాగే తెలంగాణలోని హైదరాబాద్ శంషాబాద్‌లో అమిత్‌షా బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారన్నారు. గతంలో 11 కోట్ల సభ్యత్వాలు ఉంటే ఈసంవత్సరం అదనంగా మరో 10 కోట్ల సభ్యత్వాలు చేపట్టాలని పార్టీ నిర్ణయించినట్లు చెప్పారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ పతనమవుతోందన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనేది శక్తి బీజేపీకి మాత్రమే ఉందని పేర్కొన్నారు. అనంతరం ఎల్బీనగర్ కాలనీలో నిర్వహించిన ఇంటింటి సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
ప్రతి కుటుంబానికి రూ.5లక్షలు మంజూరు చేస్తాం..
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి కుటుంబానికి కేంద్ర ప్రభుత్వమైన ఆయుష్మాన్‌భవ పథకం ద్వా రా రూ.5లక్షలు మంజూరు చేస్తోందని మురళీధర్‌రావు తెలిపారు. స్థానిక ఎల్బీనగర్ కాలనీ లో చేపట్టిన ఇంటింటి సభ్యత్వ నమోదులో ఆయన మాట్లాడారు. ఈ నిధులను మంజూరు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదన్నారు. సభ్యత్వాలు పొందిన వారి పేరు, వివరాలు ఢిల్లీలో ఉన్న పార్టీ కార్యాలయంలో ఉంటాయన్నారు. తమ కుటుంబ సభ్యుల అందరి చేత సభ్యత్వాలు చేయించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యాలయ ఇన్‌చార్జి దాసరి మల్లేషం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతంశెట్టి రవీందర్, పాశం భాస్కర్, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు వేముల అశోక్, జిల్లా ఇన్‌చార్జ్ వేముల నరేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శులు నర్ల నర్సింగరావు, పడమ టి జగన్‌మోహన్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి నీలం రమేష్, ఎండీ.మహమూద్, జిల్లా ఉపాధ్యక్షుడు మాయ దశరథ, అసెంబ్లీ కన్వీనర్ బలరాం, పట్టణశాఖ అధ్యక్షుడు చందా మహేందర్‌గుప్తా, మాజీ కౌన్సిలర్లు పట్నం రోజా, చిట్టిప్రోలు సువర్ణ, నాయకులు సుర్వి శ్రీనివాస్, చిట్టిప్రోలు శ్రీధర్, జనగాం నర్సింహాచారి, రత్నపురం శ్రీశైలం, రత్నపురం బలరాం, మేడి కోటేష్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment