
నల్లగొండ టూటౌన్: వ్యవసాయంపై ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు ఏ మాత్రం అవగాహన లేదని సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. 24 గంటల కరెంట్ వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటలు ఎండిపోయే ప్రమాదముందని మండిపడ్డారు. సోమవారం నల్లగొండలోని తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
రైతుల కోసం ఏదో చేసినట్టుగా గొప్పలు చెబుతున్న సీఎం కేసీఆర్‌కు పోయే కాలం దగ్గరికొచ్చిందని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి ఒక మోసగాడి చేతిలో మోసపోయిందని, రాష్ట్రం ఏర్పడ్డ సంతోషం లేకుండా చేశారని అన్నారు.