మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
నల్లగొండ: బీఆర్‌ఎస్, బీజేపీలకు ఓట్లేస్తే మూసీ నదిలో వేసినట్లేనని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం నల్లగొండలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలు రెండూ ఒక్కటే అని, ఆ పార్టీలను నమ్మవద్దని ప్రజ లను కోరారు. ఆగస్టు 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని.. అమలు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ అన్నట్లుగా మీ ముందుకు రాబోమని చెప్పారు.
హరీశ్‌రావు దొంగ రాజీనామా లతో మళ్లీ మోసం చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా రాదన్నారు. ఈసారి రాహుల్ గాంధీ ప్రధాని కావడం ఖాయమన్నారు. బీజేపీ నల్లగొండ అభ్యర్థికి డిపాజిట్ కూడా దక్కదన్నారు. సర్పంచ్‌గా కూడా గెలువలేని వ్యక్తిని బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థిగా పెట్టిందని ఎద్దేవా చేశారు. కాగా, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి చేసిన తరహాలో నల్లగొండ నియోజకవర్గంలోని ప్రతి గ్రామం, మండలంలో వలంటీర్లను నియమిస్తా మని కోమటిరెడ్డి వెల్లడించారు.
ఆయా గ్రామాల్లోని వలంటీర్లు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉండి ప్రభుత్వ పథ కాలు అర్హులకు అందేలా చూస్తారని, ఎన్నికల తర్వాత దీనిని అమలు చేస్తామన్నారు. గుమ్మల మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో మాజీ మంత్రి జానారెడ్డి, కాంగ్రెస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment